AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heavy Floods: ఉత్తరాదిని వణికిస్తున్న వరుణుడు

Heavy Floods: ఉత్తరాదిని వణికిస్తున్న వరుణుడు

Phani CH
|

Updated on: Sep 05, 2025 | 8:05 PM

Share

ఉత్తర భారతం వరద గుప్పిట్లో చిక్కుకుంది. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పలు రాష్ట్రాలలో వరద బీభత్సం కొనసాగుతోంది. కొండప్రాంతాలలో పలు చోట్ల కొండచరియలు విరిగి పడటంతో ఎక్కడికక్కడ రాకపోకలు స్థంభించాయి. పంజాబ్‌ , హిమాచల్‌, జమ్ముకశ్మీర్‌తో పాటు ఢిల్లీలో కూడా వరదలతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.

ఢిల్లీలో ప్రమాదస్థాయి కంటే రెండు మీటర్ల ఎత్తులో యమునా నది ప్రవహించటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అటు.. జమ్ముకశ్మీర్‌లో కురుస్తున్న భారీవర్షాలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చీనాబ్‌కు పోటెత్తిన వరదలతో రాంబన్‌ బాగ్లిహార్‌ హైడ్రో ఎలక్ట్రిక్‌ పవర్‌ ప్రాజెక్టు ఐదు గేట్లు తెరిచి నీటిని వదిలేస్తున్నారు. వాయువ్య రాష్ట్రమైన పంజాబ్‌ వరదలతో అల్లాడుతోంది. వరదల ధాటికి ఇప్పటివరకు 37 మంది చనిపోయారు. మూడున్నల లక్షల మంది నిరాశ్రయులయ్యారు. నాలుగు లక్షల ఎకరాల్లో పంట వరదపాలైంది. వరదల కారణంగా ఈనెల ఏడువరకు స్కూళ్లకు సెలవులిచ్చారు. ఫిరోజ్‌పూర్‌లో చెరువులు తెగకుండా ఇసుకబస్తాలు అడ్డుగా వేశారు. ఇక..మధ్యప్రదేశ్‌ను సైతం వరుణుడు వణికిస్తూనే ఉన్నాడు. ఉజ్జయినిలో కురిసిన భారీవర్షానికి రోడ్లు నదులను తలపించాయి. పట్టణ రోడ్లపై నడుముల్లోతు వరదతో జనజీవనం స్తంభించిపోయింది. ఇంటినుంచి కాలు బయటపెట్టే పరిస్థితి లేకపోవటంతో విద్యాసంస్థలు, కార్యాలయాలు, వ్యాపార సముదాయాలు, వీధి అంగళ్లన్నీ బంద్ అయ్యాయి. క్షిప్రానది ఉధృతితో ఉజ్జయినిలోని నదిఘాట్లు, ఆలయాలు నీటమునిగాయి. మరోవైపు, హిమాచల్‌ ప్రదేశ్‌ కులూలో భారీవర్షాలకు కొండచరియలు విరిగిపడి రెండు ఇళ్లు ధ్వంసమయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్నవారి కోసం రెస్క్యూ కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో కొండచరియల ధాటికి రహదారులను మూసేశారు. దేశరాజధాని ఢిల్లీ శివార్లలోని పలు కాలనీలు నీట మునిగాయి. యమునా బజార్‌ నీట మునిగింది. అధికారులు 12 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద బాధితుల కోసం 25 రిలీఫ్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. యమునా ఓల్డ్‌ రైల్వే బ్రిడ్జ్‌పై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేఖా గుప్తా పర్యటించారు. మరోవైపు ఉత్తరాది రాష్ట్రాల్లో వరదల కారణంగా ప్రాణనష్టం, ఆస్తినష్టంపై సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. వరద బాధితులను అన్నివిధాలా ఆదుకోవాలని సూచించింది. ముఖ్యంగా హిమాచల్‌ ప్రదేశ్‌లో చెట్ల నరికివేతతో వరద ఉధృతి పెరిగిందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్.గవాయ్‌ వ్యాఖ్యానించారు. వరదలపై రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నొటీసులు జారీ చేసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

స్కూలుపై దావా వేసిన దొంగ.. నెలకి లక్షన్నర కట్టాలన్న కోర్టు

Ghaati: ఘాటీతో.. క్రిష్, అనుష్క గట్టెక్కుతారా? హిట్టా..? ఫట్టా..?

కపిల్ కామెడీ షో నుంచి ఆ నటుడు ఔట్.. ఫ్యాన్స్ నిరాశ

టీచర్స్ డే.. బడిలో ఏంటి మాస్టారూ ఈ పని

Balakrishna: నీ బిడ్డ పెళ్లికి వస్తాను.. ఎట్లా వస్తా.. ఏంటనేది చెప్పను!