AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: గర్భిణీ నరబలి.. ఆపై వరుస హత్యలు.. ఓటీటీలో దుమ్మురేపుతోన్న తెలుగు క్రైమ్ థ్రిల్లర్

గత వారమే ఓటీటీలోకి వచ్చిన ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఓటీటీలో గట్టిగానే సౌండ్ చేస్తోంది. గర్భిణీ నరబలి.. చేతబడులు.. వరుస మరణాలు.. పోలీసుల ఇన్వెస్టిగేషన్ .. ఇలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సాగే ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో దుమ్మురేపుతోంది.

OTT Movie: గర్భిణీ నరబలి.. ఆపై వరుస హత్యలు.. ఓటీటీలో దుమ్మురేపుతోన్న తెలుగు క్రైమ్ థ్రిల్లర్
OTT Movie
Basha Shek
|

Updated on: Aug 05, 2026 | 8:15 PM

Share

కొన్ని సార్లు థియేటర్లలో ఆడని సినిమాలు ఓటీటీలో మాత్రం దుమ్మురేపుతుంటాయి. సిల్వర్ స్క్రీన్ పై సత్తా చాటని సినిమాలు కూడా ఒక్కోసారి డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ లో మాత్రం భారీ వ్యూయర్ షిప్ తెచ్చుకుంటాయి. అలా జూన్ నెలలో థియేటర్లలో విడుదలై ఓ మోస్తరుగా ఆడిన తెలుగు సినిమా ఇప్పుడు ఓటీటీలో మాత్రం దుమ్మురేపుతోంది. క్రైమ్, సస్పెన్స్ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమాకు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ పై భారీ వ్యూయర్ షిప్ వస్తోంది. నిజం చెప్పాలంటే ఇదొక హారర్ ఎలిమెంట్స్ తో కూడిన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్. స్టోరీ విషయానికి వస్తే.. ఒక ప్లాష్ బ్యాక్ స్టోరీతో ఈ సినిమా మొదలవుతుంది. అమరత్వం కోసం మహంకాళి అనే క్రూరమైన మాంత్రికుడు ఒక గర్భిణీ స్త్రీని అత్యంత దారుణంగా నరబలి ఇస్తాడు. ఈ దారుణ హత్య వెనక ఆ మాంత్రికుడికి ఒక పోలీస్ అధికారి, మరో లంచగొండి డాక్టర్ అండగా నిలుస్తారు. గర్భిణీ హత్యను ప్రమాదంగా చిత్రీకరించి తప్పుడు ఆధారాలు సృష్టించి కేసును క్లోజ్ చేయిస్తారు. అయితే ఈ ఘటన జరిగిన కొన్నేళ్లకు కొత్తగా వచ్చిన ఓ పోలీసాఫీసర్ ఈ కేసును రీ ఓపెన్ చేస్తుంది. ఆమె కూడా మొదట సాధారణ హత్య కేసులా భావించినా, దర్యాప్తు ముందుకు సాగేకొద్దీ సంచలన నిజాలు వెలుగులోకి వస్తాయి.

ఇంతలోనే ఈ కేసుతో సంబంధమున్న వ్యక్తులు ఒక్కొక్కరు అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోవడం మరింత కలకలం రేపుతుంది. మరి ఈ చేతబడి, వరుస హత్యల వెనక ఉన్నదెవరు? అసలు దీని వెనక ఉన్న కుట్ర కోణమేంటి? చివరకు వారు పోలీసులకు ఎలా చిక్కారన్నదే ఈ సినిమా కథ. ప్రస్తుతం ఓటీటీలో ఆడియెన్స్ దృష్టిని ఆకర్షిస్తోన్న ఈ సినిమా పేరు పోలీస్ కంప్లైట్. వరలక్ష్మి శరత్‌కుమార్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో అదరగొట్టింది. అలాగే నవీన్ చంద్ర, రాగిణి ద్వివేది, కృష్ణ సాయి కీలక పాత్రలు పోషించారు. సంజీవ్ మేగోటి తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో మంచి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూడాలనుకునేవారికి ఈ మూవీ ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

అమెజాన్ ప్రైమ్ వీడియోలో పోలీస్ కంప్లైంట్ సినిమా..

పోలీస్ కంప్లైంట్ సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
రేవతి నక్షత్రంలోకి శని.. ఇక ఈ రాశుల వారు ఆడింది ఆట పాడింది పాటే
రేవతి నక్షత్రంలోకి శని.. ఇక ఈ రాశుల వారు ఆడింది ఆట పాడింది పాటే
భర్తలను అదుపులో పెట్టుకునే భార్యలు వీరే.. మీ రాశి ఉందా?
భర్తలను అదుపులో పెట్టుకునే భార్యలు వీరే.. మీ రాశి ఉందా?
ఫోన్ చూపిస్తూ తినిపిస్తున్నారా.. పిల్లల పొట్టలో జరిగేది తెలిస్తే
ఫోన్ చూపిస్తూ తినిపిస్తున్నారా.. పిల్లల పొట్టలో జరిగేది తెలిస్తే
అల్లు శిరీష్ భార్య నయనికకు ఇంత అందమైన చెల్లి ఉందా? ఫొటోస్ ఇదిగో
అల్లు శిరీష్ భార్య నయనికకు ఇంత అందమైన చెల్లి ఉందా? ఫొటోస్ ఇదిగో
జార్ఖండ్‌లో JSSC CGL పరీక్షలు, ఫలితాలు రద్దు!
జార్ఖండ్‌లో JSSC CGL పరీక్షలు, ఫలితాలు రద్దు!
డ్రగ్ టెస్ట్‌లో మరో ఇద్దరు ఎయిర్ ఇండియా పైలట్లకు పాజిటివ్‌!
డ్రగ్ టెస్ట్‌లో మరో ఇద్దరు ఎయిర్ ఇండియా పైలట్లకు పాజిటివ్‌!
తాతా నువ్ కేక.. నీ తెలివికి హ్యాట్సాఫ్.. ఊతకర్రను కుర్చీలా..
తాతా నువ్ కేక.. నీ తెలివికి హ్యాట్సాఫ్.. ఊతకర్రను కుర్చీలా..
తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు సీఎం బంపర్ ఆఫర్..!
తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు సీఎం బంపర్ ఆఫర్..!
మార్కెట్లోకి వస్తున్న పోకో సరికొత్త 5జీ.. పూర్తి వివరాలివే
మార్కెట్లోకి వస్తున్న పోకో సరికొత్త 5జీ.. పూర్తి వివరాలివే
ఆకే కదా అని తీసిపారేయకండి.. వాతపు రోగాలకు వాటమయిన మందు..!
ఆకే కదా అని తీసిపారేయకండి.. వాతపు రోగాలకు వాటమయిన మందు..!