AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాప్ రే బాప్..! ఈమె ప్రేమిస్తే సినిమా హీరోయినా..? ఎంత మారిపోయింది..!!

2004లో విడుదలైన ప్రేమిస్తే సినిమా ప్రేమకథా చిత్రాల్లో ఓ సెన్సేషన్ అనే చెప్పుకోవచ్చు. నిజ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ విషాద ప్రేమకథకు ఇప్పటికీ ఫ్యాన్స్‌ ఉన్నారు. బాలాజీ శక్తి వేల్ దర్శకత్వం వహించిన ఈ ట్రెండ్‌ సెట్టర్‌ లవ్‌స్టోరీలో భరత్, సంధ్య ప్రేమికులుగా నటించారు. హీరోయిన్‌గా సంధ్యకు ఇదే మొదటి సినిమా.

బాప్ రే బాప్..! ఈమె ప్రేమిస్తే సినిమా హీరోయినా..? ఎంత మారిపోయింది..!!
Premisthe
Rajeev Rayala
|

Updated on: Aug 27, 2025 | 1:58 PM

Share

సినిమా ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు ప్రేక్షకులకు ఎప్పటికీ మర్చిపోని విధంగా తెరకెక్కుతాయి. ఎన్నిసార్లు చూసిన బోర్ కొట్టని సినిమాలు ఎన్నో ఉన్నాయ్. ప్రేక్షకుల మనస్సులో చెరగని ముద్ర వేసుకున్న సినిమాల్లో ప్రేమకథ చిత్రాలు ఎక్కువే. అందమైన ప్రేమకథతో తెరకెక్కిన సినిమాలు చాలా వరకు విషాదంతోనే ఎండ్ అవుతున్నాయి. ఇక అలాంటి సినిమాల్లో ప్రేమిస్తే సినిమా ఒకటి. సినీ ప్రియుల మదిలో ఎప్పటికీ నిలిచిపోయే ప్రేమకథ చిత్రం ప్రేమిస్తే . 2004లో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. అంతే కాదు అప్పట్లో ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది.

ఇది కదా సినిమా అంటే.! 8 రోజులు షూటింగ్.. రూ. 52లక్షల బడ్జెట్..!! రూ.2100కోట్లు వసూల్ చేసింది..

ప్రేమికులు ఈ సినిమాను తెగ చూశారు. యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ విషాద ప్రేమకథ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. అలాగే ఈ మూవీలోని పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పటికి ఈ సినిమా పాటలు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ యూట్యూబ్‏లో మిలియన్ వ్యూస్ అందుకుంటున్నాయి ఆ సాంగ్స్.

ఇవి కూడా చదవండి

యంగ్ హీరోలను వదిలేసి.. సీనియర్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న కుర్ర భామ.. చిరంజీవి, నాగార్జున తర్వాత ఇప్పుడు ఆయనతో..

తమిళంతోపాటు తెలుగులోనూ ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అలాగే లవ్ ఫెయిల్యూర్ కుర్రాళ్లకు ఈ సినిమా ఫేవరేట్. డైరెక్టర్ బాలాజీ శక్తివేల్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో తమిళ్ హీరో భరత్, సంధ్య ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాతోనే కథానాయికగా పరిచయం అయ్యింది సంధ్య. తొలి సినిమాతోనే అందం, అభియనంతో అందరినీ ఆకట్టుకుంది సంధ్య. ప్రేమిస్తే సినిమా తర్వాత సంధ్యకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఆఫర్స్ కూడా భారీగానే వచ్చాయి. కానీ ఈ అమ్మడు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ప్రేమిస్తే సినిమా తర్వాత చాలా సినిమాల్లో సహాయక పాత్రల్లో నటించింది. ఇక తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అన్నవరం చిత్రంలో పవన్ చెల్లిగా చేసింది. అన్నవరం సినిమాలో వరలక్ష్మీ అనే అమాయకపు పల్లెటూరి అమ్మాయిగా సహజ నటనతో మెప్పించింది. ఈ సినిమా కూడా సంధ్యకు సక్సెస్ మాత్రం రాలేదు. ఆతర్వాత ఇండస్ట్రీకి దూరమైంది. 2015లో చెన్నైకి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అర్జున్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఫ్యామిలీతో హ్యాపీగా గడుపుతోన్న సంధ్య సోషల్ మీడియాలోనూ పెద్దగా యాక్టివ్ గా ఉండదు. ఆమెకు సంబందించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

అందంలో అప్సరస.. అదృష్టం మాత్రం లేదు.. 9 సినిమాలు చేస్తే 8ఫ్లాప్స్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.