AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదెక్కడి ట్విస్ట్ రా మావ..! ఈ సీనియర్ హీరోయిన్ భర్త టాలీవుడ్ హీరోనా..!! ఏ ఏ సినిమాలు చేశాడంటే

సింధూర పువ్వు సినిమాతో కుర్రకారు హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంటి నటి నిరోషా రాధ. అప్పట్లో తన అందం, అభినయంతో అందరినీ మెస్మరైజ్ చేసిన ఈ బ్యూటీ మరెవరో కాదు స్టార్ హీరోయిన్ రాధిక చెల్లెలు. కోలీవుడ్ ప్రముఖ నటుడు ఎం. ఆర్. రాధా కూతురు కూడా. రాధికా సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా స్టేటస్ సొంతం చేసుకన్నాక నిరోషా వెండితెరకు పరిచయమైంది.

ఇదెక్కడి ట్విస్ట్ రా మావ..! ఈ సీనియర్ హీరోయిన్ భర్త టాలీవుడ్ హీరోనా..!! ఏ ఏ సినిమాలు చేశాడంటే
Nirosha
Rajeev Rayala
|

Updated on: Aug 28, 2025 | 11:53 AM

Share

ఒకానొక సమయంలో హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన అందాల తార నిరోష. శ్రీలంక రాజధాని కొలంబోలో పుట్టి పెరిగిందీ ఈ సీనియర్ హీరోయిన్ . తెలుగుతో పాటు తమిళ్ సినిమాల్లోనూ హీరోయిన్ గా మెరిసింది నిరోష. నటించింది తక్కువ సినిమాలే అయినా తన అందం, అభినయంతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో కూడా స్క్రీన్ షేర్ చేసుకుందీ అందాల తార. తెలుగులో నారీ నారీ నడుమ మురారి, మహాజనానికి మరదలు పిల్ల, స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్ ఇలా పలు సినిమాలు చేసింది. కేవలం సినిమాలే కాదు సీరియల్స్ బాగా చూసే వారికి కూడా ఈ ముద్దుగుమ్మ బాగా పరిచయమే. తెలుగులో పలు సూపర్ హిట్ సీరియల్స్ లో నటించి మెప్పించిందీ అందాల తార. అయితే ఆమె భర్త టాలీవుడ్ లో స్టార్ హీరో.. ఆయన ఎవరో తెలుసా.?

పిచ్చిలేపిందిగా.! కిక్ సినిమాలో ఇలియానా చెల్లి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

ఒకప్పుడు హీరోలుగా చేసిన చాలా మంది ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, విలన్స్ గా రాణిస్తున్నారు. అందుకు పర్ఫెక్ట్ ఉదాహరణ జగపతి బాబు, శ్రీకాంత్.. ఇలా ఇంకొంతమంది కూడా ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో రాణిస్తున్నారు. అలాంటి వారిలో రాంకీ ఒకరు. ఈ నటుడి పూర్తి పేరు రామకృష్ణ. కాగా రాంకీగా పాపులర్ అయ్యారు. రాంకీ తెలుగు, తమిళ్ భాషల్లో నటించి మెప్పించాడు. గతంలో రాంకీ హీరోగా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించాడు. తమిళ్ లో ఎక్కువ సినిమాలు చేసిన రాంకీ.. తెలుగులో సంఘటన, భలే ఖైదీలు, దోషి, ఒసేయ్ రాములమ్మ, రౌడీ దర్బార్, ఆకతాయి వంటి సినిమాలు చేశారు. అలాగే తమిళ్ లో ఆయన నటించిన సెంథూర పూవే సినిమా తెలుగులో సిందూర పువ్వు అనే టైటిల్ తో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది.

ఇవి కూడా చదవండి

105 కేజీల బరువు పెరిగా.. పిచ్చిపిచ్చిగా ట్రోల్ చేశారు.. హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

2018లో వచ్చిన ఆర్ఎక్స్ 100 సినిమాలో హీరో గాడ్ ఫాదర్ గా కనిపించి మెప్పించాడు రాంకీ. ఆర్ఎక్స్ 100 సినిమాలో ఆయన పాత్ర చాలా ప్రధానంగా ఉంటుంది. ఆతర్వాత మాస్ రాజా రవితేజ హీరోగా నటించిన డిస్కో రాజా సినిమాలో హీరో ఫ్రెండ్ గా కనిపించాడు. ఆతర్వాత కస్టడీ సినిమాతో పాటు లక్కీ భాస్కర్ సినిమాలోనూ నటించి మెప్పించాడు. కాగా రాంకీ నిరోషాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చాలా కాలం వీరు రహస్యంగా కలిసి ఉన్నారు. ఆతర్వాత ఈ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారని వీరి బంధువులు మీడియాకు తెలిపారు. కాగా నిరోషా.. సీనియర్ హీరోయిన్ రాధికకు సిస్టర్ అవుతుంది.

బాప్ రే బాప్..! ఈమె ప్రేమిస్తే సినిమా హీరోయినా..? ఎంత మారిపోయింది..!!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..