సినిమాలను వదిలిపెట్టను.. ఎందుకు అబద్ధాలు సృష్టిస్తున్నారు..
Rajitha Chanti
Pic credit - Instagram
18 September 2026
తెలుగు చిత్రపరిశ్రమలో కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న కథానాయకి అను ఇమ్మాన్యుయేల్, తానూ పరిశ్రమను వీడుతున్నానంటూ వస్తున్న వార్తలపై తీవ్రంగా స్పందించారు.
అను ఇమ్మాన్యుయేల్
గత కొంతకాలంగా కొత్త సినిమాలకు సంతకం చేయకపోవడంతో అను ఇమ్మాన్యుయేల్ నటనకు గుడ్‌బై చెప్తోందంటూ నెట్టింట పుకార్లు షికార్లు చేశాయి.
రూమర్స్ పై రియాక్షన్
అయితే ఈ రూమర్స్ పై అను స్పందిస్తూ.. తాను సినిమాలను వదిలివెళ్లే ప్రసక్తే లేదని, ఈ ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని తేల్చి చెప్పారు.
నిజం కాదు
"నేను నటనకు దూరం అవుతున్నానని ఎవరు చెప్పారు? అసలు ఇలాంటి రూమర్లను ఎవరు సృష్టిస్తారో నాకు అర్థం కావడం లేదని అన్నారు.
నిజం కాదు
సినీ పరిశ్రమను వదిలి వెళ్లాలనే ఆలోచన నాకు ఎప్పటికీ లేదు" అని స్పష్టం చేశారు. కేవలం సినిమాలు చేయాలనే తొందరపాటు లేకుండా, మంచి పాత్రల కోసం చూస్తున్నారట.
నిజం కాదు
త్వరలోనే తన రాబోయే ప్రాజెక్టుల వివరాలను స్వయంగా ప్రకటిస్తానని స్పష్టం చేశారు. మజ్ను చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ.
నిజం కాదు
అజ్ఞాతవాసి, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా వంటి అగ్ర హీరోల చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుని మరింత పాపులర్ అయ్యారు అను ఇమ్మాన్యూయేల్.
నిజం కాదు
ఇటీవలే రష్మిక మందన్న నటించిన ది గర్ల్ ఫ్రెండ్ చిత్రంలో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో కనిపించి మరోసారి తనదైన నటనతో ప్రశంసలు అందుకున్నారు అను.