AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astrology: శుక్రుడి మీద కుజ దృష్టి.. ఈ రాశుల వారికి సంపాదన, భోగభాగ్యాలు ఖాయం..!

ఈ నెల(సెప్టెంబర్) 18 నుంచి నవంబర్ 12 వరకు కర్కాటక రాశిలో సంచారం చేయబోతున్న కుజుడు తులా రాశిలో ఉన్న శుక్రుడిని చతుర్థ దృష్టితో వీక్షించడం జరుగుతోంది. సాధారణంగా శుక్రుడిని కుజుడు చూసినప్పుడు కొన్ని రాశుల వారిలో శృంగార సంబంధమైన కోరికలు పెరుగుతాయి. సంపాదన మీదా, భోగభాగ్యాల మీదా ఆశ వృద్ధి చెందుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో వీరు విజృంభించడం జరుగుతుంది. ఏ అవకాశాన్నీ జారవిడుచుకోరు. పోటీతత్వం, పట్టుదల పెరుగుతాయి. శుక్రుడి మీద కుజ దృష్టి వల్ల మేషం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, మకరం రాశుల వారిలో పోరాటస్ఫూర్తి పెరుగుతుంది. మనసులోని కోరికలు, ఆశలు చాలావరకు తీరే అవకాశం ఉంది.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 18, 2026 | 3:53 PM

Share
మేషం: సప్తమంలో ఉన్న శుక్రుడిని రాశ్యధిపతి కుజుడు చతుర్థ స్థానం నుంచి చూడడం వల్ల ఈ రాశి వారిలో వృత్తి, ఉద్యోగాల్లో అధికారం చేపట్టాలన్న కోరిక పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధం కావడం,  ఉద్యోగంలో శ్రమను పెంచడం వంటివి జరుగుతాయి. ధనార్జన మీద ఆశలు, ఆకాంక్షలు బాగా పెరుగుతాయి. అదనపు ఆదాయ మార్గాల మీద, అదనపు రాబడి మీద దృష్టి సారిస్తారు. సుఖవంతమైన జీవితం కోసం ఆరాటం ఎక్కువవుతుంది. శృంగార జీవితం మీద ధ్యాస పెరుగుతుంది.

1 / 6
మిథునం: ఈ రాశివారికి పంచమ స్థానంలో ఉన్న శుక్రుడిని కుజుడు ధన స్థానం నుంచి వీక్షించడం వల్ల జీవ నశైలి పూర్తిగా మారిపోతుంది. విదేశీయానం మీద, విదేశాల్లో ఉద్యోగాల మీద దృష్టి పడుతుంది. మరింత మెరుగైన జీవితం గడపాలన్న ఏకైక లక్ష్యంతో కొత్త ప్రయత్నాలు ప్రారంభించి సఫలం అవుతారు. ఆదాయ వృద్ధి ప్రయత్నాల మీద శ్రమను పెంచుతారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకు పోవడం జరుగుతుంది. కొత్త పరిచయాలు, కొత్త పద్ధతులు, మంచి విలాస జీవితం ఏర్పడతాయి.

2 / 6
కర్కాటకం: ఈ రాశికి ఉన్న కుజుడు చతుర్థ స్థానంలో ఉన్న శుక్రుడిని వీక్షించడం వల్ల భోగభాగ్యాల మీద ఆశలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతుల కోసం లేదా అధికారం కోసం తీవ్రంగా ప్రయ త్నించి విజయం సాధించడం జరుగుతుంది. విలాస జీవితానికి అలవాటు పడతారు. ప్రముఖు లతో పరిచయాలు పెరుగుతాయి. గృహ, వాహన యోగాలు పడతాయి. అదనపు ఆదాయ మార్గాల్ని విస్తరిస్తారు. ప్రేమ వ్యవహారాలు,  దాంపత్య జీవితంలో అన్యోన్యత బాగా పెరుగుతుంది.

3 / 6
కన్య: ఈ రాశికి ధన స్థానంలో ఉన్న శుక్రుడిని లాభ స్థానం నుంచి కుజుడు చూడడం వల్ల శృంగార సంబంధమైన కోరికలు విజృంభించడానికి అవకాశం ఉంది. అనవసర పరిచయాలు ఏర్పడతాయి. విలాస జీవితం అలవడుతుంది. వ్యక్తిగత సుఖాల మీద ఖర్చు పెరుగుతుంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు చాలావరకు విజయవంతం అవుతాయి. సిరిసంపదలు కలిసి వస్తాయి. ప్రేమ జీవితం, దాంపత్య జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. సంపన్న వ్యక్తితో పెళ్లి కుదురుతుంది.

4 / 6
తుల: ఈ రాశిలో ఉన్న రాశ్యధిపతి శుక్రుడిని దశమస్థానం నుంచి కుజుడు వీక్షించడం వల్ల ఈ రాశి వారు ఆదాయ వృద్ధి కోసం బాగా శ్రమపడతారు. షేర్లు, స్పెక్యులేషన్లలో పెట్టే పెట్టుబడులు బాగా లాభిస్తాయి. సుఖసంతోషాలకు కోసం తాపత్రయపడడం జరుగుతుంది. శృంగార సంబంధమైన కోరికలు పెరుగుతాయి. గృహ, వాహన సౌకర్యాలు అమరుతాయి. విహార యాత్రల మీద ఖర్చు పెరుగుతుంది. అనవసర పరిచయాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నత పదవి లభిస్తుంది.

5 / 6
మకరం: ఈ రాశికి సప్తమ స్థానంలో ఉన్న కుజుడు దశమ స్థానంలో ఉన్న శుక్రుడిని వీక్షించడం వల్ల ఉద్యోగంలో పదోన్నతి కోసం, జీతభత్యాల పెరుగుదల కోసం గట్టి కృషి సాగించి సఫలం అవుతారు. ఆదాయ వృద్ధికి తీవ్ర ప్రయత్నాలు సాగిస్తారు. షేర్లు, స్పెక్యులేషన్ల మీద పెట్టుబడులు పెంచడం జరుగుతుంది. లాభదాయక పరిచయాలు, లాభదాయక ఒప్పందాలు చోటు చేసుకుంటాయి. అదనపు ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు.

6 / 6
Follow Us