నెలకు రూ.5.90 లక్షలు ఖర్చు చేసిన జంట.. నెటిజన్లు షాక్
సాధారణంగా ఒక భార్యాభర్తల జంట.. ఒక నగరంలో జీవించాలంటే నెలకు రూ.30 వేల నుంచి రూ.50 వేలు ఖర్చు అవుతుంది. అదే వారు బెంగళూరు లాంటి మెట్రో సిటీలో బతకాలంటే ఇంకో రూ.10 వేల నుంచి రూ.20 వేలు అదనంగా అవసరం అవుతాయి. అయితే.. ఇప్పుడు చెప్పబోయే జంట మాత్రం.. ఒకే నెలలో లక్షల రూపాయలు ఖర్చు చేసింది.
ఆ విషయాన్ని స్వయంగా ఆ భార్యాభర్తలే వెల్లడించారు. నెల రోజుల్లో తాము దేనికి ఎంత ఖర్చు చేశామో చెబుతూ.. ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. మొత్తంగా ఒక నెల రోజుల్లో ఏకంగా రూ.5.90 లక్షలు ఖర్చు పెట్టినట్లు స్పష్టం చేశారు. బెంగళూరులో నివసించే ఆ జంట.. ఆగస్ట్ నెలలో తాము ఖర్చు చేసిన వివరాలకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడు ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది. ప్రకృతి అరోరా, ఆశిష్ అనే జంట కలిసి మొత్తం నెల రోజుల్లో రూ. 5.90 లక్షలు ఖర్చు చేసినట్లు చెప్పడంతో నెటిజన్లు ఆశ్చర్యంలో మునిగిపోతున్నారు. వీరిద్దరూ.. ‘ ట్రావెల్ కపుల్ ‘ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో తమ ఒక అకౌంట్‌ను మెయింటైన్ చేస్తున్నారు. వారు తమ లైఫ్ స్టైల్, టూర్ల విశేషాలు, అనుభవాలను.. ఎప్పటికప్పుడు ఆ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో అప్‌డేట్లు చేస్తూనే ఉంటారు. అయితే ఆగస్ట్ నెలలో ఈ రూ.5.90 లక్షలను ఎలాంటి వాటికి ఖర్చు చేశాం అనే పూర్తి వివరాలను ఆ జంట వీడియోలో వివరించారు. వీళ్లిద్దరూ ట్రావెల్, లైఫ్ స్టైల్‌కు సంబంధించిన వీడియోలు చేస్తూ.. కంటెంట్ క్రియేటర్లుగా పనిచేస్తున్నారు. ఈ జంటకు ఇన్‌స్టాగ్రామ్‌లో 3.78 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. తమకు మానసికంగా, ఆర్థికంగా కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ.. ఆగస్ట్ నెలలో రూ.5.90 లక్షలు ఖర్చు చేసినట్లు ఆ జంట వీడియోలో తెలిపింది. వాటన్నింటి గురించి మాట్లాడుకుని.. సరైనా ప్రణాళికలు వేసుకుంటున్నామని.. ఇది ఏ జంట అయినా చేయగలదని తెలిపారు. ఇందులో సగాని కంటే ఎక్కువ ఖర్చులు.. ట్రావెలింగ్‌కే అయినట్లు చెప్పారు. ఇక ఈ బెంగళూరు కపుల్ నెలవారీ ఖర్చుల వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. వారి నెల వారీ ఖర్చు తాము ఒక సంవత్సరం మొత్తం సంపాందించిన ఆదాయానికి సమానమని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ఇక లండన్ కంటే బెంగళూరు నగరమే చాలా కాస్ట్‌లీ అనిపిస్తోందని మరో నెటిజన్ సెటైరికల్ కామెంట్ చేశారు. ఆ జంట వీడియో వైరల్ కావడంతో . ప్రస్తుత కాలంలో ఉన్న యువత లైఫ్ స్టైల్, ఖర్చులు, ఆర్థిక నిర్వహణపై సరికొత్త చర్చను లేవనెత్తింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కైలాసగిరి హిల్‌టాప్ పార్క్‌లో స్కైవాక్ గ్లాస్ బ్రిడ్జ్ రెడీ
అద్దెకు అమ్మమ్మ, తాతయ్యలు !! కాన్సెప్ట్ ఏంటీ
యూరియా కొరత.. అదుపు తప్పుతున్న రైతుల ఆగ్రహం
వైరల్ ఫీవర్స్‌తో పాటు, డెంగ్యూ కేసులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

