Rangastalam Movie: రంగస్థలం సినిమాలో సమంత పాత్రను మిస్ చేసుకున్న హీరోయిన్..ఎవరంటే..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ మలుపు తిప్పిన సినిమా రంగస్థలం. ఈ మూవీలో అద్భుతమైన నటనతో విమర్శకులను సైతం ఆశ్చర్యపరిచారు. 2018లో రిలీజ్ అయిన ఈ యాక్షన్ డ్రామాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందామా.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమాల క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. చిరుత సినిమాతో హీరోగా అరంగేట్రం చేసిన చరణ్.. రంగస్థలం సినిమాతో నటుడిగా ప్రశంసలు అందుకున్నారు. రామ్ చరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన మూవీ ఇది. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో చిట్టిబాబు పాత్రలో చరణ్ యాక్టింగ్ అద్భుతమనే చెప్పాలి. వినికిడి సమస్య ఉన్న పాత్రలో చరణ్ నటన జనాలను కట్టిపడేసింది. 1980వ దశకంలో ఒక ఊరిలో జరిగే కథను ఆధారంగా వచ్చిన ఈ చిత్రంలో చరణ్ అన్న కుమార్ బాబు పాత్రలో ఆది పినిశెట్టి, ఊరి పెద్ద ఫణీంద్ర భూపతి పాత్రలో జగపతి బాబు నటించారు. ఇక ఇందులో చరణ్ సరసన సమంత కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి : Tollywood : అప్పుడు బ్యాన్ చేశారు.. ఇప్పుడు వరుస ఆఫర్స్.. ఈ సీరియల్ బ్యూటీ క్రేజ్ చూస్తే..
ఈ సినిమాతో సమంతకు సైతం మంచి క్రేజ్ వచ్చింది. అయితే ఇందులో సమంత కంటే ముందు అనుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా.. ? అంతేకాదు ఆ హీరోయిన్ తో రెండు షెడ్యూల్స్ కూడా చేశారట. కానీ ఆ తర్వాత ఆమె సినిమా నుంచి తప్పుకుందని వార్తలు వచ్చాయి. ఆమె ఎవరో కాదు.. మలయాళఈ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ సరసన సామ్ కంటే ముందు అనుపమను సెలక్ట్ చేశారట. అయితే ఈ చిత్రంలో పల్లెటూరి అమ్మాయి పాత్రలో బర్రెలను కడగడం, చెరువులో తోమడం వంటివి చేయాల్సి వచ్చింది. దీంతో అనుపమ ఈ సినిమా నుంచి తప్పుకుందట.
ఇవి కూడా చదవండి : OTT Movie: 25 కోట్ల బడ్జెట్.. ఆరేళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తున్న సినిమా.. ఇప్పుడు ఓటీటీలో దుమ్మురేపుతుంది..
ఆ తర్వాత ఆమె స్థానంలోకి సమంతను తీసుకున్నారు సుకుమార్. ఈ మూవీలో సమంత యాక్టింగ్ గురించి చెప్పక్కర్లేదు. రామలక్ష్మీ పాత్రకు ప్రాణం పోసింది సామ్. అయితే అనుపమ నిజంగానే ఈ సినిమా నుంచి తప్పుకుందా ? అనే విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు. ప్రస్తుతం తెలుగు, మలయాళం చిత్రాల్లో నటిస్తుంది అనుపమ.
ఇవి కూడా చదవండి : Tollywood : అప్పుడు బ్యాన్ చేశారు.. ఇప్పుడు వరుస ఆఫర్స్.. ఈ సీరియల్ బ్యూటీ క్రేజ్ చూస్తే..
ఇవి కూడా చదవండి : Tollywood: ఒక్క సినిమాతోనే సెన్సేషన్.. ఇప్పుడు ఎన్టీఆర్ పక్కన ఛాన్స్.. తెలుగులో క్యూ కట్టిన ఆఫర్స్..
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Tollywood : అరె ఎంట్రా ఇది.. అప్పట్లో సెన్సేషన్ ఈ అమ్మడు.. ఇప్పుడు ఇలా.. ఎవరో గుర్తుపట్టారా.. ?




