AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parivartan Yoga: పరివర్తన యోగంతో వీరి జాతకం మారుతుంది..! ఆకస్మిక ధనప్రాప్తికి ఛాన్స్..

జ్యోతిష శాస్త్రంలో గురు, చంద్ర గ్రహాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. సెప్టెంబర్ 25, 26, 27 తేదీల్లో గురు-చంద్రుల మధ్య పరివర్తన యోగం ఏర్పడుతోందని జ్యోతిష్య విశ్లేషణలు చెబుతున్నాయి. ఈ గ్రహ సంచారం ప్రభావంతో వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మీన రాశుల వారికి ఆర్థిక, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో అనుకూల ఫలితాలు లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Parivartan Yoga: పరివర్తన యోగంతో వీరి జాతకం మారుతుంది..! ఆకస్మిక ధనప్రాప్తికి ఛాన్స్..
Parivartan Yoga
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 18, 2026 | 6:46 PM

Share

అత్యంత శుభ గ్రహమైన గురువుతో ఏ గ్రహానికి పరివర్తన జరిగినా అది శుభ ఫలితాలనిస్తుంది. అందులోనూ పూర్ణ చంద్రుడితో ఉచ్ఛ గురువుకు పరివర్తన జరిగితే రాజయోగాలు, ధన యోగాలకు లోటుండదు. ఈ రెండు గ్రహాల మధ్య పరివర్తన జరిగిన మూడు రోజులూ ఎంతో శుభప్రదమైన రోజుల కింద పరిగణిస్తారు. ఈ నెల(సెప్టెంబర్) 25, 26, 27 తేదీల్లో గురు, చంద్ర గ్రహాల మధ్య మరోసారి పరివర్తన జరుగుతోంది. గురు గ్రహానికి చెందిన మీన రాశిలో చంద్రుడు, చంద్రుడికి చెందిన కర్కాటక రాశిలో గురువు సంచారం చేయడం వల్ల ఈ పరివర్తన ఏర్పడింది. ఈ పరివర్తన వల్ల వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మీన రాశులకు పట్టిందల్లా బంగారమవుతుంది.

  1. వృషభం: ఈ రాశికి తృతీయ, లాభాధిపతులైన చంద్ర, గురువుల మధ్య పరివర్తన జరగడం వల్ల మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాలన్నీ కలిసి వస్తాయి. ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్ల నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి వృద్ధికి అవకాశం ఉంది. సంపన్న వ్యక్తితో పెళ్లి సంబంధం ఖాయమవుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది.
  2. మిథునం: ఈ రాశికి ధన, దశమాధిపతుల మధ్య పరివర్తన జరుగుతున్నందువల్ల ఉద్యోగంలో అందలాలు ఎక్కడం జరుగుతుంది. జీతభత్యాలు బాగా పెరుగుతాయి. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు నూరు శాతం సఫలం అవుతాయి. వృత్తి, వ్యాపారాలు కష్టనష్టాల నుంచి చాలావరకు బయటపడి పురో గతి బాటపడతాయి. వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆర్థిక సమస్యలన్నిటికీ పరి ష్కారం లభిస్తుంది. ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.
  3. కర్కాటకం: ఈ రాశికి భాగ్య స్థానంతో పరివర్తన జరగడం వల్ల కొద్ది ప్రయత్నంతో ఈ రాశివారికి విదేశీ సంపా దన యోగం కలుగుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు లభిస్తాయి. ఉద్యోగపరంగా విదేశాలకు తరచూ వెళ్లే అవకాశం కలుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. జీతభత్యాలు కూడా అంచనాలకు మించి పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి బయటపడి లాభాల బాటపడతాయి. పిత్రార్జితం లభిస్తుంది. ఆస్తి వివాదాలు పూర్తిగా పరిష్కారమవుతాయి.
  4. కన్య: ఈ రాశికి సప్తమ, లాభాధిపతుల మధ్య పరివర్తన జరిగినందువల్ల జీవితంలో శుభ పరిణామాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. సొంత ఇంటి కల నెరవేరే అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తల పెట్టినా తప్పకుండా విజయం సాధిస్తారు. కుటుంబ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి నిశ్చయం కావడం జరుగు తుంది. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగుతాయి. ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతి లభిస్తుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. వృశ్చికం: ఈ రాశికి పంచమ, భాగ్యాధిపతుల మధ్య పరివర్తన చోటు చేసుకోవడం వల్ల ధన ధాన్య సమృద్ధి కలుగుతుంది. ఆదాయ మార్గాలు బాగా విస్తరిస్తాయి. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఉద్యో గంలో పదోన్నతులు లభిస్తాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. సంపన్న కుటుంబంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు.
  7. మీనం: రాశ్యధిపతి గురువుకు, పంచమాధిపతి చంద్రుడికి మధ్య పరివర్తన జరుగుతున్నందువల్ల షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. గృహ, వాహన యోగాలు పట్టే అవకాశం ఉంది. సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఉద్యోగపరంగానే కాక, సామాజికంగా కూడా ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. ఆస్తి వివాదం పరిష్కారమై విలువైన ఆస్తి కలిసి వస్తుంది. ఆర్థిక, వ్యక్తిగత, కుటుంబ సమస్యలన్నీ తొలగిపోయి, సుఖ సంతోషాలు నెలకొంటాయి.

Follow Us