AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: 5 కోట్లతో తీస్తే 120 కోట్లు.. ఓటీటీలో సూపర్ హిట్ దెయ్యం సినిమా.. అధికారిక ప్రకటన

చిన్న సినిమాగా థియటర్లలో విడుదలైన ఈ హారర్ థ్రిల్లర్ మూవీ సంచలన విజయం సాధించింది. రూ. 5 కోట్ల బడ్జెట్ తో తీస్తే 120 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. అయితే ఈ సూపర్ హిట్ మూవీ ఓటీటీ రిలీజ్ పై పలు రూమర్లు వచ్చాయి. వాటన్నింటికీ తెరదించుతూ ఇప్పుడు అధికారిక ప్రకటన వచ్చింది.

OTT Movie: 5 కోట్లతో తీస్తే 120 కోట్లు.. ఓటీటీలో సూపర్ హిట్ దెయ్యం సినిమా.. అధికారిక ప్రకటన
OTT Movie
Basha Shek
|

Updated on: Sep 07, 2025 | 12:49 PM

Share

ఇటీవలే థియేటర్లలోకి ఓ కన్నడ సినిమా వచ్చింది. హారర్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. తెలుగులోనూ మంచి వసూళ్లు దక్కాయి. ఇక్కడ లేదు కానీ కర్ణాటకలో ఇప్పటికీ చాలా చోట్ల థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శితమవుతోంది. 44 రోజులు గడిచినా ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతోంది. త్వరలోనే 50 రోజులు కూడా పూర్తి చేసుకోనుంది. ఇప్పటివరకు ఈ సినిమాకు రూ. 120 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. కేవలం రూ. 5 కోట్ల బడ్జటె్ తో తెరకెక్కిన ఈ మూవీకి ఇలాంటి కలెక్షన్లు రావడం ట్రేడ్ నిపుణులను సైతం ఆశ్చర్యపరిచింది. థియేటర్లలో సంచలనం సృష్టించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి అడుగు పెట్టనుంది. కన్నడ లేటెస్ట్ సూపర్ హిట్ సినిమా ‘సు ఫ్రమ్ సో’ ఓటీటీ విడుదల గురించి అధికారిక ప్రకటన వెలువడింది. JP తుమినాడు, షానిల్ గౌతమ్, సంధ్య అరకెరె, రాజ్ బి. శెట్టి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. సెప్టెంబర్ 9 నుండి ‘జియో హాట్‌స్టార్’లో స్ట్రీమింగ్ కానుంది.

జె.పి. తుమినాడు ‘సు ఫ్రమ్ సో’ చిత్రానికి దర్శకత్వం వహించారు. అతనికి ఇదే మొదటి సినిమా. తొలి ప్రయత్నంలోనే ఈ డైరెక్టర్ కు సూపర్ హిట్ సినిమా పడింది. ‘సు ఫ్రమ్ సో’ సినిమా ఓటీటీ రిలీజ్ నుంచి గత కొన్ని రోజలుగా పలు పుకార్లు షికార్లు కొడుతున్నాయి. అయితే అవన్నీ రూమర్లేనని తేలిపోయాయి. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు మంచి మొత్తానికి అమ్ముడయ్యాయి. ఈ నేపథ్యంలో జియో హాట్‌స్టార్ ద్వారా అధికారికంగా సుప్రమ్ సో సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు. ‘జియో హాట్‌స్టార్’ యాప్‌లో రాబోయే సినిమాల జాబితాలో ఈ మూవీ కూడా ఉంది. స్ట్రీమింగ్ తేదీనిసెప్టెంబర్ 9గా కూడా ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

‘సు ఫ్రమ్ సో’ సినిమా హర్రర్ కామెడీ జానర్ కు చెందినది. రిలీజైన అన్ని చోట్లా ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. తెలుగు, మలయాళంలోకి కూడా డబ్ చేయబడి మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 121 కోట్ల రూపాయలకు పైగా బాక్సాఫీస్ కలెక్షన్ సాధించింది. సు ఫ్రమ్ సో’ సినిమాను 5.5 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. అంచనా వేసిన దానికంటే ఎక్కువ కలెక్షన్లు రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి. ‘సు ఫ్రమ్ సో’ సినిమాను వివిధ భాషల్లో రీమేక్ చేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

జియో హాట్ స్టార్ అప్ కమింగ్ మూవీస్ లో సు ప్రమ్ సో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..