Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema: ఇది సక్సెస్ అంటే.. రూ.4 కోట్లు పెడితే.. రూ.121 కోట్ల కలెక్షన్స్.. థియేటర్లను శాసించిన సినిమా..

కేవలం 4.5 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించిన కామెడీ హారర్ మూవీ ఇప్పుడు అత్యధిక వసూళ్లు రాబట్టింది. ఎలాంటి అంచనాలు, హడావిడి, ప్రమోషన్స్ లేకుండా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఇన్నాళ్లు థియేటర్లలో అదరగొట్టిన ఈ కామెడీ సినిమా ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వస్తుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా..

Cinema: ఇది సక్సెస్ అంటే.. రూ.4 కోట్లు పెడితే.. రూ.121 కోట్ల కలెక్షన్స్.. థియేటర్లను శాసించిన సినిమా..
Su From So
Rajitha Chanti
|

Updated on: Sep 06, 2025 | 1:46 PM

Share

ఇటీవల కన్నడ భాషలో విడుదలైన ఓ హారర్ కామెడీ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. ఎలాంటి హడావిడి లేకుండా విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. జానపద కథలు, హాస్యం కలగలిపిన ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు.. దేశవ్యాప్తంగా సినీప్రియులను అలరించింది. విజయవంతమైన థియేటర్ ప్రదర్శన తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు సు ఫ్రమ్ సో. జె.పి. తుమినాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజ్ బి. శెట్టి, షనీల్ గౌతమ్, జె.పి. తుమినాద్, సంధ్య అరకరే నటించారు. జూలై 25, 2025న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ మౌత్ టాక్ రావడంతో సూపర్ హిట్ గా నిలిచింది.

ఇవి కూడా చదవండి : Cinema: 70 లక్షల బడ్జెట్.. 75 కోట్ల కలెక్షన్స్.. కట్ చేస్తే.. 12 సంవత్సరాలు థియేటర్లలో దుమ్మురేపిన సినిమా..

రూ. 4.5 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.121 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు చేసిన కన్నడ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. సు ఫ్రమ్ సో సెప్టెంబర్ 5, 2025న జియో హాట్‌స్టార్‌లో ప్రీమియర్ కావాల్సి ఉంది. అయితే, OTT విడుదల ఆలస్యం అయింది. సెప్టెంబర్ 9న ఈ మూవీ ఓటీటీలోకి రానుంది.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : Tollywood : అక్కినేని మూడు తరాలతో కలిసి నటించిన ఏకైక హీరోయిన్.. ఏఎన్నార్, నాగార్జున, నాగచైతన్యతో సినిమాలు.. ఎవరంటే..

కథ విషయానికి వస్తే.. సు ఫ్రమ్ సో అనే సినిమా అశోకుడు అనే ఒక నిర్లక్ష్య గ్రామీణుడి చుట్టూ తిరుగుతుంది. సులోచన అనే మహిళ దెయ్యం అతన్ని ఆవహించిందని గ్రామస్తులు అనుమానించడంతో అతడి జీవితం మలుపు తిరుగుతుంది. నిజ జీవిత గ్రామ సంఘటనల నుండి ప్రేరణ పొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇవి కూడా చదవండి : Actress: తస్సాదియ్యా.. బుల్లిగౌనులో సీరియల్ బ్యూటీ రచ్చ.. గ్లామర్ ఫోజులతో గత్తరలేపుతున్న వయ్యారి..

ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu: బిగ్‏బాస్ సీజన్ 9లోకి ప్రభాస్ హీరోయిన్.. సెన్సేషనల్ ఫోక్ సింగర్.. ఫుల్ లిస్ట్ ఇదే..