AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 9: హౌస్‌లో కామనర్స్ ఎందుకు? బిగ్‌బాస్ విజేత ఎవరో చెప్పిసిన ప్రముఖ నటుడు.. వీడియో వైరల్

ఆదివారం ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 9 పై ప్రముఖ నటుడు బాంబ్ పేల్చాడు. అసలు ఈ షో ఉన్నదే సెలబ్రిటీల కోసమని, అలాంటిది కామనర్స్ ను ఎందుకు హౌస్ లోకి పిలిచారని ప్రశ్నించాడు. అంతేకాదు గతంలో కామనర్స్ కారణంగా హౌస్ లో జరిగిన పెంటు గుర్తు లేదా? అని..

Bigg Boss Telugu 9: హౌస్‌లో కామనర్స్ ఎందుకు? బిగ్‌బాస్ విజేత ఎవరో చెప్పిసిన ప్రముఖ నటుడు.. వీడియో వైరల్
Bigg Boss Telugu 9
Basha Shek
|

Updated on: Sep 09, 2025 | 5:30 PM

Share

బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ రియాలిటీ షో బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 9 ఆదివారం (సెప్టెంబర్ 07) సాయంత్రం గ్రాండ్‌గా ప్రారంభమైంది. 9 మంది సెలబ్రిటీలు, ఆరుగురు కామన్ మ్యాన్లతో సహా మొత్తం 15 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి అడుగు పెట్టారు. భరణి, తనూజ, శ్రష్టి వర్మ, ఫ్లోరా సైనీ, రీతూ చౌదరీ, ఇమ్మాన్యుయెల్‌, రాము రాథోడ్‌, సుమన్‌ శెట్టి, సంజనా గల్రానీ సెలబ్రిటీలుగా హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వగా, మర్యాద మనీష్‌, పవన్‌ కళ్యాణ్‌, డీమాన్‌ పవన్‌, దమ్ము శ్రీజ, ప్రియాలు, హరీష్‌ కామనర్స్ కోటాలో బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చారు. కామనర్స్ మెయిన్‌ హౌస్‌లో ఉంటుండగా, సెలబ్రిటీలు మాత్రం ఔట్ హౌస్ లో ఉన్నారు. మొత్తానికి ఓనర్స్ వెర్సస్ టెనెల్స్ అంటూ కంటెస్టెంట్స్ మధ్య బాగానే పోటీ పెట్టాడు బిగ్ బాస్. ఇదిలా ఉంటే బిగ్ బాస్ షోపై ప్రముఖ సీరియల్ నటుడు నరేష్‌ లొల్లా సంచలన కామెంట్స్ చేశాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక వీడియోను కూడా రిలీజ్ చేశాడు. అందులో బిగ్‌ బాస్‌ షో ఉన్నదే సెలబ్రిటీల కోసమని, మధ్యలో ఈ కామనర్స్ ఎవరని నరేష్ ప్రశ్నించాడు. కామనర్స్ కి కెమెరాని ఎలా ఫేస్‌ చేయాలో అసలు తెలియదని, అలాగే సెలబ్రిటీలను ఎలా ఎదుర్కొనాలో తెలియదన్నాడు. సెలబ్రిటీల ముందు కామనర్స్ నిలువ లేరంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

‘సెలబ్రిటీల కోసం స్టార్ట్ చేసిన షోలోకి కామనర్స్ ని ఎందుకు తీసుకొస్తున్నారు. రెండు సీజన్ల క్రితమే కామనర్‌ని తీసుకొచ్చారు. అప్పుడు హౌస్ లో జరిగిన పెంట, రచ్చ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. అలాంటిది ఇప్పుడు మళ్లీ కామనర్స్ ని ఎందుకు తీసుకొచ్చారు. ఈ కామనర్స్ ఐదు వారాలకు మించి ఉండరు’ అని చెప్పిన నరేశ్ లొల్లా సెకన్లలో మాట మార్చాడు. చాలా మంది తాను ఇలా చెబుతానని అనుకుంటారు, కానీ అలా చెప్పనని, ఈ సారి కామనర్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారని చెప్పి బుర్రబద్దలయ్యే ట్విస్ట్ ఇచ్చాడు.

ఇవి కూడా చదవండి

‘ఈసారి సెలబ్రిటీల కంటే కామనర్సే చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. నేను అగ్నిపరీక్ష ఎపిసోడ్లని చూశాన. అందరూ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. పట్టుదలతో హౌస్ లోకి వచ్చారు. ఈ సారి వారిని తట్టుకోవడం చాలా కష్టమని, అందులోనూ హౌస్ లో సరైన సెలబ్రిటీ కంటెస్టెంట్లు లేరు. నాకు తెలిసి ఈ సారి బిగ్‌ బాస్‌ టైటిల్‌ కామనర్స్ దే. కామనర్స్ బ్యాక్‌గ్రౌండ్‌ చూస్తే వాళ్లు జస్ట్ కామనర్స్ కాదు. జీవితంలో చాలా సాధించారు. వాళ్ల గేమ్‌, మైండ్‌ గేమ్‌ వేరే లేవల్‌ . ఈ సారి కప్‌ కామనర్స్ కే సొంతం’ అని అంచనా వేశాడు నరేష్. `మగువ ఓ మగువ`, `లక్ష్మీ నివాసం` వంటి సీరియల్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నరేష్. ఇప్పుడు అతని కామెంట్స్ నెట్టింట బాగా వైరలవుతున్నాయి.

నరేష్ లొల్లా రిలీజ్ చేసిన వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా