AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI: బ్యాంక్ అకౌంట్ ఉన్నవాళ్లకు గుడ్ న్యూస్.. ఆర్బీఐ కీలక ఆదేశాలు.. ఇక ఆ బాధ ఉండదు..

డిజిటల్ బ్యాంకింగ్ రోజురోజుకూ పెరుగుతున్నా.. అందులోని పారదర్శకతపై అనుమానాలు అలాగే ఉన్నాయి. కస్టమర్ల అనుమతి లేకుండానే సేవలను యాక్టివేట్ చేయడం, దాగుడుమూతల ఛార్జీలు విధించడంపై ఆర్‌బీఐ కొరడా ఝుళిపించింది. బ్యాంకులు తమ వెబ్‌సైట్లు, మొబైల్ యాప్‌లలో వినియోగదారులను మోసం చేసే డార్క్ ప్యాటర్న్స్‌‌పై కీలక ఆదేశాలు జారీ చేసింది.

RBI: బ్యాంక్ అకౌంట్ ఉన్నవాళ్లకు గుడ్ న్యూస్.. ఆర్బీఐ కీలక ఆదేశాలు.. ఇక ఆ బాధ ఉండదు..
Rbi Orders Banks To Remove Dark Patterns From Apps
Krishna S
|

Updated on: Feb 27, 2026 | 4:07 PM

Share

డిజిటల్ బ్యాంకింగ్ యుగంలో మన చేతిలో మొబైల్ ఉంటే చాలు.. బ్యాంకింగ్ పనులన్నీ చిటికెలో పూర్తవుతాయి. అయితే ఈ సౌలభ్యంతో పాటు కొన్ని ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. ముఖ్యంగా బ్యాంక్ యాప్‌లు, వెబ్‌సైట్ల రూపకల్పనలో వినియోగదారులను తప్పుదారి పట్టించే డార్క్ ప్యాటర్న్స్ పట్ల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి మోసపూరిత విధానాలకు స్వస్తి పలకాలని బ్యాంకులకు గడువు విధించింది.

ఏమిటీ డార్క్ ప్యాటర్న్స్?

బ్యాంకింగ్ సేవలను వాడుకునేటప్పుడు మనకు తెలియకుండానే అదనపు ఛార్జీలు పడటం, అవసరం లేని ఇన్సూరెన్స్ లేదా సర్వీసులను పదేపదే పాప్ అప్‌ల ద్వారా చూపించడం, క్లిష్టమైన నిబంధనలతో గందరగోళానికి గురిచేయడం వంటి వాటిని డార్క్ ప్యాటర్న్స్ అంటారు. ఇవి వినియోగదారులను తప్పుదోవ పట్టించి, డబ్బులు ఖర్చు పెట్టేలా చేస్తాయి.

ఆర్‌బీఐ కీలక ఆదేశాలు.. 2026 జూలై డెడ్ లైన్

వినియోగదారుల ప్రయోజనాలను రక్షించడానికి ఆర్‌బీఐ రెస్పాన్సిబుల్ బిజినెస్ కండక్ట్ అమెండ్మెంట్ డైరెక్షన్ 2026 ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది.

  • బ్యాంకులు తమ వెబ్‌సైట్లు, మొబైల్ యాప్‌లలో ఉన్న అన్ని రకాల డార్క్ ప్యాటర్న్స్‌ను 2026 జూలై నాటికి పూర్తిగా తొలగించాలి.
  • ఆర్థిక ఉత్పత్తులను ప్రచారం చేసేటప్పుడు వినియోగదారులను తప్పుదారి పట్టించే ప్రకటనలు చేయకూడదు.
  • ఏదైనా కొత్త సేవను అందించే ముందు లేదా అదనపు ఛార్జీ విధించే ముందు వినియోగదారుడి నుండి స్పష్టమైన అనుమతి తీసుకోవడం తప్పనిసరి.

వినియోగదారులకు కలిగే లాభాలు:

  • తాము తీసుకునే సేవలు, వాటి ఛార్జీల గురించి పూర్తి అవగాహన ఏర్పడుతుంది.
  • తెలియకుండా జరిగే లావాదేవీలు ఆగిపోతాయి.
  • పారదర్శకమైన విధానాల వల్ల బ్యాంకింగ్ వ్యవస్థపై కస్టమర్ల విశ్వాసం పెరుగుతుంది.

ఆర్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయం డిజిటల్ బ్యాంకింగ్‌ను మరింత సురక్షితంగా, బాధ్యతాయుతంగా మార్చనుంది. వినియోగదారులు కూడా బ్యాంకింగ్ యాప్‌లను ఉపయోగించేటప్పుడు నిబంధనలను జాగ్రత్తగా చదవడం మంచిది.

Follow Us
ప్రచార పర్వంలో AI బొమ్మ !! ఖర్చు తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే
ప్రచార పర్వంలో AI బొమ్మ !! ఖర్చు తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే
'వాడికి శ్రీముఖి పై క్రష్ ఉంది!' న్యాయవాదిపై మంగ్లీ షాకింగ్ ఆరోపణ
'వాడికి శ్రీముఖి పై క్రష్ ఉంది!' న్యాయవాదిపై మంగ్లీ షాకింగ్ ఆరోపణ
విజయ్‌కి బిగ్‌ షాక్‌.. లోకల్‌ ఛానల్‌లో 'జననాయగన్‌' మూవీ..
విజయ్‌కి బిగ్‌ షాక్‌.. లోకల్‌ ఛానల్‌లో 'జననాయగన్‌' మూవీ..
అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చరణ్.. ఆ మ్యాగజైన్‌లో ఈ ఇద్దరికే చోటు
అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చరణ్.. ఆ మ్యాగజైన్‌లో ఈ ఇద్దరికే చోటు
మూడు నెలలకే.. గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు..
మూడు నెలలకే.. గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు..
ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం
ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం
నెలకు రూ.20 లక్షలే.. మంగ్లీ ఖాతాలో డబ్బే డబ్బు ??
నెలకు రూ.20 లక్షలే.. మంగ్లీ ఖాతాలో డబ్బే డబ్బు ??
అబ్బాయిల వీక్‌నెస్సే.. నెలకు రూ.11 లక్షలు తెచ్చిపెడుతోంది ??
అబ్బాయిల వీక్‌నెస్సే.. నెలకు రూ.11 లక్షలు తెచ్చిపెడుతోంది ??
కలెక్షన్స్‌లో 57% డ్రాపయిందా? ఇంకా కష్టపడాలి డెకాయిట్ !!
కలెక్షన్స్‌లో 57% డ్రాపయిందా? ఇంకా కష్టపడాలి డెకాయిట్ !!
ఏపీ ఇంటర్ ఫలితాలను త్వరగా.. ఈజీగా ఇలా చెక్ చేసుకోండి..
ఏపీ ఇంటర్ ఫలితాలను త్వరగా.. ఈజీగా ఇలా చెక్ చేసుకోండి..