పిచ్చి కుక్కలా కష్టపడ్డాను.. కన్నీళ్లు పెట్టుకొని చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు..
ఘటోత్కచుడి కొడుకు, భీముడు మనవడు, మహాభారత యుద్ధాన్ని ఒక్క నిమిషంలో ముగించగల యోధుడు బార్బరికుడు. ఈయన గురించి మనం ఎక్కడా చదివింది లేదు. అలాంటి క్యారెక్టర్ నేపథ్యంలో వచ్చిన సినిమా త్రిబాణదారి బార్బరిక్. ఇటీవలే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

రీసెంట్ డేస్‌లో చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అని తేడా లేకుండా అన్ని సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. కథ కథనం బాగుంటే చాలు సినిమాలకు మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటున్నాయి. కొన్ని సినిమాలు చిన్న సినిమాలుగా వచ్చినా మంచి విజయాలను అందుకున్నాయి. కొన్ని సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో విడుదలై కూడా మంచి విజయాలను కలెక్షన్స్ సొంతం చేసుకుంటున్నాయి. కొన్ని సినిమాలు మాత్రం ఎంత ప్రమోషన్స్ చేసుకున్నా.. కథ కథనం బాగున్నా కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతుంటాయి. అలాగే రీసెంట్ గా విడుదలైన ఓ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దాంతో దర్శకుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. అలాగే చెప్పుతో కొట్టుకుంటూ.. ఎమోషనల్ వీడియో షేర్ చేశాడు.
అమ్మబాబోయ్..! సునీల్ హీరోయిన్ ఎంత మారిపోయింది..!! చూస్తే షాక్ అవ్వాల్సిందే
ఇటీవల విడుదలైన సినిమాల్లో త్రిబాణధారి బార్బరిక్ సినిమా ఒకటి. ఆసక్తికర కథ కథనంతో తెరకెక్కిన త్రిబాణధారి బార్బరిక్ సినిమా మంచి అంచనాలు మధ్య విడుదలై ప్రేక్షకులను నిరాశపరిచింది. సత్య రాజ్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించారు. వశిష్ట ఎన్ సింహా, సత్యం రాజేష్, ఉదయభాను, సాంచీ రాయ్, క్రాంతి కిరణ్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించి మెప్పించారు. ఈ మూవీకి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు.
ఆహా.. ఎన్నాళ్లకు కనిపించింది..! రణం బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?
ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పర్లేదు అనిపించుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా బాగానే జరుగాయి. కానీ ఈ సినిమా ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చినా కూడా ప్రేక్షకులు థియేటర్స్ రప్పించలేకపోయింది. త్రిబాణధారి బార్బరిక్ సినిమాకు ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదు. దాంతో దర్శకుడు మోహన్ శ్రీవత్స కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్ వీడియో షేర్ చేశారు. ” నేను ఇప్పుడే సినిమా చూడటానికి వెళ్లా.. థియేటర్స్ లో పదిమంది కూడా లేరు.. సినిమా బాగుందని అందరూ చెప్తున్నా థియేటర్స్ కు మాత్రం జనం రావడం లేదు.. ఆ పదిమంది దగ్గరకు వెళ్లి సినిమా ఎలా ఉంది అని అడిగా చాలా బాగుంది అని చెప్పారు. సినిమాకు నేనే దర్శకుడిని అని చెప్పగానే వారు నన్ను హగ్ చేసుకున్నారు. సినిమా బాగున్నా ఎందుకు జనాలు రావడం లేదో అర్ధం కావడంలేదు.. సినిమా కోసం పిచ్చి కుక్కలా కష్టపడ్డాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు దర్శకుడు. . సినిమా కానీ నచ్చకపోతే నా చెప్పుతో నేను కొట్టుకుంటా అని కాన్ఫిడెన్స్ తో జనాలతో ఒక మాట అన్నాను. ఛాలెంజ్‌ను వెనక్కి తీసుకుంటున్నానని చెప్పి చెప్పుతో కొట్టుకున్నాడు మోహన్ శ్రీవత్స. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.
నోరు జాగ్రత్త..! హీరో యశ్ తల్లి హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్.. అసలు ఏం జరిగిందంటే..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








