AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: కేరళను కుదిపేసిన ఘటన.. ఓటీటీలో రియల్ క్రైమ్ స్టోరీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్

ఈ మధ్యన నిజ జీవిత సంఘటనలు, ప్రముఖ వ్యక్తుల ఆధారంగా సినిమాలు, వెబ్ సిరీస్ లు తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. వీటికి ఆడియెన్స్ నుంచి ముఖ్యంగా ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా ఒక రిలయ్ క్రైమ్ స్టోరీనే

OTT Movie: కేరళను కుదిపేసిన ఘటన.. ఓటీటీలో రియల్ క్రైమ్ స్టోరీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
OTT Movie
Basha Shek
|

Updated on: Aug 30, 2025 | 7:40 PM

Share

ఓటీటీల్లో మలయాళ సినిమాలకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇటీవల మలయళంలో వెబ్ సిరీస్ లు కూడా తెరకెక్కుతున్నాయి. తెలుగులోనూ ఇవి స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. ఇప్పటికే తెలుగులో డబ్బింగ్ అయిన పలు మలయాళ చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీ ఆడియెన్స్ ను ‍అలరించాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ జానర్ కు చెందినదే. కేరళ త్రిస్సూర్‌లోని అత్యంత వివాదాస్పద కేసు ఆధారంగా కమ్మటం అనే క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌ను తెరకెక్కించారు. ఓ ‍వ్యక్తి అనుమానాస్పద రీతిలో రోడ్డు ప్రమాదంలో మరణించడం.. ఆతర్వాత ఈ కేసు చుట్టూ జరిగిన పరిణామాలతో ఎంతో ఆసక్తికరంగా ఈ సిరీస్ ను తెరకెక్కించాడు. యదార్థ సంఘటనల ఆధారంగా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ సిరీస్‌ను రూపొందించారు. త్రిస్సూర్ తో పాటు కేరళ రాష్ట్రాన్ని కుదిపేసిన ఓ నిజ జీవిత సంఘటన ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కింది. ఈ సిరీస్‌లో మొత్తం ఆరు ఎపిసోడ్స్‌ ఉన్నాయి.

ఇక సిరీస్ కథ విషయానికి వస్తే.. ప్లాంటర్ శామ్యూల్ ఉమ్మన్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా రోడ్డు ప్రమాదంలో చనిపోతాడు. అందరూ దీనిని ప్రమాదమే అనుకుంటారు. అయితే సంఘటనా స్థలంలో దొరికిన కొన్ని ఆధారాలను చూసి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆంటోనియో జార్జ్ మాత్రం ఇది యాక్సిడెంట్ కాదని భావిస్తాడు. షాజీ అనే ఆటో డ్రైవర్ ను అనుమానిస్తాడు. అయితే ఆ ఆటో డ్రైవర్ అనూహ్యంగా ఒక క్వారీ ప్రమాదంలో చనిపోతాడు. అయితే అక్కడ దొరికిన ఆధారాలతో ఫ్రాన్సిస్ అనే వ్యక్తే ఈ కేసులో నిందితుడని పోలీసులు భావిస్తారు. అయితే విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తాయి. మరి అది రోడ్డు యాక్సిడెంటేనా? కాదా? మర్డర్ అయితే ఎవరు చంపారు? చివరకు ఏం తేలింది. అన్న ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

ఈ సిరీస్‌ పేరు కమ్మటం. ఇందులో జిన్స్, జియో బేబీ, అజయ్ వాసుదేవ్, అఖిల్ కవలయూర్, అరుణ్ సోల్, శ్రీరే, జోర్డీ పూంజా కూడా ఉన్నారు. 23 ఫీట్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సిరీస్ మొదట ఆగస్టు 29న ZEE5లో ప్రీమియర్ అవుతుందన్నారు. అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అయితే ఇప్పుడు స్ట్రీమింగ్ డేట్ ను సెప్టెంబర్ 5కు మార్చారు.

జీ5లో స్ట్రీమింగ్ ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..