Tollywood : ఒకరు తోపు డైరెక్టర్.. ఇంకొకరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్.. ఈ ఇద్దరి టాలెంట్‌కు ప్రపంచమే జై కొట్టింది..
తెలుగు సినిమా ప్రపంచంలో తమదైన ముద్ర వేసిన నటీనటులు, దర్శకనిర్మాతలు ఎంతో మంది ఉన్నారు. కానీ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసినవారిలో ఈ ఇద్దరు ఉన్నారు. వీరిద్దరికి వరల్డ్ వైడ్ లెవల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్న ఈ త్రోబ్యాక్ ఫోటోలో కనిపిస్తున్న ఆ ఇద్దరు ఎవరంటే.. ఇంతకీ వాళ్లెవరో తెలుసా మీకు.. ?

సోషల్ మీడియాలో తారలకు సంబంధించిన ప్రతి విషయం తెగ వైరలవుతుంది. ముఖ్యంగా సినీ సెలబ్రెటీల త్రోబ్యాక్ ఫోటోస్ ఇప్పుడు నెట్టింట అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. జీవితాల్లో మధురానుభూతులైన చిన్ననాటి జ్ఞాపకాలను ఇప్పుడు నెట్టింట పంచుకుంటున్నారు. అందుకే ఈమధ్య ఎక్కువగా నెట్టింట త్రోబ్యాక్ ఫోటోస్ ట్రెండ్ నడుస్తుంది. ఈ క్రమంలో తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలోని ఇద్దరు ఫేమస్ వ్యక్తులకు సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. పైన ఫోటోలో కనిపిస్తున్న ఇద్దరు వ్యక్తులు ఎవరో తెలుసా.. ? ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉన్న సెలబ్రెటీలు. వాళ్లిద్దరూ కజిన్స్.
ఇవి కూడా చదవండి : Cinema: 70 లక్షల బడ్జెట్.. 75 కోట్ల కలెక్షన్స్.. కట్ చేస్తే.. 12 సంవత్సరాలు థియేటర్లలో దుమ్మురేపిన సినిమా..
ఇండస్ట్రీలో ఇద్దరూ వేరు వేరు విభాగాల్లో తమ అద్భుతమైన ప్రతిభతో సత్తా చాటుతున్నారు. అంతేకాదు అంతర్జాతీయ స్థాయిలోనూ రికార్డులు సృష్టించారు. ఇండస్ట్రీలో ఒకరు తోపు డైరెక్టర్ అయితే.. మరొకరు సంగీత దర్శకులు. ఇద్దరి టాలెంట్ అద్భుతమే. కొన్నాళ్ల క్రితం తెలుగు సినిమా ఖ్యాతిని ఆస్కార్ వేదికపైకి తీసుకెళ్లారు. ఆ ఇద్దరు మరెవరో కాదండి.. డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, ఎమ్ ఎమ్ కీరవాణి. ఈ ఫోటో 1976లో తీసింది. ఎడమవైపు ఉన్న టీనేజ్ యువకుడు సంగీత దర్శకుడు కీరవాణి కాగా.. చారల చొక్కాతో ఉన్న మరో అబ్బాయి ఎస్ఎస్ రాజమౌళి.
ఇవి కూడా చదవండి : Actress: తస్సాదియ్యా.. బుల్లిగౌనులో సీరియల్ బ్యూటీ రచ్చ.. గ్లామర్ ఫోజులతో గత్తరలేపుతున్న వయ్యారి..
ఇద్దరి విషయానికి వస్తే.. దశాబ్దాలుగా దక్షిణాది సినిమా ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన పాటలతో శ్రోతల హృదయాలు గెలుచుకున్నారు ఎంఎం కీరవాణి. ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాలో ఆయన కంపోజ్ చేసిన నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో అంతర్జాతీయంగా ఆయన పేరు మారుమోగింది. ఇక ఎస్ఎస్ రాజమౌళి.. ఇప్పటివరకు అపజయమెరుగని డైరెక్టర్. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని మార్చిన జక్కన్న ఆర్ఆర్ఆర్ మూవీతో తెలుగు సినిమాను విశ్వవ్యాప్తం చేశారు. ప్రస్తుతం మహేష్ బాబుతో కలిసి పాన్ వరల్డ్ మూవీని రూపొందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ సీజన్ 9లోకి ప్రభాస్ హీరోయిన్.. సెన్సేషనల్ ఫోక్ సింగర్.. ఫుల్ లిస్ట్ ఇదే..
ఇవి కూడా చదవండి : Tollywood : అక్కినేని మూడు తరాలతో కలిసి నటించిన ఏకైక హీరోయిన్.. ఏఎన్నార్, నాగార్జున, నాగచైతన్యతో సినిమాలు.. ఎవరంటే..








