ఇంత పెద్ద స్టార్ ఎలా అయ్యాడో అర్ధంకావడం లేదు.. ఆ హీరో పై రెజీనా షాకింగ్ కామెంట్స్
రెజీనా కాసాండ్రా.. తెలుగు, తమిళం,కన్నడ సినిమాల్లో నటిస్తూ అలరిస్తుంది. ఈ ముద్దుగుమ్మ 1990 డిసెంబర్ 13న చెన్నైలో జన్మించింది. చిన్న వయస్సులోనే సినిమా రంగంలోకి అడుగుపెట్టిన రెజీనా, 2005లో తమిళ చిత్రం "కండా నాల్ ముదల్"తో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది.

రెజీనా కసాండ్రా.. ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగాపరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తన నటనతో అందంతో ప్రేక్షకులను క కవ్వించింది. నటి రెజీనా కసాండ్రా 1990 డిసెంబర్ 13న చెన్నైలో జన్మించింది. 9 సంవత్సరాల వయస్సులో, ఆమె పిల్లల టీవీ ఛానెల్ లో యాంకర్‌గా తన కెరీర్ ప్రారంభించింది. ఆమె ముద్దుముద్దు మాటలు అభిమానుల దృష్టిని ఆకర్షించాయి. 14 సంవత్సరాల వయస్సులో, నటి రెజీనా కసాండ్రా నటుడు ప్రసన్న, లైలా జంటగా నటించిన తమిళ చిత్రం ‘కంద నాన్ మూ’లో లైలా చెల్లెలుగా నటించింది.
డిప్రెషన్‌తో సూసైడ్ చేసుకోవాలనుకుంది.. కట్ చేస్తే ఇండస్ట్రీలో తోప్.. చేతినిండా సినిమాలు
ఆ తర్వాత 2012లో తెలుగులో ‘శివ మనసులో శ్రుతి’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది రెజీనా కసాండ్రా. ఈ చిత్రంలో తన నటనకు సైమా ఉత్తమ తొలి నటి అవార్డును గెలుచుకుంది. 2019లో ‘ఏక్ లత్కీ కో దేకా దో’ సినిమాతో హిందీలో అడుగు పెట్టింది. ఇలా తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో సినిమాలు చేసింది. తమిళంలో పెద్దగా విజయం సాధించకపోయినా తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా రెజీనా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఆయనకు 36.. ఆమెకు19.. కట్ చేస్తే 20ఏళ్లకే తల్లయ్యింది.. చేతులారా కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్
రెజీనా ఇటీవలే అజిత్ సినిమాలో నటించింది.. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా.. శివకార్తికేయన్ గురించి మాట్లాడుతూ రెజీనా ఆసక్తికర కామెంట్స్ చేశారు. కేడీ బిల్లా.. కిల్లాడి రంగా సినిమాలో నేను శివకార్తికేయన్ కలిసి నటించాం. ఈ సినిమా విడుదలై 12 ఏళ్లు అయ్యింది. అయితే, శివకార్తికేయన్ అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడూ అలాగే ఉన్నారు. ఆయనలో ఎలాంటి మార్పు లేదు. శివకార్తికేయన్ను అప్పుడు చూసినప్పుడు ఇంత పెద్ద హీరో అవుతాడని అనుకోలేదు. ఎందుకంటే సినిమా రంగం అనేది చాలా కష్టంతో కూడింది. అయినా శివ కార్తికేయన్ ఇంత పెద్ద స్టార్ ఎలా అయ్యారో, ఏం చేశారో నాకు తెలియదు అని అన్నారు రెజీనా. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇదెక్కడి మాస్ రా మావ..! రామ్ చరణ్ పెద్దిలో ఫిల్మీ మోజీ.. థియేటర్స్ దుమ్ములేచిపోవాల్సిందే
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








