- Telugu News Photo Gallery Cinema photos Aha OTT’s Indian Idol Season 4 Grand Launch Event Held in Style, See Photos
Telugu Indian Idol Season 4: గల్లీ టు గ్లోబల్.. అట్టహాసంగా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 గ్రాండ్ లాంచ్ ఈవెంట్
యువ గాయనీ, గాయకుల కోసం ఆహా ఓటీటీ నిర్వహిస్తోన్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 వచ్చేస్తోంది. ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ సింగింగ్ రియాలిటీ షో కొత్త సీజన్ ఆగస్టు 29 నుంచి ప్రారంభం కానుంది.
Updated on: Aug 25, 2025 | 9:27 PM

తీయనైన గొంతు ఉండి సింగర్ గా ఎదగాలనుకున్న ఎంతో మంది ప్రతిభావంతులకు అద్భుతమైన అవకాశాలను కల్పిస్తోంది ఆహా ఓటీటీ. ఇందులో భాగంగా తెలుగు ఇండియన్ ఐడల్ రియాలిటీ షోను సక్సెస్ ఫుల్ గా నిర్వహిస్తోంది.

ఇప్పటికే ఈ సింగింగ్ రియాలిటీ షో మూడు సీజన్లు విజయవంతంగా పూర్తయ్యాయి. ఎంతో మంది సింగర్లు తమ ట్యాలెంట్ ను ప్రపంచానికి చాట చెప్పారు. ఇప్పుడు ఆగస్టు 29 నుంచి నాలుగో సీజన్ ప్రారంభం కానుంది

ఈ నేపథ్యంలో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 గ్రాండ్ లాంఛ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది. షో న్యాయనిర్ణేతలు థమన్, కార్తీక్, గీతా మాధురి అలాగే హోస్ట్‌లు సమీరా భరద్వాజ్, శ్రీరామ చంద్ర తదితరుల ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తమ ఎనర్జిటిక పెర్ఫామెన్స్ తో ఆహూతులను అలరించారు తమన్, కార్తీక్, గీతా మాధురి. అలాగే సమీరా, శ్రీరామ చంద్రలు కూడా తమదైన పంచులతో ఈ ఈవెంట్ ను రక్తి కట్టించారు.

'గల్లీ టు గ్లోబల్', 'మనమే రా ఐడల్' అనే థీమ్ కాన్సెప్టుతో ఈ సారి ఇండియన్ ఐడల్ సీజన్ ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు

కాగా ఇటీవలే తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 ప్రోమో విడుదలైంది. ఇందులో మిరాయ్ హీరో తేజ సజ్జా కూడా సందడి చేశాడు. ఆగస్టు 29 నుంచి ఈ షో ప్రారంభం కానుంది.




