AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

105 కేజీల బరువు పెరిగా.. పిచ్చిపిచ్చిగా ట్రోల్ చేశారు.. హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

హీరోయిన్స్ చాలా మంది ఇప్పుడు సినిమాలకు గుడ్ బై చెప్పేశారు. కొంతమంది పెళ్లి చేసుకొని, పిల్లల్ని కానీ ఫ్యామిలీతో హ్యాపీగా గడిపేస్తున్నారు. మరికొంతమంది అవకాశాలు రాకపోవడంతో సినిమాలకు ఇండస్ట్రీకి దూరం అవుతున్నారు. ఇదిలా ఉంటే సినిమా హీరోలు, హీరోయిన్లు ఎప్పుడూ ఫిట్‌గా ఉండాలని కోరుకుంటారు.

105 కేజీల బరువు పెరిగా.. పిచ్చిపిచ్చిగా ట్రోల్ చేశారు.. హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్
Tollywood Actress
Rajeev Rayala
|

Updated on: Aug 27, 2025 | 11:35 AM

Share

చాలా మంది హీరోయిన్స్ ను ప్రేక్షకులు మర్చిపోయారు కూడా.. అయితే సినిమాలకు గుడ్ బై చెప్పి ఫ్యాన్స్ ను నిరాశపరిచిన భామల్లో ఈ ముద్దుగుమ్మ ఒకరు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించింది. వరుస సినిమాలతో ఇండస్ట్రీని అల్లాడించింది. కానీ ఇప్పుడు ఇండస్ట్రీకి దూరం అయ్యింది. పెళ్లి చేసుకొని ఫ్యామిలీతో సెటిల్ అయ్యింది. కానీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది. అంతే కాదు అప్పుడు క్రేజీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఆమె ఇప్పుడు షాకింగ్ లుక్ లోకి మారిపోయింది. ఇక ఈ ముద్దుగుమ్మ జిమ్ కు వెళ్లకుండా బరువు తగ్గింది. ఇంతకూ ఆమె ఎవరంటే..

ఆయనకు 36.. ఆమెకు19.. కట్ చేస్తే 20ఏళ్లకే తల్లయ్యింది.. చేతులారా కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్

హీరోయిన్స్ చాలా మంది ఫిట్ నెస్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉంటారు. సినిమాలకు తగ్గట్టుగా శరీర ఆకృతిని మార్చుకుంటూ ఉంటారు. పాత్రలు డిమాండ్ చేస్తే దానికి తగ్గట్టుగా మారిపోతూ ఉంటారు. ఇక ఫిట్ నెస్ కోసం జిమ్‌లో తెగ కష్టపడుతూ ఉంటారు. కానీ ఈ హీరోయిన్ మాత్రం జిమ్ కు వెళ్లకుండా బరువు తగ్గి అందరికి షాక్ ఇచ్చింది. ఇంతకూ ఆమె ఎవరంటే.. ఒకప్పుడు తన సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ముద్దుగుమ్మల్లో సమీరా రెడ్డి ఒకరు.

ఇవి కూడా చదవండి

డిప్రెషన్‌తో సూసైడ్ చేసుకోవాలనుకుంది.. కట్ చేస్తే ఇండస్ట్రీలో తోప్.. చేతినిండా సినిమాలు

టాలీవుడ్ లో స్టార్ హీరోలందరి సరసన సినిమాలు చేసింది. ఎన్టీఆర్, చిరంజీవి లాంటి టాలీవుడ్ హీరోలతో పాటు తమిళ్ లో సూర్య తోనూ సినిమా చేసి బ్లాక్ బస్టర్ అందుకుంది. కానీ ఇప్పుడు ఊహించని విధంగా సినిమాలకు దూరం అయ్యింది. ఆమె ఎవరో కాదు అందాల భామ సమీరారెడ్డి. 2005లో వచ్చిన నరసింహుడు సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది సమీరా రెడ్డి. ఆతర్వాత చిరంజీవి నటించిన జై చిరంజీవ సినిమాతో ఆకట్టుకుంది. పెళ్లి తర్వాత ఈ చిన్నది లుక్ మారిపోయింది.. బరువు పెరిగిపోయింది. హార్మోన్స్ ఇన్‌బ్యాలెన్స్ వల్ల చాలా బరువు పెరిగాను అని తెలిపింది సమీరా రెడ్డి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమీరా రెడ్డి మాట్లాడుతూ.. అప్పట్లో తన బరువు 105కేజీలకు పైగా ఉండేదని దాని వల్ల చాలా ట్రోల్స్ బారిన పడ్డాను అని తెలిపింది సమీరా. అలాగే జనాలు మంచి వాళ్లు కాదు..ఏదైనా సరే చెప్పాలనుకుంటే మొహం మీదే చెప్పేస్తారు. నా పక్క వారు కూడా నన్ను ట్రోల్ చేశారు. కానీ అవి నన్ను అంతగా బాధపెట్టలేదు. ఆ సమయంలో నేను ఎంత బాధ అనుభవిస్తున్నానో ఎవరికీ తెలియదు అందుకే నేను ఈ విషయంలో అబద్దం చెప్పాలనుకోవడం లేదు అని చెప్పుకొచ్చింది సమీరా రెడ్డి.. అలాగే ఆ మధ్య జిమ్ కు వెళ్లకుండా ఇంట్లో పనులతోనే బరువు తగ్గాను అని తెలిపింది ఈ ముద్దుగుమ్మ.

ఇదెక్కడి మాస్ రా మావ..! రామ్ చరణ్ పెద్దిలో ఫిల్మీ మోజీ.. థియేటర్స్ దుమ్ములేచిపోవాల్సిందే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.