Pawan Kalyan: ఉపాధ్యాయ దినోత్సవం వేళ.. పిఠాపురం టీజర్లకు పవన్ బిగ్ సర్‌ప్రైజ్
భారతరత్న మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి టీచర్స్ డేగా జరుపుకుంటాం. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇక ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురష్కరించుకుని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కి నివాళులు అర్పించారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ తన నియోజక వర్గం పిఠాపురంలో ఉన్న సుమారు 2,000 మంది ఉపాధ్యాయులకు స్పెషల్ గిఫ్ట్స్ ని పంపించారు.
టీచర్స్ కు దుస్తులను ఆయా స్కూల్ స్టూడెంట్స్ ద్వారా బహుమతులుగా ఇప్పించారు. చదువు చెప్పే గురువులను గౌరవించారు. తమకు ఉపాధ్యాయ దినోత్సవం రోజున బహుమతి ఇవ్వడం.. అసలు ఊహకందని విషయం అని.. తమ ఇన్ని ఏళ్ల సర్వీస్ లో ఇలాంటి బహుమతిని ఎప్పుడూ అందుకోలేదని ఉపాధ్యాయులు ఆనందంతో చెబుతున్నారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి, సన్మార్గంలో నడిపించే ఉపాధ్యాయులను పలు విధాలుగా ఇబ్బందులకు గురిచేసిన నాయకులను చూసాం.. అయితే మొదటి సారి టీచర్స్ కి నిజమైన గౌరవం చూపిస్తూ ప్రోత్సహిస్తూ కానుకలను పంపిన నాయకుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని చెబుతున్నారు పిఠాపురంలోని టీచర్లు. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోని సుమారు 2000 మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉపాధ్యాయులకు చీరలు, ప్యాంట్ షర్ట్ లను కానుకగా పంపించారు. ఆ బట్టలను టీచర్స్ కు స్టూడెంట్స్ చేతుల మీదుగా అందజేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నెలకు రూ.5.90 లక్షలు ఖర్చు చేసిన జంట.. నెటిజన్లు షాక్
కైలాసగిరి హిల్‌టాప్ పార్క్‌లో స్కైవాక్ గ్లాస్ బ్రిడ్జ్ రెడీ
అద్దెకు అమ్మమ్మ, తాతయ్యలు !! కాన్సెప్ట్ ఏంటీ
యూరియా కొరత.. అదుపు తప్పుతున్న రైతుల ఆగ్రహం
వైరల్ ఫీవర్స్‌తో పాటు, డెంగ్యూ కేసులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

