AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HDFC: హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు షాకింగ్ న్యూస్.. ఆ ఛార్జీలు భారీగా పెంపు.. ఇక నుంచి బాదుడే..

హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు బిగ్ అలర్ట్. లాకర్ల నిర్వహణకు సంబంధించి కీలక మార్పులు చేసింది. ఇక నుంచి లాకర్లను యాక్సెస్ చేయాలంటే ఆధార్ బయోమెట్రిక్ వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. ఇక లాకర్ల ఛార్జీలను కూడా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ భారీగా పెంచింది. వాటి వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

HDFC: హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు షాకింగ్ న్యూస్.. ఆ ఛార్జీలు భారీగా పెంపు.. ఇక నుంచి బాదుడే..
HDFC Bank
Venkatrao Lella
|

Updated on: Feb 27, 2026 | 4:06 PM

Share

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లాకర్ల రూల్స్‌లో కీలక మార్పులు చేసింది. లాకర్లను కస్టమర్లు యాక్సెస్ చేసుకునే రూల్స్‌ను కఠినతరం చేసింది. ఇక నుంచి లాకర్లను ఓపెన్ చేయాలంటే ఖచ్చితంగా ఆధార్ అథెంటికేషన్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియ పూర్తి చేస్తేనే లాకర్‌ను వినియోగదారులు యాక్సెస్ చేయగలరు. లాకర్లను యాక్సెస్‌ చేసే ముందు వినియోగదారులు అందరూ తప్పనసరిగా ఆధార్ ఆథెంటికేషన్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుందని, అప్పుడే లాకర్‌కు యాక్సెస్ మంజూరు అవుతుందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తెలిపింది. ఇక నుంచి బ్యాంక్ ప్రతినిధిని లాకర్ గది బయటే ఉంచుతారు. లాకర్ సురక్షితంగా ఉందని నిర్ధారించేందుకు ఇది ఉపయోగపడుతుందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్పష్టం చేసింది.

లాకర్ ఎలా యాక్సెస్ చేయాలంటే..?

ఇక నుంచి హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లు తమ లాకర్‌ను యాక్సెస్ చేయాలంటే ముందుగా ఆధార్‌తో అనుసంధానమైన బయోమెట్రిక్ వివరాలను అందించాల్సి ఉంటుంది. ఆ బయోమెట్రిక్ వివరాలు ఉపయోగించే లాకర్లను యాక్సెస్ చేసుకోవచ్చు. లేకపోతే లాకర్లను తెరవడానికి కుదరదు. ఇప్పటినుంచి కాగిత రహిత విధానంలోని లాకర్ల యాక్సెస్‌ను మార్చుతున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్పష్టం చేసింది. లాకర్లకు భద్రత కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంక్ అధికారులు తెలిపారు. సురక్షితంగా, సమర్థవంతంగా లాకర్లను నిర్వహించుకునేందుకు ఈ ప్రక్రియ ఏర్పడుతుందని స్పష్టం చేశారు. ఇక కస్టమర్లు లాకర్లను తెరిచి ఉపయోగించుకున్న తర్వాత బ్రాంచ్ కస్టోడియన్లు తిరిగి చెక్ చేయాల్సిన అవసరం ఉందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన ప్రకటనలో స్పష్టం చేసింది.

లాకర్ ఫీజులు పెంపు

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లాకర్ల హోల్డర్లకు షాక్ ఇచ్చింది. లాకర్ల ఫీజులను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మెట్రో, అర్బన్, సెమీ అర్టన్, గ్రామీణ ప్రాంతాల్లో లాకర్ల ఛార్జీలను పెంచింది. మెట్రో నగరాల్లో లాకర్లను ఉపయోగించుకునేందుకు ఏడాదికి రూ.5 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం రూ.2,250గా ఉన్న వార్షిక ఫీజులను ఒకేసారి భారీగా పెంచింది. ఇక పెద్ద లాకర్ల ఛార్జీలను రూ.10 వేల నుంచి రూ.15 వేలకు పెంచింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారమే వీటిని పెంచినట్లు వెల్లడించింది. దాదాపు దశాబ్దం తర్వాత లాకర్ల ఛార్జీలను మార్కెట్ ప్రమాణాలకు అనుగుణంగా పెంచినట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్పష్టం చేసింది. కాగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకుల్లో హెచ్‌డీఎఫ్‌సీ 10వ స్థానంలో ఉండగా.. దేశంలో తొలి స్థానంలో నిలిచింది. లాకర్లకు అదనపు భద్రత, నిర్వహణ ఖర్చుల కారణంగా ఛార్జీలను పెంచినట్లు స్పష్టం చేసింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి.

Follow Us