AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Siima Awards 2025: ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్.. సైమా అవార్డ్స్ -2025 విజేతలు వీళ్లే..

సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (Siima Awards) వేడుక దుబాయ్‏లో అట్టహాసంగా జరుగుతుంది. డ్యాన్సులు, పాటలతో తారలు సందడి చేస్తున్నారు. 2024 సంవత్సరంలో విశేష ప్రతిభ చూపించిన తెలుగు, కన్నడ నటీనటులు, సినిమాలకు అవార్డులను ప్రకటించారు. 13వ సైమా అవార్డ్స్ వేడుకలలో పుష్ప 2, కల్కి సినిమాలు సత్తా చాటాయి.

Siima Awards 2025: ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్.. సైమా అవార్డ్స్ -2025 విజేతలు వీళ్లే..
Siima Awards 2025
Rajitha Chanti
|

Updated on: Sep 06, 2025 | 11:50 AM

Share

దుబాయ్ వేదికగా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (Siima ) వేడుక ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. మొదటి రోజు తెలుగు, కన్నడ చిత్రాల్లో అత్యంత ఎక్కువ ప్రతిభ కనబర్చిన నటీనటులు అవార్డ్స్ సొంతం చేసుకున్నారు. అలాగే చిత్రాలకు, చిత్రబృందాలకు సైతం అవార్డులను అందించారు. సైన్స్ ఫిక్షన్ మూవీగా అడియన్స్ ముందుకు వచ్చి మరో లోకంలోకి తీసుకెళ్లిన కల్కి 2898 ఏడీ సినిమా ఉత్తమ చిత్రంగా సైమా అవార్డ్ గెలుచుకుంది. అలాగే ఈ వేడుకలలో పుష్ప 2 మూవీ సత్తా చాటింది.

ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu: బిగ్‏బాస్ సీజన్ 9లోకి ప్రభాస్ హీరోయిన్.. సెన్సేషనల్ ఫోక్ సింగర్.. ఫుల్ లిస్ట్ ఇదే..

13వ సైమా వేడుకలలో తెలుగులో పుష్ప 2, కల్కి సినిమాలు ఎక్కువ అవార్డ్స్ సొంతం చేసుకున్నాయి. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ నటిగా రష్మిక అవార్డ్స్ అందుకున్నారు. ఇక ఉత్తమ దర్శకుడిగా సుకుమార్, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ నిలిచారు.

ఇవి కూడా చదవండి

సైమా 2025 అవార్డుల విజేతలు వీళ్లే..

  • ఉత్తమ చిత్రం: కల్కి 2898 ఏడీ
  • ఉత్తమ నటుడు: అల్లు అర్జున్‌ (పుష్ప2)
  • ఉత్తమ నటి: రష్మిక (పుష్ప2)
  • ఉత్తమ దర్శకుడు: సుకుమార్ (పుష్ప2)
  • ఉత్తమ సహాయ నటి: అన్నా బెన్‌ (కల్కి 2898 ఏడీ)
  • ఉత్తమ హాస్య నటుడు: సత్య (మత్తు వదలరా 2)
  • ఉత్తమ గీత రచయిత: రామజోగయ్య శాస్త్రి (చుట్టమల్లే)
  • ఉత్తమ సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్‌ (పుష్ప2)
  • ఉత్తమ సినిమాటోగ్రఫీ: రత్నవేలు (దేవర)
  • ఉత్తమ విలన్‌: కమల్‌ హాసన్‌ (కల్కి 2898 ఏడీ)
  • ఉత్తమ సహాయ నటుడు: అమితాబ్‌ బచ్చన్‌ (కల్కి 2898 ఏడీ)
  • ఉత్తమ నేపథ్య గాయని: శిల్పారావ్‌ (చుట్టమల్లే)
  • ఉత్తమ పరిచయ నటి: భాగ్యశ్రీ బోర్సే (మిస్టర్‌ బచ్చన్‌)
  • ఉత్తమ నూతన నిర్మాత : నిహారిక కొణిదెల (కమిటీ కుర్రోళ్లు)
  • ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌): తేజ సజ్జా (హనుమాన్‌)
  • ఉత్తమ నటి (క్రిటిక్స్‌): మీనాక్షి చౌదరి (లక్కీ భాస్కర్‌)
  • ఉత్తమ నటుడు (కన్నడ): కిచ్చా సుదీప్‌
  • ఉత్తమ నటి (కన్నడ) : ఆషిక రంగనాథ్‌
  • ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్‌): ప్రశాంత్‌ వర్మ (హనుమాన్‌)
  • ప్రైడ్‌ ఆఫ్‌ తెలుగు సినిమా : అశ్వినీదత్ (వైజయంతీ మూవీస్‌)
  • ఉత్తమ దర్శకుడు (కన్నడ): ఉపేంద్ర (యూఐ)
  • ఉత్తమ చిత్రం (కన్నడ): కృష్ణం ప్రణయ సఖి

ఇవి కూడా చదవండి : Tollywood : అక్కినేని మూడు తరాలతో కలిసి నటించిన ఏకైక హీరోయిన్.. ఏఎన్నార్, నాగార్జున, నాగచైతన్యతో సినిమాలు.. ఎవరంటే..

రూ.500 కోట్లు వచ్చినా సేఫ్ కాదా.. ఇదెక్కడి బిజినెస్
రూ.500 కోట్లు వచ్చినా సేఫ్ కాదా.. ఇదెక్కడి బిజినెస్
తన పెళ్లి పై 12రోజుల తర్వాత మౌనం వీడిన స్మృతి మంధాన
తన పెళ్లి పై 12రోజుల తర్వాత మౌనం వీడిన స్మృతి మంధాన
ఎన్టీఆర్ సినిమాపై మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్..
ఎన్టీఆర్ సినిమాపై మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్..
రాష్ట్రపతి విందుకు రాహుల్‌కు అందని ఆహ్వానం..కాంగ్రెస్ నుంచి ఆయనకు మాత్రమే..
రాష్ట్రపతి విందుకు రాహుల్‌కు అందని ఆహ్వానం..కాంగ్రెస్ నుంచి ఆయనకు మాత్రమే..
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌తో హీరోయిన్లకు తిప్పలు
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌తో హీరోయిన్లకు తిప్పలు
కదలికతోనే కోట్లు కురిపించనున్న రాహు కేతువులు.. మీ రాశి ఉందా?
కదలికతోనే కోట్లు కురిపించనున్న రాహు కేతువులు.. మీ రాశి ఉందా?
8 గంటలు పని చేయడానికి ఇదేమైనా జాబా.. ఇచ్చి పడేసిన రానా
8 గంటలు పని చేయడానికి ఇదేమైనా జాబా.. ఇచ్చి పడేసిన రానా
వారి కాలి స్పర్శ తగిలితే దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయట..
వారి కాలి స్పర్శ తగిలితే దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయట..
రోజూ రాత్రి 2 యాలకులు తింటే.. మీ శరీరానికి సూపర్ పవర్స్..!
రోజూ రాత్రి 2 యాలకులు తింటే.. మీ శరీరానికి సూపర్ పవర్స్..!
ఈ ఫొటోలో దాగి ఉన్న పిల్లిని గుర్తిస్తే.. నిన్ను మించిన తోపుల్లేరు
ఈ ఫొటోలో దాగి ఉన్న పిల్లిని గుర్తిస్తే.. నిన్ను మించిన తోపుల్లేరు