AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇది కదా రా సినిమా అంటే..! పెట్టింది రూ.30కోట్లు.. మూడు రోజుల్లోనే రూ.35కోట్లకు పైగా రాబట్టింది

చిన్న సినిమాలు రీసెంట్ డేస్ లో భారీ విజయాలను అందుకుంటున్నాయి. చిన్న చిన్న కథలతో తెరకెక్కిన సినిమాలు మంచి విజయాలను అందుకుంటున్నాయి. కొన్ని సినిమాలు పాన్ ఇండియా రేంజ్‌లో హిట్ కూడా అందుకున్నాయి. ఇప్పుడు ఓ చిన్న సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబడుతుంది.

ఇది కదా రా సినిమా అంటే..! పెట్టింది రూ.30కోట్లు.. మూడు రోజుల్లోనే రూ.35కోట్లకు పైగా రాబట్టింది
Movie
Rajeev Rayala
|

Updated on: Sep 02, 2025 | 12:28 PM

Share

ప్రస్తుతం ఉన్న ట్రెండ్ లో చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేదు.. కథ కథనం బాగుంటే చాలు సినిమాలు భారీ విజయాలు అందుకుంటుంటాయి. కొన్ని సినిమాలు అంచనాలు లేకుండా వచ్చి మంచి విజయాలను అందుకున్న సినిమాలు ఎన్నో ఉన్నాయి.. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు ఊహించని విధంగా ఫ్లాప్ అవుతున్నాయి. అలాగే కొన్ని సినిమాలు వందలకోట్లు వసూల్ చేస్తున్నాయి. అలాగే చిన్న సినిమాలు అంటే తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు వందల కోట్లు వసూల్ చేస్తున్నాయి. చిన్న సినిమాలు కూడా పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అవుతున్నాయి. ఇప్పుడు ఓ చిన్న సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబడుతుంది. ఆ సినిమా బడ్జెట్ రూ.30 కోట్లు..కేవలం మూడు రోజుల్లోనే రూ.35 కోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇంతకూ ఆ సినిమా ఏదంటే..

ఏడు వింతలను ఏడిపించడానికే పుట్టిందేమో మావ..! డైరెక్టర్ రవికుమార్ కూతురు ఇప్పుడు ఎలా ఉందో చూశారా..!!

ఈ సినిమాలో ఓ యంగ్ బ్యూటీ ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమా రానున్న రోజుల్లో భారీ కలెక్షన్స్ సాధించడం ఖాయం. ఇంతకూ ఈ సినిమా పేరు ఏంటంటే.. లూకా చాప్టర్ వన్: చంద్ర. ఈ సినిమాలో అందాల భామ కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటించింది. డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను దుల్కర్ సల్మాన్ తన బ్యానర్ వేఫేరర్ ఫిల్మ్స్ బ్యానర్ పై తెరకెక్కించారు. మలయాళంలో తెరకెక్కిన సూపర్‌హీరో థ్రిల్లర్ ఇది.

ఇవి కూడా చదవండి

ప్రభాస్ కల్కి 2లో ఆ యంగ్ హీరో కూడా.. అభిమన్యుడి పాత్రలో ఎవరంటే

ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది ఈ సినిమా.. మొదటి రోజు రూ.2.7 కోట్ల ఓపెనింగ్‌తో మొదలయ్యింది. ఆగస్టు 28న విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. మొదటి మూడు రోజుల్లో ఇండియాలో రూ.13.95 కోట్ల నెట్ కలెక్షన్స్‌ . గ్రాస్ కలెక్షన్స్ రూ. 16.46 కోట్లు వసూల్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 35 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసుకుంది. ఈ సినిమా బడ్జెట్ రూ. 30 కోట్లతో తెరకెక్కింది. ఇక ఈ సినిమాలో అరుణ్ కురియన్, చందు సలీంకుమార్, నిశాంత్ సాగర్, రఘునాథ్ పాలేరి, విజయరాఘవన్ కీలక పాత్రలో నటించారు. మలయాళ బాక్సాఫీస్ దగ్గర నయా రికార్డ్ క్రియేట్ చేస్తుంది.

విక్రమార్కుడు సినిమాలో ఊపేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవ్వాల్సిందే

కళ్యాణి ప్రియదర్శన్ ఇన్ స్టా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.