AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మురళీ మోహన్ చేతుల మీదుగా ‘మటన్ సూప్’ నుంచి మాస్ ఎనర్జిటిక్ సాంగ్..

చిన్న సినిమాలు ఈ మధ్యకాలంలో తెగ సందడి చేస్తున్నాయి. యంగ్ హీరోలు, కొత్త కొత్త దర్శకులు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో క్రేజీ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా పేరు మటన్ సూప్. ఆసక్తికర టైటిల్ తో తెరకెక్కించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

మురళీ మోహన్ చేతుల మీదుగా ‘మటన్ సూప్’ నుంచి మాస్ ఎనర్జిటిక్ సాంగ్..
Mutton Soup
Rajeev Rayala
|

Updated on: Sep 05, 2025 | 7:27 PM

Share

డిఫరెంట్ కథ, కథనాలతో రామకృష్ణ వట్టికూటి సమర్పణలో అలుక్కా స్టూడియోస్, శ్రీ వారాహి ఆర్ట్స్, భవిష్య విహార్ చిత్రాలు (BVC) బ్యానర్లపై రమణ్, వర్షా విశ్వనాథ్ హీరో హీరోయిన్లుగా రామచంద్ర వట్టికూటి తెరకెక్కించిన చిత్రం ‘మటన్ సూప్’. ‘విట్‌నెస్ ది రియ‌ల్ క్రైమ్‌’ ట్యాగ్ లైన్‌. మల్లిఖార్జున ఎలికా (గోపాల్), రామకృష్ణ సనపల, అరుణ్ చంద్ర వట్టికూటి నిర్మాతలుగా రానున్న ఈ నూతన చిత్రానికి సంబంధించిన టైటిల్‌ పోస్టర్‌, మోష‌న్ పోస్ట‌ర్‌, పాటలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

రీసెంట్‌గా తనికెళ్ల భరణి రిలీజ్ చేసిన ‘హర హర శంకరా’ అనే పాట కూడా మంచి ప్రశంసల్ని దక్కించి, మంచి వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ నటుడు మురళీ మోహన్ గారు ‘కల్లు కొట్టు కాడ’ అంటూ సాగే మరో మంచి మాస్ ఎనర్జిటిక్ నంబర్‌ను రిలీజ్ చేశారు. ఈ ప్రత్యేక గీతాన్ని సూరన్న రచించారు. సూరన్న, రేలారే రేలా గోపాల్, సుజాత వాసు కలిసి ఆలపించిన ఈ పాటకు వెంకీ వీణ అందించిన బాణీ ఎంతో క్యాచీగా ఉంది. ఇక లిరికల్ వీడియోని చూస్తుంటే సత్య మాస్టర్ కొరియోగ్రఫీ మరో స్పెషల్ అట్రాక్షన్ కానున్నట్టుగా కనిపిస్తోంది.

సాంగ్ రిలీజ్ చేసిన అనంతరం మురళీ మోహన్ మాట్లాడుతూ .. ‘‘మటన్ సూప్’ టైటిల్ చాలా బాగుంది. మల్లిఖార్జున ఎలికా (గోపాల్), రామకృష్ణ సనపల, అరుణ్ చంద్ర వట్టికూటి నిర్మాతలుగా రామకృష్ణ వట్టికూటి సమర్పణలో రామచంద్ర వట్టికూటి తెరెకెక్కించారు. యంగ్ టీం చేసిన ఈ ప్రయత్నానికి పెద్ద సక్సెస్ దక్కాలి. సాంగ్ చాలా బాగుంది. అల వైకుంఠపురములో సూరన్న మంచి పాటను పాడారు. జాన పద గీతాలు ప్రస్తుతం ఎక్కువ సక్సెస్ అవుతున్నాయి. ‘మటన్ సూప్’ పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

ఇవి కూడా చదవండి

చిత్ర దర్శకుడు రామచంద్ర వట్టికూటి మాట్లాడుతూ .. ‘‘మటన్ సూప్’లోని ‘కల్లు కొట్టు కాడ’ పాటను రిలీజ్ చేసిన మురళీ మోహన్ గారికి థాంక్స్. ఈ విషయంలో సహకరించిన మా సినీయర్ జర్నలిస్ట్ ప్రభు గారికి, మా అన్నకి థాంక్స్. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ పాట ఎస్ఆర్‌కే గారి వల్లే పుట్టింది. గోపాల్ గారు లేకపోతే ఈ ప్రాజెక్ట్ ఉండేది కాదు. మా అన్న, రామకృష్ణ నాకు ఈ ప్రయాణంలో అండగా నిలిచారు. మా హీరో రమణ్ సహకారం ఎప్పటికీ మర్చిపోలేను. మా సినిమాను పర్వతనేని రాంబాబు గారు నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లారు. త్వరలోనే ఆడియెన్స్ ముందుకు తీసుకు రాబోతోన్నామ’ని అన్నారు. హీరో రమణ్ మాట్లాడుతూ .. ‘మా ‘మటన్ సూప్’ సినిమాలోని మాస్ సాంగ్‌ను రిలీజ్ చేసిన మురళీ మోహన్ గారికి ధన్యవాదాలు. ఈ విషయంలో సహకరించిన ప్రభు గారికి, పర్వతనేని రాంబాబు గారికి థాంక్స్. రామచంద్ర గారు ఈ చిత్రాన్ని బాగా తీశారు. ఈ మూవీ పెద్ద సక్సెస్ అవుతుందని నమ్మకంగా ఉన్నామని అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.