రూ.130కోట్ల బడ్జెట్.. సినిమా డిజాస్టర్.. హీరో ఫోన్ కూడా చేయలేదు.. రెమ్యునరేషన్ మాత్రం డబుల్ వసూల్ చేశాడు
బాక్సాఫీస్ దగ్గర ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా రేంజ్ లో విడుదలవుతున్నాయి. తెలుగు, తమిళ్, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. అలాగే సినిమాలు కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. వందల కోట్ల బడ్జెట్ తో సినిమాలు తెరకెక్కించి ప్రేక్షకులను అలరిస్తున్నారు. కానీ కొన్నిసార్లు సినిమాలు డిజాస్టర్ అవుతుంటాయి.

ఈ మధ్య కాలంలో విడుదలవుతున్న సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. భారీ బడ్జెట్ తో సినిమాలు తెరకెక్కిస్తున్నారు నిర్మాతలు. ఒకొక్క సినిమాకు వందకోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తెరకెక్కిస్తున్నారు. హీరోలకు కూడా భారీగా రెమ్యునరేషన్ ఇస్తున్నారు. పెద్ద పెద్ద హీరోల సినిమాలకు మినిమమ్ రూ.200, రూ. 300కోట్లతో సినిమాలు తెరకెక్కిస్తున్నారు. సినిమా అయితేపర్లేదు .. కానీ సినిమా ఏ మాత్రం బెడిసికొట్టిన నిర్మాతలు, డిస్టిబ్యూటర్స్ మునిగిపోతారు. ఈ క్రమంలోనే ఓ స్టార్ హీరో సినిమా వల్ల తన కెరీర్ నాశనం అయిపోయింది.. సినిమా కోసం ఆస్తులన్నీ అమ్మి తెరకెక్కించా.. సినిమా డిజాస్టర్ అయ్యింది. కనీసం ఆ హీరో కూడా ఫోన్ చేయలేదు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.. ఇంతకూ స్టార్ హీరో ఎవరు..? ఆ నిర్మాత ఎవరు.? ఆ డిజాస్టర్ సినిమా ఎదో తెలుసా.?
ఆయనకు 36.. ఆమెకు19.. కట్ చేస్తే 20ఏళ్లకే తల్లయ్యింది.. చేతులారా కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్
తమిళ్ స్టార్ హీరోల్లో నెంబర్ వన్ గా కొనసాగుతున్న హీరో దళపతి విజయ్. తమిళ్ ఇండస్ట్రీలో స్టార్ గా రాణిస్తున్న విజయ్.. రీసెంట్ డేస్ లో భారీ సినిమాలు చేశారు. ఆయన సినిమా రిజల్ట్ తో సంబంధ లేకుండా కలెక్షన్స్ భారీగా కొల్లగొడుతున్నాయి. విజయ్ నటించిన సినిమాలు మొదటి రోజే ఈజీగా రూ. 100కోట్లు రాబడుతున్నాయి. అయితే ఆ మధ్య విజయ్ నటించిన సినిమా ఒకటి భారీ డిజాస్టర్ అయ్యింది. ఆ సినిమా ఎదో కాదు 2015లో వచ్చిన పులి.
అబ్బో.. ఇది కదా మార్పు అంటే..! ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి.. ఇప్పుడు తోప్ హీరోయిన్
విజయ్ నటించిన పులి సినిమాలో హన్సిక హీరోయిన్ గా నటించింది. అలాగే శ్రుతిహాసన్ , శ్రీదేవి, కిచ్చ సుదీప్ ఇలా చాలా మంది నటించారు. చింబు దేవన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా నిర్మాతగా విజయ్ మాజీ మేనేజర్, సినీ నిర్మాత పీటీ సెల్వకుమార్ నిర్మించారు. తొలిరోజే డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది పులి. ఈ సినిమాతో నిర్మాత, డిస్టిబ్యూటర్స్ భారీగా నష్టపోయారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పీటీ సెల్వకుమార్ మాట్లాడుతూ.. పులి’ చిత్రాన్ని ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని విడుదల చేశాం.. సినిమా రిలీజ్ కు ముందే సినిమా పై కుట్ర చేశారు. 27 ఏళ్ల కష్టార్జితం మొత్తం ఆ సినిమా కోసం పెట్టాను. కానీ సినిమా డిజాస్టర్ అయ్యింది. నాకు చాలా బాధ వేసింది. నా ప్లేస్ లో మరొకరు ఉంటే ఆత్మహత్య చేసుకునేవారు. సినిమా ఫ్లాప్ అయితే విజయ్ కనీసం పట్టించుకోలేదు.. ఫోన్ చేసి పరామర్శించలేదు. పైగా రెమ్యునరేషన్ కోసం ఇబ్బంది పెట్టాడు. అప్పటివరకు రూ. 25కోట్లు తీసుకున్న విజయ్ పులి సినిమాకు రూ.45 కోట్లు ఛార్జ్ చేశాడు.. అని చెప్పి షాక్ ఇచ్చాడు.
ఇదెక్కడి మాస్ రా మావ..! రామ్ చరణ్ పెద్దిలో ఫిల్మీ మోజీ.. థియేటర్స్ దుమ్ములేచిపోవాల్సిందే
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








