AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రాణాపాయ స్థితిలో ఎన్టీఆర్ వీరాభిమాని.. అండగా నిలిచిన మంచు మనోజ్, బెల్లంకొండ.. ఏం చేశారో తెలుసా?

తమ అభిమానులు కష్టాల్లో ఉంటే అసలు తట్టుకోలేరు హీరోలు. వారికి ఏ కష్టం వచ్చినా తామున్నామంటూ ఆదుకుంటుంటారు. అయితే తాజాగా ఓ హీరో వీరాభిమాని కి కష్టమొస్తే ఇతర హీరోలు కూడా స్పందించి సాయం చేస్తామని ముందుకు రావడం ఆసక్తి రేపుతోంది.

ప్రాణాపాయ స్థితిలో ఎన్టీఆర్ వీరాభిమాని.. అండగా నిలిచిన మంచు మనోజ్, బెల్లంకొండ.. ఏం చేశారో తెలుసా?
Manchu Manoj, Bellamkonda Srinivas
Basha Shek
|

Updated on: Sep 07, 2025 | 1:21 PM

Share

ఏలూరు సిటీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ కరస్పాండెంట్ సోమేశ్ ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో తనను ఆదుకోవాలంటూ సోషల్ మీడియాలో ఒక కన్నీటి మెసేజ్ పెట్టాడు.. ‘ప్రస్తుతం నేను చాలా బాధాకరమైన పరిస్థితిలో ఉన్నాను. నా ఆరోగ్య సమస్యల వల్ల నా దగ్గర ఉన్న మొత్తం డబ్బు ఖర్చయిపోయింది. ఇప్పుడు నా దగ్గర ఏమీలేదు. ఆర్థికంగా బాగా వెనకబడ్డాను. ఒకానొక దశలో సూసైడ్ కూడా చేసుకుందామని అనుకున్నాను. కానీ నా పిల్లల కోసం నా కుటుంబం కోసం మళ్లీ బ్రతకాలని నిశ్చయించుకున్నాను. ఈ పరిస్థితిలో చివరికి ఒక్క ఆశతో నా బాధను ట్విట్టర్‌లో నా ఫ్రెండ్స్, ఎన్టీఆర్ అభిమానులు, ఇతర హీరోల ఫ్యాన్స్‌తో పంచుకున్నాను. కొంతమంది స్పందించి కొంత ఆర్థిక సాయం అందించారు. ఇంకా సుమారు రూ.2లక్షల వరకు అవసం ఉంది. మిమ్మల్ని నా కుటుంబసభ్యుల్లా భావిస్తూ ఈ క్లిష్ట సమయంలో మీ వంతు సాయం చేయాలని కోరుకుంటున్నాను. మీరిచ్చే ఒక్క రూపాయే నా జీవితంపై చాలా ప్రభావం చూపుతుంది. ఇప్పటికే సహాయం చేసిన వాళ్లకి నా కృతజ్ఞతలు. నా ఫోన్ నంబర్.. 7780335269’ అంటూ తన ఆవేదనను పంచుకున్నాడు సోమేష్.

ఎన్టీఆర్ అభిమాని పెట్టిన పోస్టుకు చాలా మంది స్పందించారు. తమకు తోచినంత ఆర్థిక సాయం పంపిస్తున్నారు. తాము పంపిన డబ్బులకి సంబంధించి స్క్రీన్ షాట్లు కూడా తీసి షేర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమేష్ పోస్టుకు భైరవం హీరోలు మంచు మనోజ్, బెల్లం కొండ శ్రీనివాస్ కూడా స్పందించారు. ‘ధైర్యంగా ఉండు తమ్ముడు. మేమంతా నీతోనే ఉన్నాం. లవ్‌యూ. నీ నంబర్ పంపించు’ అని మనోజ్ ట్వీట్ చేయగా సోమేశ్ మంచు వారబ్బాయికి తన ఫోన్ నంబర్ షేర్ చేశాడు.

ఇవి కూడా చదవండి

ఇక బెల్లంకొండ శ్రీనివాస్ స్పందిస్తూ.. ‘హలో బ్రదర్. ప్రమోషన్ల కోసం రేపు నేను విజయవాడకి వస్తున్నాం. అక్కడ నిన్ను కలుసుకుని నాకు వీలైనంత మేరకు సాయం చేస్తా’ అని ట్వీట్ చేశాడు. మొత్తానికి ఎన్టీఆర్ అభిమాని పట్ల మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్ స్పందించిన తీరు అభిమానుల మనసులు గెల్చుకుంది. ఇతరులు కూడా వీరిలాగే స్పందిస్తే సోమేష్ త్వరగా కోలుకుంటాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

మంచు మనోజ్ రిప్లై..

బెల్లంకొండ శ్రీనివాస్ ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..