అమ్మబాబోయ్..! సునీల్ హీరోయిన్ ఎంత మారిపోయింది..!! చూస్తే షాక్ అవ్వాల్సిందే
టాలీవుడ్ బెస్ట్ కమెడియన్స్ అంటే ముందు వరసలో ఉండే పేర్లలో సునీల్ పేరు ఒకటి. తన కామెడీ టైమింగ్ తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఎన్నో సినిమాల్లో తన కామెడీతో ప్రేక్షకులను మెప్పించిన సునీల్.. ఆతర్వాత హీరోగా మారిపోయాడు. అందాల రాముడు సినిమాతో సునీల్ హీరోగా మారాడు.

సునీల్ కమెడియన్‌గా ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. టాప్ కమెడియన్స్ లో ఒకరిగా క్రేజ్ తెచ్చుకున్న సునీల్.. ఆ తర్వాత హీరోగా మారి సినిమాలు చేశాడు. అందాల రాముడు సినిమాతో హీరోగా మారిన సునీల్ తొలి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో మర్యాద రామన్న సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన మర్యాద రామన్న సినిమా విభిన్న కథతో తెరకెక్కింది. ఈ సినిమాలో సునీల్ నటన ప్రేక్షకులను మెప్పించింది. ఆర్కా మీడియా పతాకంపై యార్లగడ్డ శోభు, దేవినేని ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు.
పెట్టింది రూ. 5కోట్లు.. వచ్చింది రూ.60 కోట్లు.. ఇప్పటికీ ఓటీటీలో దుమ్మురేపుతున్న చిన్న సినిమా
మర్యాద రామన్న సినిమాలో సునీల్‌కు జోడీగా అందాల భామ సలోని నటించింది. ఈ సినిమాకి ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందించారు. జూలై 23, 2010న విడుదలైన ఈ సినిమా భారీవిజయాన్ని సాధించింది. ఇక సలోని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ధన 51 సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది సలోని. ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఆతర్వాత ఒక ఊరిలో, చుక్కల్లో చంద్రుడు, కోకిల, బాస్ సినిమాలో నటించింది. అలాగే మగధీర సినిమాలో చిన్న రోల్ లో నటించింది ఈ చిన్నది.
ఇదెక్కడి ట్విస్ట్ రా మావ..! ఈ సీనియర్ హీరోయిన్ భర్త టాలీవుడ్ హీరోనా..!! ఏ ఏ సినిమాలు చేశాడంటే
ఇక సునీల్ నటించిన మర్యాద రామన్న సినిమాలో తన నటనతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసింది. తెలుగమ్మాయి, బాడీగార్డ్, అధినాయకుడు, రేసుగుర్రం, మీలో ఎవరు కోటీశ్వరుడు, మట్కా సినిమాల్లో నటించింది. అలాగే ఇప్పుడు ఆడపడదపా సినిమాలు చేస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడు ఎలా ఉంది.? ఏం చేస్తుందని నెటిజన్స్ గూగుల్ ను గాలిస్తున్నారు. దాంతో ఈ అమ్మడు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సలోని రీసెంట్ ఫోటోలు చూసి అభిమానులు షాక్ అవుతున్నారు.
వర్త్ వర్మ వర్త్..! అప్పుడు క్యూట్ హీరోయిన్.. ఇప్పుడు హాట్ బ్యూటీ.. 42ఏళ్ల వయసులోనూ
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








