- Telugu News Entertainment Tollywood Do you know this heroine who wanted to commit suicide due to depression is, She is Mrunal Thakur
డిప్రెషన్‌తో సూసైడ్ చేసుకోవాలనుకుంది.. కట్ చేస్తే ఇండస్ట్రీలో తోప్.. చేతినిండా సినిమాలు
సినీ సెలబ్రెటీల నుంచి సామాన్యల వరకు ఎదురుకునే సమస్యల్లో డిప్రషన్ ఒకటి.. కొంతమంది డిప్రషన్స్ ను బయటకు వచ్చారు. కొన్తమనఃది సూసైడ్ చేసుకొని చనిపోయారు కూడా.. సినీ సెలబ్రెటీలు ఎంతో మంది డిప్రషన్ బారిన బారిన పడ్డారు. అలాగే ఈ హీరోయిన్ కూడా డిప్రషన్ సమస్యను ఎదుర్కుంది.

Updated on: Aug 26, 2025 | 1:23 PM
సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు చాలా మందిని వెంటాడుతున్న సమ్యసల్లో డిప్రెషన్ ఒకటి. చాలా మంది సినీ సెలబ్రెటీలు చాలా మంది డిప్రషన్ సమస్యను ఎదుర్కొన్నారు. కొంతమంది సినిమాల విషయంలో.. మరికొంతమంది రిలేషన్స్ షిప్స్ విషయంలో డిప్రషన్ లోకి వెళ్లారు. కొంతమంది డిప్రెషన్ నుంచి బయట పడ్డారు.. మరికొంతమంది మాత్రం డిప్రెషన్ వల్ల కెరీర్ కోల్పోయారు.. మరికొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అయితే ఓ స్టార్ హీరోయిన్ కూడా డిప్రెషన్ కారణంగా సూసైడ్ చేసుకుందామనుకున్నా అని తెలిపింది. ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు అభిమానులను షాక్ కు గురి చేస్తున్నాయి. ఇంతకూ ఆ స్టార్ హీరోయిన్ ఎవరు.? ఆమెను చనిపోయే అంత సమస్య ఏమొచ్చింది.? వరుస ఆఫర్స్ తో దూసుకుపోతున్న ఆ హీరోయిన్ డిప్రెషన్ కు ఎందుకు గురైందో చూద్దాం.!
ఇది కదా సినిమా అంటే.! 8 రోజులు షూటింగ్.. రూ. 52లక్షల బడ్జెట్..!! రూ.2100కోట్లు వసూల్ చేసింది..
టాలీవుడ్ లో తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా మారిన ముద్దుగుమ్మల్లో మృణాల్ ఠాకూర్ ఒకరు. సీరియల్స్ నుంచి సినిమాల్లోకి వచ్చింది ఈ చిన్నది. బాలీవుడ్ లో సినిమాలు చేసి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. సీతారామం సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే తెలుగులో భారీ విజయాన్ని అందుకుంది.
యంగ్ హీరోలను వదిలేసి.. సీనియర్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న కుర్ర భామ.. చిరంజీవి, నాగార్జున తర్వాత ఇప్పుడు ఆయనతో..
అంతే కాదు తెలుగులో ఈ చిన్నది ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత హాయ్ నాన్న సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. ఫ్యామిలీ స్టార్ సినిమాతో ఫ్లాప్ అందుకుంది. చివరిగా కల్కి సినిమాలో చిన్న పాత్రలో మెరిసింది. ఇక ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో మృణాల్ మాట్లాడుతూ.. సీరియల్స్‌లో చేసిన తర్వాత సినిమా ఆడిషన్స్ కోసం ప్రయత్నించా.. ఆసమయంలో టీవీ నటి అంటూ చులకనగా చూశారు. ఎంతో అవమానించారు దాంతో డిప్రెషన్‌లోకి వెళ్ళా.. ఒకసారి డిప్రెషన్ తట్టుకోలేక లోకల్ ట్రైన్ నుంచి దూకి సూసైడ్ చేసుకోవాలనుకున్నా.. కానీ నా పేరెంట్స్ గుర్తొచ్చి ఆగిపోయా అని తెలిపింది. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి.
అందంలో అప్సరస.. అదృష్టం మాత్రం లేదు.. 9 సినిమాలు చేస్తే 8ఫ్లాప్స్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




