AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Vinod: 300కు పైగా సినిమాలు చేసిన ఈ నటుడు ఎలా చనిపోయారో తెలుసా? పాపం ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకపోయినా..

సాధారణంగా 50 ఏళ్ల వయసు అంటే చాలా మందికి అనారోగ్య సమస్యలు ఉంటాయి. కానీ ఈ టాలీవుడ్ నటుడికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. పైగా చనిపోయే రోజు ముందు రాత్రి తన కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా గడిపారీ నటుడు.

Actor Vinod: 300కు పైగా సినిమాలు చేసిన ఈ నటుడు ఎలా చనిపోయారో తెలుసా? పాపం ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకపోయినా..
Actor Vinod
Basha Shek
|

Updated on: Aug 05, 2026 | 8:54 PM

Share

నటుడు వినోద్.. ఈ పేరు వింటే చాలా మందికి హీరో వినోద్ కుమార్ గుర్తుకు వస్తారు. అయితే ఇదే పేరుతో టాలీవుడ్ లో మరొక నటుడు ఉన్నాడు. ఇప్పటి జనరేషన్ కు ఈ యాక్టర్ గురించి పెద్దగా తెలియకపోవచ్చు.. కానీ.. 90 స్ కిడ్స్ కు ఈ నటుడు బాగా గుర్తుండిపోతారు. వినోద్‌ అసలు పేరు ఆరిశెట్టి నాగేశ్వరరావు. గుంటూరుకు చెందిన ఆయన 300 పైగా చిత్రాల్లో నటించారు. ఎక్కువగా విలన్ పాత్రలే పోషించినప్పటికీ చాలా సినిమాల్లో సహాయక నటుడిగా మెప్పించారు. 1980లో సినిమా మారంగంలోకి ప్రవేశించారు వినోద్. కీర్తి కాంత కనకం ఆయన మొదటి సినిమా. ఇందులో వినోద్ కథానాయకుడిగా నటించడం విశేషం. మొదటి సినిమానే అయినా తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించారు వినోద్. దీని తర్వాత నల్లత్రాచు, చంటి, లారీ డ్రైవర్, చిట్టెమ్మ మొగుడు, అసాధ్యులు, భైరవ ద్వీపం, సాంబయ్య, డార్లింగ్ డార్లింగ్, నరసింహనాయుడు,ఇంద్ర, 24 గంటలు, నేను సైతం, శంఖారావం.. ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో వివిధ పాత్రలు పోషించారు వినోద్. ముఖ్యంగా నరసింహనాయుడు,ఇంద్ర వంటి ఫ్యాక్షన్ సినిమాల్లో విలన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు వినోద్. తెలుగుతో పాటు రెండు హిందీ సినిమాలు, 28 తమిళ సినిమాల్లో నటించి మెప్పించారీ నటుడు. కేవలం వెండితెరపైనే కాదు బుల్లితెరపైనా సత్తా చాటారు వినోద్. పలు సూపర్ హిట్ సీరియల్స్ లో కీలక పాత్రలు పోషించి ప్రేక్షకులను అలరించారు.

కాగా నటుడి వినోద్ మరణం అప్పట్లో టాలీవుడ్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు ఈ నటుడి మరణం పట్ల తీవ్ర దిగ్బ్రాంతి చెందారు. 2018 జులై 14న అర్ధరాత్రి బ్రెయిన్ స్ట్రోక్ తో కన్నుమూశారు వినోద్. అయితే 59 ఏళ్ల వయసు వచ్చినా ఈ నటుడికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. పైగా చనిపోయే రోజు ముందు రాత్రి కూడా ఈ నటుడు ఎంతో సంతోషంగా ఉన్నారట. కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా గడిపారట. అయితే అర్ధరాత్రి సమయంలో ఉన్నట్లుండి వినోద్ కు బ్రెయిన్ స్ట్రోక్ రావడం, ఆ వెంటనే ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలిచివేసింది. కాగా వినోద్‌ భార్య వీనావతి. వీరికి శిరీష, సురేష్‌, తేజస్వి అను ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం వీరు హైదరాబాద్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us