AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress: ఒకప్పుడు సీరియల్ బ్యూటీ.. ఇప్పుడు టాప్ హీరోయిన్.. ఒక్కో సినిమాకు కోట్ల రెమ్యునరేషన్..

నటనపై ఆసక్తితో మోడలింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. అటు వాణిజ్య ప్రకటనలు చేస్తూనే.. పలు సీరియల్స్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత నెమ్మదిగా సినిమాల్లో అవకాశాలు అందుకుంది. మొదట్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన ఆమె.. ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా చక్రం తిప్పుతుంది.

Actress: ఒకప్పుడు సీరియల్ బ్యూటీ.. ఇప్పుడు టాప్ హీరోయిన్.. ఒక్కో సినిమాకు కోట్ల రెమ్యునరేషన్..
Mrunal Thakur
Rajitha Chanti
|

Updated on: Aug 31, 2025 | 8:57 AM

Share

ఒకప్పుడు సీరియల్స్ ద్వారా జనాలకు దగ్గరయ్యింది. ఆ తర్వాత నెమ్మదిగా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. నటనపై ఆసక్తితో ఆత్మ విశ్వాసంతో అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేసింది. చివరకు ఇప్పుడు టాప్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకుపోతుంది. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న కథానాయికలలో ఆమె ఒకరు. తెలుగు, హిందీ భాషలలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తుంది. బుల్లితెర నుంచి సిల్వర్ స్క్రీన్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. ప్రస్తుతం ఈ బ్యూటీ ఒక్కో సినిమాకు కోట్లలో రెమ్యునరేషన్ వసూలు చేస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ మృణాల్ ఠాకూర్.

ఇవి కూడా చదవండి : గ్లామర్‏లో అరాచకం.. అందం ఉన్న కలిసిరాని అదృష్టం.. క్రేజ్ పీక్స్..

ఇవి కూడా చదవండి

కుంకుమ్ భాగ్య సీరియల్ ద్వారా బుల్లితెరపై విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత నెమ్మదిగా సినిమాల్లో అవకాశాలు అందుకుంది. మహారాష్ట్రకు చెందిన మృణాల్ ఠాకూర్ 2014 నుండి ఇండస్ట్రీలో చురుగ్గా ఉంటున్నారు. మొదట్లో మరాఠీ భాషా చిత్రాల్లో నటించిన ఆమె.. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. లవ్ సోనియా, జెర్సీ, సూపర్ 30 వంటి చిత్రాలతో నార్త్ లో ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత 2022లో విడుదలైన సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా ఆమె జీవితంలో పెద్ద మలుపు తిరిగింది. దీంతో ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి.

ఇవి కూడా చదవండి : Actress : ఎలాంటి డైట్ లేకుండా 35 కిలోల బరువు తగ్గిన హీరోయిన్.. ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..

ప్రస్తుతం తెలుగు, హిందీ భాషలలో వరుస అవకాశాలు అందుకుంటున్న ఆమె.. చేతిలో 5కు పైగా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో 2 తెలుగు సినిమాలు కావడం విశేషం. నివేదికల ప్రకారం మృణాల్ ఆస్తుల విలువ రూ.40 కోట్ల వరకు ఉంటుంది. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.2 కోట్లు పారితోషికం తీసుకుంటుంది. అలాగే ఆమె వద్ద హోండా అకార్డ్, టయోటా ఫార్చ్యూనర్, మెర్సిడెస్-బెంజ్ S450 కార్లు ఉన్నాయి. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఫాలోవర్ల సంఖ్య 15 మిలియన్లు దాటింది.

ఇవి కూడా చదవండి : Serial Actress: ఆఫర్స్ కోసం వెళితే కమిట్మెంట్ అడిగారు.. అలా ఆకలి తీర్చుకున్నా.. సీరియల్ బ్యూటీ ఎమోషనల్..

ఇవి కూడా చదవండి : Actress : ఎలాంటి డైట్ లేకుండా 35 కిలోల బరువు తగ్గిన హీరోయిన్.. ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..

Follow Us
ధురంధర్ 2 కలెక్షన్లు.. 15 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా?
ధురంధర్ 2 కలెక్షన్లు.. 15 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా?
నిరుద్యోగుల అకౌంట్లోకి రూ.3 లక్షలు.. తెలంగాణ ప్రభుత్వం ఛాన్స్..
నిరుద్యోగుల అకౌంట్లోకి రూ.3 లక్షలు.. తెలంగాణ ప్రభుత్వం ఛాన్స్..
ఈ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వానలు.. ఇదిగో 3రోజుల వెదర్ రిపోర్ట్
ఈ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వానలు.. ఇదిగో 3రోజుల వెదర్ రిపోర్ట్
బండ బూతులు తిట్టుకున్న ఒకే టీం ప్లేయర్స్.. PSLలో షాకింగ్ సీన్?
బండ బూతులు తిట్టుకున్న ఒకే టీం ప్లేయర్స్.. PSLలో షాకింగ్ సీన్?
4000 కోట్ల రూపాయల అద్భుతం: 'రామాయణ' గ్లోబల్ బిజినెస్ స్ట్రాటజీ..
4000 కోట్ల రూపాయల అద్భుతం: 'రామాయణ' గ్లోబల్ బిజినెస్ స్ట్రాటజీ..
సమ్మర్‌లో మామిడి పండ్లు లాగిస్తున్నారా?.. జాగ్రత్త వీరికి విషమే
సమ్మర్‌లో మామిడి పండ్లు లాగిస్తున్నారా?.. జాగ్రత్త వీరికి విషమే
ఇందిరమ్మ ఇళ్లపై రేవంత్ సర్కార్ మరో అప్డేట్
ఇందిరమ్మ ఇళ్లపై రేవంత్ సర్కార్ మరో అప్డేట్
ఈ గింజలు గ్లాసుడు నీళ్లలో ఓ స్పూన్ నానబెట్టి తాగితే ఉంటుంది సామీ!
ఈ గింజలు గ్లాసుడు నీళ్లలో ఓ స్పూన్ నానబెట్టి తాగితే ఉంటుంది సామీ!
వాస్తు టిప్స్ : మీ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని చెప్పే సంకేతాలు ఇవే!
వాస్తు టిప్స్ : మీ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని చెప్పే సంకేతాలు ఇవే!
నలుపు, తెలుపు, గోధుమ.. ఏ రంగు జుట్టు ఉన్నవారు అదృష్టవంతులో తెలుసా
నలుపు, తెలుపు, గోధుమ.. ఏ రంగు జుట్టు ఉన్నవారు అదృష్టవంతులో తెలుసా