AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఒకప్పుడు 500 ఎకరాల ఆసామి.. హీరో మోజుతో రోడ్డున పడ్డాడు.. ఈ స్టార్ కమెడియన్ లైఫ్‌లో ఎన్నో కష్టాలు

సినిమా ఇండస్ట్రీ అనేది ఓ రంగుల ప్రపంచం. ఇక్కడ ఎవరి లైఫ్ ఎప్పుడు ఎలా ఏ విధంగా టర్న్ అవుతుందో ఎవ్వరూ ఊహించలేరు. రోడ్డుపై తిరిగే వాడిని అనూహ్యంగా మేడలెక్కిస్తోంది. అలాగే మేడల్లో ఉండేవాడిని ఉన్నట్లుండి రోడ్డుపైకి లాగుతుంది. ఈ స్టార్ కమెడియన్ జీవితం ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ.

Tollywood: ఒకప్పుడు 500 ఎకరాల ఆసామి.. హీరో మోజుతో రోడ్డున పడ్డాడు.. ఈ స్టార్ కమెడియన్ లైఫ్‌లో ఎన్నో కష్టాలు
Tollywood Actor
Basha Shek
|

Updated on: Sep 09, 2025 | 7:13 PM

Share

ఇప్పుడు సాదా సీదా జీవితం గడుపుతోన్న ఈ స్టార్ కమెడియన్ ఒకప్పుడు కోట్ల ఆస్తులకు వారసుడు. ఒక పెద్ద భూస్వామి కుమారుడైన అతనికి ఏకంగా 5 ఎకరాల్లో లగ్జరీ హౌస్ ఉండేది. అలాగే 500 ఎకరాల్లో విలువైన తోటలు, ఆస్తులు ఉండేవి. కానీ తన సినిమాల పిచ్చితో అన్నిటినీ కోల్పోయాడు. ముఖ్యంగా హీరో అవ్వాలన్న మోజుతో ఎడాపెడా సినిమాలు తీసి చేతులు కాల్చుకున్నాడు. చివరకు చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. ప్రస్తుతం కమెడియన్ గా, సహాయక నటుడిగా సినిమాల్లో కనిపిస్తున్నాడు. తన సినిమాల ద్వారా వచ్చిన సంపాదనతోనే బతకు బండీని లాగుతున్నాడు. ఇంతకీ అతను ఎవరనుకుంటున్నారా? కోలీవుడ్ ప్రముఖ నటుడు, కమెడియన్ సత్యన్. ఇలా పేరు చెబితే ఠక్కున గుర్తు పట్టకపోవచ్చు కానీ శంకర్ దర్శకత్వంలో దళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన ‘స్నేహితుడు’ సినిమాలో సైలెన్సర్‌ అంటే ఇట్టే గుర్తు పడతారు. క్లాస్‌ ఫస్ట్‌ వచ్చేయాలని తెగ కష్టపడే ఇతడిని హీరో ముప్పుతిప్పలు పెడుతూ ఉంటాడు

సత్యన్ కొన్ని తెలుగు సినిమాల్లోనూ నటించాడు. నితిన్ భీష్మ మూవీతో పాటు.. ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్యామ్ సినిమాలోనూ ఈకమెడియన్ మెరిశాడు. అలాగే తెలుగు డబ్బింగ్ సినిమాలతోనూ టాలీవుడ్ ఆడియెన్స్ కు చేరువయ్యాడు. అయితే సత్యన్ ఇప్పుడు కమెడియన్ కావొచ్చు. సహాయక నటుడి పాత్రలు పోషించవచ్చు. కానీ అతను ఒకప్పుడు హీరోగానూ అదృష్టం పరీక్షించుకున్నాడు. కానీ సక్సెస్ అవ్వలేకపోయాడు.

ఇవి కూడా చదవండి

సత్యన్ ఒక పెద్ద భూస్వామి కొడుకు. తండ్రి మాధంపట్టి శివకుమార్ కు కొన్ని కోట్లు విలువజేసే ఆస్తులున్నాయి. ఇక ఏకైక కుమారుడు కావడంతో సత్యన్ కే ఈ ఆస్తులన్నీ వచ్చాయి. దీంతో అతను లగ్జరీ లైఫ్ కు అలవాటు పడ్డాడు. అదే సమయంలో సినిమాల పిచ్చి సత్యన్ ఆస్తులను కర్పూరంలా కరిగించింది. శివకుమార్‌ నిర్మాతగా మారడంతోనే ఈ కష్టాలు మొదలయ్యాయి. సినిమాలు తీసి చేతులు కాల్చుకున్నాడు. ఈ నష్టాల నుంచి గట్టెక్కే క్రమంలో ఆస్తులన్నీ అమ్ముకున్నాడు. 2000వ సంవత్సరంలో ఇలయవన్‌ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సత్యన్. అలాగే ‘కన్న ఉన్నై తెడుకిరెన్‌’ అనే మరో సినిమాలో నటించాడు. ఈ రెండు సినిమాలకు సత్యన్ తండ్రే నిర్మాతగా వ్యవహరించడం విశేషం. అయితే దురదృష్టవశాత్తూ ఈ రెండు సినిమాలు ఘోరంగా డిజాస్టర్ అయ్యాయి. దీంతో సత్యన్ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంది. చివరకు బంగ్లాను కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. దీని తర్వాత కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చాడు సత్యన్. ఇప్పుడు తన సినిమాల ద్వారా వచ్చిన ఆదాయంతోనే కుటుంబాన్ని పోషిస్తున్నాడీ స్టార్ కమెడియన్.

స్నేహితుడు సినిమాలో సత్యన్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి