AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదెక్కడి సినిమారా బాబు..! ఐఎండీబీలో 9.2 రేటింగ్.. ఇప్పుడు ఓటీటీలోకి.. ఈ థ్రిల్లర్ ను మిస్ అవ్వకండి

థియేటర్స్ లో కొత్త సినిమాలు సందడి చేస్తున్నాయి. రకరకాల సినిమాలు థియేటర్స్ లో విడుదలై ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. రీసెంట్ గా విడుదలైన సినిమాలు థియేటర్స్ లో దుమ్మురేపుతున్నాయి. అలాగే ఓటీటీల్లోనూ సినిమాలు మెప్పిస్తున్నాయి. ఇప్పటికే ఓటీటీల్లో తెలుగు, తమిళ్, కన్నడ , హిందీ సినిమాలు మెప్పిస్తున్నాయి.

ఇదెక్కడి సినిమారా బాబు..! ఐఎండీబీలో 9.2 రేటింగ్.. ఇప్పుడు ఓటీటీలోకి.. ఈ థ్రిల్లర్ ను మిస్ అవ్వకండి
Ott Movie
Rajeev Rayala
|

Updated on: Aug 26, 2025 | 10:30 AM

Share

ఓటీటీ సినిమాలకు ఎంత డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. థియేటర్స్ లో విడుదలైన సినిమాలు ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటున్నాయి. కొత్త సినిమాలు థియేటర్స్ లో అదరగొడుతున్నాయి. ఇటీవలే విడుదలైన కూలీ, వార్ 2 సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఇక ఇప్పుడు ఓటీటీలో సినిమాలు మెప్పిస్తున్నాయి. ఓటీటీలో ఎన్నో రకాల సినిమాలు అదరగొడుతున్నాయి. ఓటీటీల్లో ముఖ్యంగా హారర్ మూవీస్, థ్రిల్లర్, కామెడీ మూవీస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తమిళ లేటెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్  ఓటీటీలోకి రాబోతోంది. ఈ సినిమా థియేటర్స్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు ఈ సూపర్ హిట్ మూవీ ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది.

ఇది కదా సినిమా అంటే.! 8 రోజులు షూటింగ్.. రూ. 52లక్షల బడ్జెట్..!! రూ.2100కోట్లు వసూల్ చేసింది..

ఈ సినిమా పేరు ‘గెవి’.. తమిళ్ లో విడుదలైన ఈ సినిమా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఐఎండీబీలో ఈ సినిమా 9.2 రేటింగ్ సొంతం చేసుకుంది. థియేటర్స్ లో దుమ్మురేపిన ఈ సినిమా ఆగస్టు 27 నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.

యంగ్ హీరోలను వదిలేసి.. సీనియర్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న కుర్ర భామ.. చిరంజీవి, నాగార్జున తర్వాత ఇప్పుడు ఆయనతో..

ఈ సినిమా కథ ఓ అటవీప్రాంతంలోని కుగ్రామంలో జరుగుతుంది. ఆ గ్రామంలో ఇద్దరు దంపతులు ఉంటారు. అయితే ఆ ఇద్దరు దంపతులు ఆ గ్రామంలో అణిచివేతకు గురవుతారు. దాంతో సినిమా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఆగ్రామంలోని ప్రజలందరూ అవినీతికి , అణిచివేతకు తిరుగుబాటు మొదలుపెడతారు. సినిమాలోని సన్నివేశాలు, స్టోరీ లైన్ తో ఎంగేజింగ్ గా సాగుతాయి. రా అండ్ రస్టిక్ గా ఈ సినిమాలోని క్యారెక్టర్స్ ఉంటాయి. ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోనూ మెప్పిస్తుంది. ఈ సినిమా 27న సన్ నెక్ట్స్ లో అందుబాటులోకి వస్తుంది. సినిమాను అస్సలు మిస్ అవ్వకండి.

అందంలో అప్సరస.. అదృష్టం మాత్రం లేదు.. 9 సినిమాలు చేస్తే 8ఫ్లాప్స్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి