- Telugu News Photo Gallery Cinema photos Pradeep Ranganathan's Double Diwali Release A Box Office Balancing Act
Pradeep Ranganathan: తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ కు వింత సమస్య.. ఎలా బయటపడతాడో పాపం
ఈ రోజుల్లో హీరోలు ఒకే ఏడాది 2 సినిమాలు చేయడమే కష్టంగా ఉంది.. అది కూడా ఒకే సీజన్.. ఒకే రోజు రెండు సినిమాలతో రావడం అనేది దాదాపు అసాధ్యం. కానీ ఇప్పుడో హీరో విషయంలో ఈ అసాధ్యమే సాధ్యమయ్యేలా కనిపిస్తుంది. తెలియకుండానే తన రెండు సినిమాల మధ్య ఇరుక్కుపోతున్నాడు ఓ హీరో. మరి ఆయనెవరు..? ఏంటా సినిమాలు..?
Updated on: Aug 26, 2025 | 12:25 PM

ప్రదీప్ రంగనాథన్.. పెద్దగా పరిచయాలు అవసరం లేని పేరు. ధనుష్‌కు డూప్‌లా కనిపిస్తుంటారు ఈ కుర్ర హీరో. దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చినా.. హీరోగా బిజీ అయిపోయారు ప్రదీప్.

లవ్ టుడే, డ్రాగన్ సినిమాతో మనోడి రేంజ్ అమాంతం పెరిగిపోయింది. కేవలం తమిళంలోనే కాదు.. తెలుగులోనూ ప్రదీప్ రంగనాథన్ మార్కెట్ పెరిగింది.

ప్రదీప్ రంగనాథన్‌కు ఇప్పుడు తెలుగు, తమిళం నుంచి ఆఫర్స్ వరసగా వస్తున్నాయి. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో LIK సినిమాలో నటిస్తున్నారు. లవ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ ఫుల్ నేమ్.

ఈ సినిమాకు నయనతార నిర్మాత. ఇందులో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. LIKను అక్టోబర్ 17న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఇక్కడే వచ్చింది అసలు సమస్య.. దివాళికి ఆల్రెడీ ప్రదీప్ రంగనాథన్ నటిస్తున్న డ్యూడ్ రిలీజ్ డేట్ లాక్ అయింది.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కీర్తిశ్వరన్ దర్శకుడు. మమితా బైజు హీరోయిన్. దివాళికే ఈ సినిమాను విడుదల చేస్తామంటూ ప్రకటించారు మైత్రి మూవీ మేకర్స్. ఒకేరోజు కాకపోయినా.. వారం గ్యాప్‌లోనే ఈ సినిమాలు విడుదల కానున్నాయి. మరి దీన్ని ప్రదీప్ ఎలా బ్యాలెన్స్ చేస్తారో..?




