AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : బుర్ర హీటెక్కించే ట్విస్టులు.. 2 గంటల మిస్టరీ థ్రిల్లర్.. ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతుంది..

2024 సంవత్సరంలో విడుదలైన ఓ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతుంది. అందులో చాలా రహస్యాలు, ఉత్కంఠభరితమైన, కథాంశంతో మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ సినిమా చూస్తే మీ బుర్ర హీటెక్కిపోతుంది. ఇంతకీ ఈ సినిమా ఏంటో తెలుసా.. ?

Cinema : బుర్ర హీటెక్కించే ట్విస్టులు.. 2 గంటల మిస్టరీ థ్రిల్లర్.. ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతుంది..
Sookshmadarshini Movie
Rajitha Chanti
|

Updated on: Sep 05, 2025 | 2:23 PM

Share

ప్రస్తుతం ఓటీటీ ప్రపంచంలో పలు చిత్రాలు రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఆసక్తికరమైన కథాంశం… విభిన్నమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. హారర్, సస్పెన్స్, మిస్టరీ చిత్రాలు ఇప్పుడు సత్తా చాటుతున్నాయి. ఇటీవల విడుదలైన ఒక సినిమా జనాలకు నచ్చేసింది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా సూక్ష్మదర్శిని . మలయాళ భాషలో రూపొందిన బ్లాక్ కామెడీ మిస్టరీ థ్రిల్లర్ నవంబర్ 22, 2024న థియేటర్లలోకి అడుగుపెట్టింది. MC జితిన్ దర్శకత్వం వహించగా లిబిన్ TB, అతుల్ రామచంద్రన్ రచించారు. ఈ చిత్రంలో బాసిల్ జోసెఫ్, నజ్రియా నజీమ్ ఫహద్ కీలకపాత్రలు పోషించారు. తక్కువ సమయంలోనే మంచి రెస్పాన్స్ అందుకుంది.

ఇవి కూడా చదవండి : Cinema: 70 లక్షల బడ్జెట్.. 75 కోట్ల కలెక్షన్స్.. కట్ చేస్తే.. 12 సంవత్సరాలు థియేటర్లలో దుమ్మురేపిన సినిమా..

జనవరి 11, 2025 నాటికి, సూక్ష్మదర్శిని ఇప్పటికీ హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషలలో ఈ సినిమా హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. కథ విషయానికి వస్తే.. సూక్ష్మదర్శిని కథాంశం ప్రియదర్శిని (అకా ప్రియ) అనే సాధారణ గృహిణి తన భర్త ఆంటోనీ కుమార్తె కనితో ప్రశాంత జీవితాన్ని గడుపుతుంది. మాన్యుయేల్ అనే వ్యక్తి తన తల్లి గ్రేస్ తో కలిసి వారి కలనీలోకి ప్రవేశించి గ్రేస్ బేకర్స్ ను ప్రారంభించడంతో వారి జీవితాల్లో మలుపులు చోటు చేసుకుంటాయి. మాన్యుయేల్ వింత ప్రవర్తన, గోప్యత ప్రియా అనుమానాలను రేకెత్తిస్తుంది. ఆ తర్వాత అతడి గురించిఎన్నో రహస్యాలు తెలుసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది సినిమా.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : Actress: తస్సాదియ్యా.. బుల్లిగౌనులో సీరియల్ బ్యూటీ రచ్చ.. గ్లామర్ ఫోజులతో గత్తరలేపుతున్న వయ్యారి..

రూ. 14 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన సూక్ష్మదర్శిని రూ. 27.92 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ. 22.25 కోట్లు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ. 54.36 కోట్లు వసూలు చేసింది. ఇది దాని బడ్జెట్ కంటే 4 రెట్లు ఎక్కువ సంపాదించింది. ప్రస్తుతం IMDbలో 7.8 రేటింగ్‌తో ఉంది.

ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu: బిగ్‏బాస్ సీజన్ 9లోకి ప్రభాస్ హీరోయిన్.. సెన్సేషనల్ ఫోక్ సింగర్.. ఫుల్ లిస్ట్ ఇదే..

ఇవి కూడా చదవండి : Tollywood : అక్కినేని మూడు తరాలతో కలిసి నటించిన ఏకైక హీరోయిన్.. ఏఎన్నార్, నాగార్జున, నాగచైతన్యతో సినిమాలు.. ఎవరంటే..