నోరు జాగ్రత్త..! హీరో యశ్ తల్లి హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్.. అసలు ఏం జరిగిందంటే..
‘కేజీఎఫ్ 2’ తర్వాత నటుడు కన్నడ నటుడు యశ్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఇప్పుడు అతనికి దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అయితే పాన్ ఇండియా హీరో అయినా యశ్ ఎప్పుడూ సింపుల్ గానే ఉంటాడు. అభిమానులకు ఎంతో గౌరవమిస్తాడు. వారికి సహాయ సహకారాలు అందిస్తుంటాడు.

కన్నడ స్టార్ హీరో యశ్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే.. యశ్ నటించిన కేజీఎఫ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో ఒక్కసారిగా యశ్ పాన్ స్టార్ అయ్యాడు. కేజీఎఫ్ సినిమాతో విడుదలైన అన్ని భాషల్లో యష్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఆతర్వాత విడుదలైన కేజీఎఫ్ 2 కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు టాక్సిక్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలు నలుగురు హీరోయిన్స్ నటిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. అలాగే లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా ఈ సినిమాలో నటిస్తుందని అంటున్నారు. ఇదిలా ఉంటే ఓ హీరోయిన్ యశ్ తల్లిపై షాకింగ్ కామెంట్స్ చేసింది. నా గురించి మాట్లాడే హక్కు మీకు లేదు అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది ఆ హీరోయిన్..
పెట్టింది రూ. 5కోట్లు.. వచ్చింది రూ.60 కోట్లు.. ఇప్పటికీ ఓటీటీలో దుమ్మురేపుతున్న చిన్న సినిమా
యశ్ తల్లి పుష్ప నిర్మాతగా మారి సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.. మొన్నామధ్య ఆమె కొత్తలవాడి అనే సినిమాను తెరకెక్కించారు. ఆగస్టు 1న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా రిలీజ్ సమయంలో ఆమె చేసిన కొన్ని కామెంట్స్ వివాదానికి దారి తీశాయి. ఓ ఇంటర్వ్యూలో యశ్ తల్లి పుష్పను యాంకర్ ప్రశ్నిస్తూ.. మీ తర్వాత సినిమాలో దీపికా దాస్‌ను హీరోయిన్ గా ఎంపిక చేశారా అని ప్రశ్నించగా.. ఎందుకు ఆమె పేరు పదే పదే చెప్తారు.. ఆమె ఏమైనా స్టార్ హీరోయినా.. ఆమె స్టార్ హీరోయిన్ కాదు.. అసలు దీపికా ఏం సాధించిందని తీసుకోవాలని అనేసింది.
ఇదెక్కడి ట్విస్ట్ రా మావ..! ఈ సీనియర్ హీరోయిన్ భర్త టాలీవుడ్ హీరోనా..!! ఏ ఏ సినిమాలు చేశాడంటే
ఈ కామెంట్స్ వివాదానికి దారి తీశాయి. తాజాగా ఈవివాదం పై దీపికా దాస్ స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె దీని గురించి మాట్లాడింది. ఆమె మాట్లాడుతూ.. నేను హీరోయిన్ గా ఇండస్ట్రీలో నాకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నా.. నేను ఎవరి సాయం తీసుకొని ఈ స్థాయికి రాలేదు.. అవతల ఉన్నది మా అమ్మ ఐనా.. పుష్పమ్మ అయినా సరే నా గురించి చేడుగా మాట్లాడే హక్కు వారికి లేదు.కొత్త వారికి అవకాశాలు ఇచ్చే ముందు వారికి గౌరవం ఇవ్వడం నేర్చుకోండి. నోటికొచ్చినట్టు మాట్లాడకండి.. అంటూ కౌంటర్ ఇచ్చింది. యశ్ కుటుంబం, దీపికా దాస్ ఫ్యామిలీ బంధువులు అవుతారు. వీరి మధ్య మనస్పర్థలు రావడంతో దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.
వర్త్ వర్మ వర్త్..! అప్పుడు క్యూట్ హీరోయిన్.. ఇప్పుడు హాట్ బ్యూటీ.. 42ఏళ్ల వయసులోనూ
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








