Bigg Boss Telugu 9: డ్రగ్స్ కేసులో 3 నెలలు జైలులో.. ఇప్పుడు బిగ్ బాస్‌లోకి టాలీవుడ్ కాంట్రవర్సీ హీరోయిన్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9కు ముహూర్తం ముంచుకొస్తుంది. ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో కొత్త సీజన్ సెప్టెంబర్ 05 నుంచి స్టార్ట్ కావొచ్చని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ఓ అధికారిక ప్రకటన వెలువడనుంది.

బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 9 త్వరలోనే మొదలు కాబోతుంది. సెప్టెంబర్ 05న బిగ్ బాస్ కొత్త సీజన్ గ్రాండ్ లాంఛింగ్ ఉంటుందని తెలుస్తోంది. దీనికి సంబంధించి అతి త్వరలోనే ఓ అధికారిక ప్రకటన రానుంది. కాగా ఈ సారి షోను మరింత స్పెషల్ గా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. టాస్కులు, గేమ్స్ ల విషయంలో సరికొత్త నిబంధనలు అమలు చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సీజన్ లో మరో స్పెషాలిటీ ఉంది. అదే కామన్ మ్యాన్ కాన్సెప్ట్. ‘అగ్ని పరీక్ష’ అనే కంటెస్ట్ ద్వారా 15 మంది సామాన్యులను ఎంపిక చేసి ఓటింగ్ లో పెట్టారు. వీరిలో 5 మంది బిగ్ బాస్ హౌస్ లోపలకు వెళ్లనున్నారు. వారెవరన్నది బిగ్ బాస్ గ్రాండ్ లాంఛింగ్ దాకా తెలియదు. ఇక ఎప్పటిలాగే పలువురు వెండితెర, బుల్లితెర సెలబ్రిటీలు ఈసారి హౌస్ లోకి అడుగు పెట్టనున్నారు. అందులో కొందరు హీరోయిన్స్ కూడా ఉన్నట్లు టాక్. నరసింహ నాయుడు, నువ్వు నాకు నచ్చావ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆశా శైనీ అలియాస్ ఫ్లోరా శైనీ ఈసారి హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు టాక్. అయితే ఆమెతో పాటు మరో హీరోయిన్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఆమెనే సంజనా గల్రానీ.
2005లో తరుణ్ నటించిన సోగ్గాడు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది సంజనా గల్రానీ. ఆ తర్వాత ప్రభాస్ బుజ్జిగాడుతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో త్రిష చెల్లెలిగా ఈ అమ్మడి క్యూట్ యాక్టింగ్ కు మంచి మార్కులే పడ్డాయి. వీటి తర్వాత రాజశేఖర్ సత్యమేవ జయతే, శ్రీకాంత్ దుశ్శాసన, ముగ్గురు, యమహో యమహా, అవును 2, సర్దార్ గబ్బర్ సింగ్ తదితర చిత్రాల్లోనూ నటించి మెప్పించిందీ అందాల తార. ఇక కన్నడతో పాటు వివిధ భాషల్లో సంచలన విజయం సాధించిన దండుపాళ్యం సినిమాలో నెగెటివ్ పాత్రతో అందరినీ భయ పెట్టింది.
భర్త పిల్లలతో నటి సంజనా గల్రానీ..
View this post on Instagram
సినిమాల సంగతి పక్కన పెడితే.. 2020 కరోనా టైమ్ లో ఓ డ్రగ్స్ కేసులో సంజన గల్రానీ అరెస్ట్ అయ్యింది. మూడు నెలలు జైలు శిక్ష కూడా అనుభవించింది. అయితే బెయిల్‌పై బయటకు వచ్చింది. అప్పట్లో సంజనా అరెస్ట్ సినిమా ఇండస్ట్రీలో తీవ్ర సంచలనం రేకెత్తించింది. అదే ఏడాది బెంగుళూరుకు చెందిన అజీజ్ పాషా అనే వైద్యుడిని పెళ్లి చేసుకున్న సంజనా మక్కాను సందర్శించడం, బుర్ఖా ధరించడం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం ఈ అమ్మడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవలే రెండో బిడ్డకు జన్మనిచ్చిన సంజనా బిగ్ బాస్ లోకి వస్తుందో.. రాదో తెలియాలంటే షో లాంచింగ్ వరకు ఆగాల్సిందే.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








