Tollywood : అక్కినేని మూడు తరాలతో కలిసి నటించిన ఏకైక హీరోయిన్.. ఏఎన్నార్, నాగార్జున, నాగచైతన్యతో సినిమాలు.. ఎవరంటే..
అక్కినేని మూడు తరాలతో కలిసి నటించిన ఏకైక టాలీవుడ్ హీరోయిన్ ఎవరో మీకు తెలుసా.. ? ఒకప్పుడు కథానాయికగా చక్రం తిప్పిన ఆమె.. ఇప్పుడు యంగ్ హీరోహీరోయిన్లకు తల్లిగా నటిస్తుంది. వరుస సినిమాలతో సెకండ్ ఇన్నింగ్స్ లోనూ బిజీగా ఉంటుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..? అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్యతో కలిసి పలు చిత్రాల్లో నటించింది.

ప్రస్తుతం ఇండస్ట్రీలో అక్కినేని హీరోలు వరుస హిట్స్ అందుకుంటున్నారు. ఇటీవలే కుబేర, కూలీ చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ ఖాతాలో వేసుకున్నారు నాగార్జున. మరోవైపు తండేల్ మూవీతో రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరారు నాగచైతన్య. దీంతో ఇప్పుడు ఈ ఇద్దరు హీరోల రాబోయే సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. అక్కినేని మూడు తరాలతో కలిసి నటించిన ఏకైక టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా..? ఆమె ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలేసింది. బాలీవుడ్ నుండి దక్షిణాది వరకు తన నటనతో ప్రజల హృదయాలను గెలుచుకుంది. ఆమె మరెవరో కాదు.. రమ్యకృష్ణ. ఒకప్పుడు వరుస సినిమాలతో అగ్ర కథానాయికగా దూసుపోయిన ఆమె.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి స్టార్ హీరోలతో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.
ఇవి కూడా చదవండి : OTT Movie: 25 కోట్ల బడ్జెట్.. ఆరేళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తున్న సినిమా.. ఇప్పుడు ఓటీటీలో దుమ్మురేపుతుంది..
1993లో రమ్యకృష్ణ సంజయ్ దత్ తో కలిసి ‘ఖల్నాయక్’ సినిమాలో నటించింది. ఈ సినిమా థియేటర్లలోకి రాగానే హిట్ అయింది. అంతేకాదు.. తెలుగు, తమిళం, హిందీ భాషలలో దాదాపు రెండు దశాబ్దాలుగా హీరోయిన్‌గా పనిచేసింది. 1984లో కంచు కాగడ సినిమాతో రమ్య కృష్ణ తెలుగు తెరకు పరిచయమైంది. దాదాపు 15 సంవత్సరాలు తెలుగులో స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటింది. చిరంజీవి, నాగార్జున, బాలయ్య, వెంకీ మామ, మోహన్ బాబు, రాజేంద్ర ప్రసాద్ వంటి ఆ కాలంలోని అందరు హీరోలతోనూ ఆమె నటించింది.
ఇవి కూడా చదవండి : Tollywood : అరె ఎంట్రా ఇది.. అప్పట్లో సెన్సేషన్ ఈ అమ్మడు.. ఇప్పుడు ఇలా.. ఎవరో గుర్తుపట్టారా.. ?
రమ్యకృష్ణ మూడు తరాల హీరోలతో, తాత, తండ్రి, కొడుకులతో నటించింది. అక్కినేని నాగేశ్వరరావు నుండి అక్కినేని అఖిల్ వరకు.. ఆమె మూడు తరాలతో నటించింది. అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి సూత్రధారుడు, దాగుడు మూట దాంపత్యం, ఇద్దరే దీవన్ వంటి చిత్రాలలో పనిచేసింది. అయితే ఈ మూడు సినిమాల్లోనూ అక్కినేని నాగేశ్వరరావు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక నాగార్జున హీరోయిన్‌గా రమ్యకృష్ణ ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలను చేశారు. వారి కాంబినేషన్‌లో 10కి పైగా చిత్రాలు వచ్చాయి. టాలీవుడ్ సూపర్ హిట్ కాంబినేషన్లలో ఒకటి, సంకీర్తన, హలో బ్రదర్, చంద్రలేఖ, అన్నమయ్య, అల్లరి అల్లుడు.. ఇవి బ్లాక్ బస్టర్ కాంబినేషన్లు. రమ్య కృష్ణ నాగ చైతన్యతో కూడా సినిమాలు చేసింది. ఆమె శైలజా రెడ్డి అల్లుడు చిత్రంలో అత్తగా, బంగార్రాజు చిత్రంలో నానమ్మగా నటించింది. అలాగే హలో చిత్రంలో అఖిల్ తల్లిగా నటించింది. మూడు తరాల హీరోలతో సినిమాలు చేసి రికార్డు సృష్టించింది.
ఇవి కూడా చదవండి : Tollywood: ఒక్క సినిమాతోనే సెన్సేషన్.. ఇప్పుడు ఎన్టీఆర్ పక్కన ఛాన్స్.. తెలుగులో క్యూ కట్టిన ఆఫర్స్..
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Tollywood : అప్పుడు బ్యాన్ చేశారు.. ఇప్పుడు వరుస ఆఫర్స్.. ఈ సీరియల్ బ్యూటీ క్రేజ్ చూస్తే..








