Tollywood: రంగ స్థలం టు సిల్వర్ స్క్రీన్.. 400కు పైగా సినిమాల్లో నటించిన ఈ టాలీవుడ్ కమెడియన్ ను గుర్తు పట్టారా?
ఈయన మొదట రంగ స్థలం నటుడు. చిన్నప్పటి నుంచే నాటకాల్లో పాల్గొన్నాడు. ఆ తర్వాత ఆల్ ఇండియా రేడియోలో కొన్ని రోజులు పని చేశారు. ఆపై సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఇప్పటివరకు సుమారు 400 కు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు.

పై ఫొటోలో కనిపిస్తోన్న ఇద్దరిలో ఒకరు దిగ్గజ దర్శకుడు, దివంగత దాసరి నారాయణ రావు. ఆయనను ఈజీగా గుర్తు పట్టేయవచ్చు. మరి దర్శక రత్న దాసరి నారాయణ రావు చేతుల మీదుగా అవార్డు అందుకుంటోన్న వ్యక్తిని గుర్తు పట్టారా? ఆయనకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు ఉంది. కమెడియన్‌గా, రచయితగా, నిర్మాతగా, డైరెక్టర్‌గా తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారాయన. తన అభినయ ప్రతిభకు గుర్తింపుగా ఎన్నో అవార్డులు, పురస్కారాలు పొందారు. కేవలం కమెడియన్ గానే కాకుండా హీరోలు, హీరోయిన్లకు తండ్రి వంటి సహాయక నటుడి పాత్రల్లో ఆడియెన్స్ ను అలరించారు. ఇక నాగార్జున, చిరంజీవిల సూపర్ హిట్ సినిమాలకు మాటల రచయితగా కూడా పనిచేశారు. సుమారు 400 కు సినిమాల్లో నటించిన ఆయన ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు. ముఖ్యంగా యూబ్యూబ్ ఛానెల్ ద్వారా పలు ఆసక్తికరమైన వీడియోలు షేర్ చేస్తున్నారు.
ఈ నటుడిది తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలోని నేదనూరు స్వగ్రామం. తండ్రి వేదపండితుడు. రాష్ట్రపతి పురస్కార గ్రహీత కూడా. అప్పటి జమీందారు ఆయన పాండిత్య ప్రతిభకు మెచ్చి ఒక ఇల్లు బహుమానంగా ఇచ్చాడు. ఈ నటుడు పెద్దన్నయ్యే కూడా వేద పండితుడే. ఇక రంగ స్థలం నటుడిగా కెరీర్ ప్రారంభించిన ఈ నటుడు ఆ తర్వాతి కాలంలో ఆల్ ఇండియో రేడియోలో పనిచేశారు. ఆ తర్వాత సినిమాల్లోకి అడుగు పెట్టారు. సుమారు 400 కు పైగా సినిమాల్లో తన నటనతో ఆడియెన్స్ ను అలరించారు. తన కామెడీతో కడుపుబ్బా నవ్వించడమే కాదు ఆడియెన్స్ తో కన్నీళ్లు కూడా పెట్టించగలడు ఏ పాత్రలోనైనా పరకాయం ప్రవేశం చేయగలిగే ప్రతిభ ఈ నటుడిలో సొంతం. అందుకే నాలుగు నంది అవార్డులతో పాటు ఎన్నో పురస్కారాలు సొంతం చేసుకున్నారు.
మరి ఈయనెవరో గుర్తు పట్టారా? తను మరెవరో కాదు ఎల్బీ శ్రీరామ్. ఇది 1985 నాటి ఫొటో. అంటే సుమారు 40 ఏళ్ల క్రితం నాటిదన్నమాట. ఎల్బీ శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఓ నాటిక ను హైదరాబాదు త్యాగరాయగానసభలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి దాసరి నారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై ఎల్బీ శ్రీరామ్ కు అవార్డు అందజేశారు.
ఎల్బీ శ్రీరామ్ ఇప్పుడెలా ఉన్నారంటే?
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








