Bigg Boss Telugu 9: ఇదేం ట్విస్ట్ బిగ్ బాస్! హౌస్‌లోకి మాజీ కంటెస్టెంట్ల ఎంట్రీ.. అసలేం ప్లాన్ చేశారు?
అనుకున్నట్లే బిగ్ బాస్ సీజన్ 9 మంచి ట్విస్టులతో సాగుతోంది. డబుల్ హౌస్, కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్, ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్.. అంటూ ఈసారి బుల్లితెర ఆడియెన్స్ కు మంచి థ్రిల్లింగ్ ఎంటర్ టైన్మెంట్ ఇస్తున్నారు. తాజాగా బిగ్ బాస్ హౌస్ లోకి మాజీ కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వడం ఆసక్తిగా మారింది.

‘ఈ సారి అది డ్రీమ్ హౌస్ కాదు.. డబుల్ హౌస్.. డబుల్ డోస్’ అంటూ బిగ్ బాస్ సీజన్ 9 పై ముందు నుంచి హైప్ క్రియేట్ చేశాడు హోస్ట్ నాగార్జున. ఇది చదరంగం కాదు రణరంగం అంటూ ఈసారి ఊహించని ట్విస్టులు ఉంటాయని ముందే హింట్ ఇచ్చాడు. అందుకే తగ్గట్టే ఈసారి బిగ్ బాస్ లో రెండు హౌస్ లు ఉన్నాయి. . మెయిన్ హౌస్‌ను కామనర్స్ కు కేటాయించగా, సెలబ్రిటీలు ఔట్ హౌస్ లో ఉంటున్నారు. ఈసారి మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టారు. ఇందులో 9 మంది సెలబ్రిటీలు కాగా, ఆరుగురు కామనర్స్ కోటాలో హౌస్ లోకి కంటెస్టెంట్స్ గా ఎంట్రీ ఇచ్చారు. అంతేకాదు కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీలు, ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ అంటూ కంటెస్టెంట్ల మధ్య అగ్గి రాజేశాడు. దీంతో ఎప్పటిలాగే హౌస్ లో హీట్ పెరిగింది. అప్పుడే కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఈ గొడవలు కొనసాగుతుండగానే.. బిగ్ బాస్ మరో ట్విస్ట్ ఇచ్చాడు. మాజీ కంటెస్టెంట్స్ ప్రియాంక జైన్, విష్ణు ప్రియ, అమర్ దీప్ బిగ్‌బాస్ తెలుగు 9 హౌస్ లోకి వచ్చారు. ముగ్గురు కలిసి కంటెస్టెంట్లను సర్ ప్రైజ్ చేశారు.
ఈ సందర్భంగా తమ బిగ్ బాస్ అనుభవాలను మరోసారి గుర్తు చేసుకున్నారు ప్రియాంక, అమర్ దీప్, విష్ణు ప్రియ. అయితే ఈ ముగ్గురు హౌస్ టూర్ కోసం హౌస్ లోకి అడుగు పెట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. హౌస్ లో వారెలాంటి రచ్చ చేశారో ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే.
బిగ్ బాస్ హౌస్ లో విష్ణు ప్రియ, అమర్ దీప్, ప్రియాంక జైన్..
The war is on, but first… a tour of the battlefield 🏡💥 Join Vishnu Priya, Priyanka & Amardeep inside the #BiggBoss9 house
Watch #BiggBossTelugu9 Mon-Fri 9:30PM, Sat-Sun 9PM on #StarMaa & Stream 24/7 on #JioHotstar #VishnuPriya #PriyankaJain #Amardeep pic.twitter.com/TkMu1pH1q9
— Starmaa (@StarMaa) September 8, 2025
బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో..
Cleaning vishayam lo owners madhya godava! Asalu evaru cheppindi correct?💥
Watch #BiggBossTelugu9 Mon-Fri at 9:30PM, Sat & Sun at 9PM On #StarMaa & Stream 24/7 on #JioHotstar#BiggBossTelugu9 #StreamingNow #StarMaa #JioHotstar pic.twitter.com/NJllll3OrZ
— Starmaa (@StarMaa) September 9, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








