AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Arshdeep Singh : అర్ష్‌దీప్ సింగ్ రికార్డుల వేట.. బుమ్రా, ట్రెంట్ బౌల్ట్‌లను వెనక్కి నెట్టి సరికొత్త చరిత్ర

Arshdeep Singh : ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. గురువారం చెన్నై వేదికగా జరిగిన సూపర్-8 పోరులో భారత్ 72 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. ఈ విజయంతో భారత్ సెమీఫైనల్ బెర్త్‌కు అడుగు దూరంలో నిలిచింది.

Arshdeep Singh : అర్ష్‌దీప్ సింగ్ రికార్డుల వేట.. బుమ్రా, ట్రెంట్ బౌల్ట్‌లను వెనక్కి నెట్టి సరికొత్త చరిత్ర
Arshdeep Singh
Rakesh
|

Updated on: Feb 27, 2026 | 4:40 PM

Share

Arshdeep Singh : ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. గురువారం చెన్నై వేదికగా జరిగిన సూపర్-8 పోరులో భారత్ 72 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. ఈ విజయంతో భారత్ సెమీఫైనల్ బెర్త్‌కు అడుగు దూరంలో నిలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. ఇది టీ20ల్లో భారత్‌కు అత్యధిక స్కోరు కాగా, వరల్డ్ కప్ చరిత్రలో రెండో అతిపెద్ద స్కోరు. బ్యాటర్లు శివాలెత్తిన వేళ, బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్ సరికొత్త రికార్డులతో చరిత్ర సృష్టించాడు.

ఈ మ్యాచ్‌లో టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ రికార్డుల వేట సాగించాడు. జింబాబ్వేపై 4 ఓవర్లలో కేవలం 24 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో టీ20 వరల్డ్ కప్ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఇప్పటివరకు 33 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్న జస్ప్రీత్ బుమ్రాను అర్ష్‌దీప్ అధిగమించాడు. కేవలం 19 మ్యాచుల్లోనే అర్ష్‌దీప్ 35 వికెట్లు తీసి ఈ ఘనత సాధించడం విశేషం. బుమ్రా 23 మ్యాచుల్లో 33 వికెట్లు తీయగా, అశ్విన్ (32 వికెట్లు), హార్దిక్ పాండ్యా (29 వికెట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

అంతేకాకుండా టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఒక లెఫ్ట్ ఆర్మ్ పేసర్‌గా అత్యధిక వికెట్లు తీసిన ప్రపంచ రికార్డును కూడా అర్ష్‌దీప్ తన పేరిట రాసుకున్నాడు. న్యూజిలాండ్ స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ (34 వికెట్లు) రికార్డును అతను బద్దలు కొట్టాడు. 257 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వేను భారత బౌలర్లు కట్టడి చేశారు. ఆ జట్టు ఓపెనర్ బ్రయన్ బెనెట్ (97 నాటౌట్) ఒంటరి పోరాటం చేసినా, మిగిలిన వారు విఫలమవడంతో జింబాబ్వే 184 పరుగులకే పరిమితమైంది. అర్ష్‌దీప్ మినహా మిగిలిన భారత బౌలర్లు పరుగులు ధారాళంగా సమర్పించుకోవడం కొసమెరుపు.

భారత్ సాధించిన ఈ విజయంతో సౌతాఫ్రికా సెమీఫైనల్‌కు అర్హత సాధించగా, గ్రూప్-1 నుంచి రెండో సెమీస్ బెర్త్ కోసం భారత్, వెస్టిండీస్ మధ్య పోటీ నెలకొంది. ఆదివారం వెస్టిండీస్‌తో జరగబోయే మ్యాచ్‌లో గెలిస్తే భారత్ అధికారికంగా సెమీస్ చేరుతుంది. బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ విధ్వంసానికి సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజాలే ఫిదా అవ్వగా, బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్ స్వదేశీ బుమ్రాగా తన ముద్ర వేస్తున్నాడు. భారత్ ఇదే ఫామ్ కొనసాగిస్తే రెండోసారి టీ20 ప్రపంచ కప్ అందుకోవడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us