Lucky Zodiac Signs: త్వరలో వీరికి అదృష్ట దేవత కటాక్షం! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
జ్యోతిష శాస్త్రంలో తొమ్మిదవ స్థానాన్ని భాగ్య స్థానంగా పరిగణిస్తారు. ఈ స్థానాధిపతి బలంగా ఉంటే జీవితంలో విజయాలు, సాఫల్యాలు, అదృష్టం అనుకూలంగా ఉంటాయని జ్యోతిష నమ్మకం. ప్రస్తుత గ్రహ సంచారం ప్రకారం మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, మకర రాశుల వారికి మరికొంత కాలం పాటు భాగ్య స్థానం బలంగా ఉండే అవకాశం ఉంది. ఈ రాశుల వారికి ఉద్యోగం, ఆర్థిక పరిస్థితి, కుటుంబం, ఇతర ముఖ్యమైన విషయాల్లో అనుకూల ఫలితాలు కనిపించే అవకాశం ఉంది.

జ్యోతిష శాస్త్రం ప్రకారం రాశ్యధిపతి తర్వాత భాగ్య స్థానానికి, భాగ్య స్థానాధిపతికి అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. తొమ్మిదవ స్థానాధిపతినే భాగ్య స్థానాధిపతిగా పరిగణించడం జరుగుతుంది. జాతక చక్రంలో ఈ స్థానాధిపతి బలంగా ఉంటే ఇక ఆ జాతకుడికి జీవితం విజయాలు, సాఫల్యాలతో సాగిపోతుంది. జాతకంలో ఎన్ని దోషాలున్నా, ఎన్ని లోపాలున్నా తొలగిపోతాయి. భాగ్య స్థానాధిపతినే అదృష్ట స్థానాధిపతిగా కూడా పరిగణిస్తారు. ప్రస్తుత గ్రహ సంచారం ప్రకారం మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, మకర రాశుల వారికి మరో కొంత కాలం పాటు భాగ్య స్థానం బాగా బలంగా ఉండబోతోంది.
మేష రాశి
ఈ రాశివారికి భాగ్యాధిపతి అయిన గురువు ప్రస్తుతం చతుర్థ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్నందు వల్ల అక్టోబర్ 31 వరకు అనేక విధాలుగా అదృష్టాలు కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా విదేశీ సంపాదన యోగం పడుతుంది. సంపద బాగా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతికి, ఆదాయ వృద్ధికి అవకాశాలు లభిస్తాయి. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు చాలావరకు పరి ష్కారమవుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంట్లో ముఖ్యమైన శుభ కార్యాలుజరుగుతాయి.
వృషభ రాశి
ఈ రాశికి భాగ్య స్థానాధిపతి అయిన శనీశ్వరుడు లాభ స్థానంలో సంచారం చేయడం వల్ల ఈ ఏడా దంతా అనేక మార్గాల్లో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులు లభి స్తాయి. జీతభత్యాలు బాగా పెరుగుతాయి. ఆరోగ్య భాగ్యం కలుగుతుంది. విదేశీ ఉద్యోగం లభించే అవకాశం ఉంది. తండ్రి నుంచి వారసత్వ సంపద లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. ప్రతి ప్రయత్నమూ సఫలమవుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి.
మిథున రాశి
ఈ రాశికి భాగ్యస్థానమైన కుంభ రాశిలో రాహువు సంచారం చేస్తున్నందువల్ల డిసెంబర్ 5 లోపల ఈ రాశివారికి తప్పకుండా విదేశీ సంపాదన యోగం పడుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం చేసే ఉద్యోగం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు బాగా అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది.
కర్కాటక రాశి
ఈ రాశికి భాగ్య స్థానాధిపతి అయిన గురువు ఈ రాశిలోనే ఉచ్ఛ స్థితిలో ఉండడం, భాగ్యస్థానంలో శని సంచారం చేస్తుండడం వల్ల అక్టోబర్ 31 లోపు అనేక విధాలుగా అదృష్టాలు కలిగే అవకాశం ఉంది. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకునే అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతి కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. అనారోగ్యాల నుంచి విముక్తి లభిస్తుంది. భారీగా పిత్రార్జితం లభిస్తుంది.
కన్యా రాశి
ఈ రాశికి భాగ్యాధిపతి అయిన శుక్రుడు జనవరి 2 వరకు ధన స్థానంలో సంచారం చేస్తున్నందు వల్ల ఈ రాశివారికి అన్ని విధాలా దశ తిరిగే అవకాశం ఉంది. భాగ్య కారకుడైన గురు గ్రహం లాభ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉండడం కూడా ఊహించని అదృష్టాలను కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి గణనీ యంగా మెరుగుపడుతుంది. అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు, షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ధన వర్షం కురిపిస్తాయి.
మకర రాశి
ఈ రాశివారికి భాగ్య స్థానాధిపతి అయిన బుధుడు తన స్వస్థానం, ఉచ్ఛ స్థానమైన కన్యారాశిలో ఈ నెల 26 వరకు సంచారం చేయడం, ఆ తర్వాత దశమ స్థానంలో ప్రవేశించడం వల్ల మరో నెల రోజుల పాటు తప్పకుండా అనేక విధాలుగా అదృష్టాలు కలుగుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యలు మటుమాయం అవుతాయి. వృత్తి, ఉద్యోగాలు ఆశించిన దానికంటే ఎక్కువగా ఆదాయాన్నిస్తాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది.



