రూ.335 కోట్లతో తీస్తే రూ.2000 కోట్ల కలెక్షన్స్.. ఒక్క దెబ్బతో థియేటర్లను షేక్ చేసింది.. ఇప్పుడు ఓటీటీలోకి..
ప్రస్తుతం ఓటీటీలో సరికొత్త కంటెంట్ చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తుంది. హారర్, సస్పెన్స్, థ్రిల్లర్, రొమాంటిక్ సినిమాలు దూసుకుపోతున్నాయి. దీంతో ఈ జానర్ కంటెంట్ సినిమాలను నిర్మించేందుకు మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. కానీ థియేటర్లను షేక్ చేసిన ఈ మూవీ గురించి మీకు తెలుసా.. ?

హారర్ సినిమాలు చూడడం మీకు ఇష్టమా.. ? అయితే మీరు ఈ మూవీ గురించి తెలుసుకోవాల్సిందే. కొత్త కంటెంట్.. సస్పెన్స్, ట్విస్టులతో సాగే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఇది హాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఒక డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ మూవీ. అదే వెపన్స్. ఫేమస్ డైరెక్టర్ జాక్ క్రెగర్ దర్శకత్వం వహించిన ఈ హారర్ థ్రిల్లర్ మూవీలో జోష్ బ్రోలిన్, జూలియా గార్నర్, ఆస్టిన్ అబ్రామ్స్, కేరీ క్రిస్టోఫర్, టోబీ హాస్ లాంటి స్టార్స్ నటించారు. ఆగస్ట్ 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ మౌత్ టాక్ వచ్చింది. ఆ తర్వాత ఈ సినిమా చూసేందుకు జనాలు క్యూ కట్టారు. తక్కువ సమయంలోనే థియేటర్లలో అత్యధిక వసూళ్లు రాబట్టింది. దీంతో బాక్సాఫీస్ వద్ద కనీవినీ ఎరుగుని కలెక్షన్స్ అందుకుంది.
ఇవి కూడా చదవండి : Cinema: ఇది సక్సెస్ అంటే.. రూ.4 కోట్లు పెడితే.. రూ.121 కోట్ల కలెక్షన్స్.. థియేటర్లను శాసించిన సినిమా..
ఇప్పటివరకు ఈ సినిమా 23.5 కోట్ల డాలర్స్ అంటే దాదాపు రూ.2 వేల కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోతున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది. సెప్టెంబర్ 9 నుంచి నాలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోతోపాటు ఆపిల్ టీవీ ప్లస్, వుడు, గూగుల్ ప్లేలలోకి ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. కానీ ఇక్కడే చిన్న ట్విస్ట్ కూడా ఉందండోయ్.. ఈ సినిమాను ఫ్రీగా కాకుండా రెంట్ చెల్లించి చూడాల్సిందే.
ఇవి కూడా చదవండి : Tollywood : ఒకరు తోపు డైరెక్టర్.. ఇంకొకరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్.. ఈ ఇద్దరి టాలెంట్‌కు ప్రపంచమే జై కొట్టింది..
ఇంట్లోనే హారర్ సినిమాలను ఎంజాయ్ చేయాలనుకునేవారు ఇప్పుడు ఈ చిత్రాన్ని రెంట్ విధానంలో చూడొచ్చు. కానీ ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోతున్న ఈ సినిమాను ఆకస్మాత్తుగా ఓటీటీలోకి తీసుకువచ్చారు మేకర్స్. ఈ సినిమాకు ముందు నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది.
ఇవి కూడా చదవండి : Serial Actres: 16 ఏళ్లకే ఆడిషన్.. ఆపై బీ గ్రేడ్ సినిమాలు.. ఈ సీరియల్ హీరోయిన్ కష్టాలు చూస్తే..
ఇవి కూడా చదవండి : Actress: తస్సాదియ్యా.. క్రేజీ ఫోటోలతో గత్తరలేపుతున్న యాంకరమ్మ.. ఈ ముద్దుగుమ్మను గుర్తుపట్టరా.. ?








