స్కూలుపై దావా వేసిన దొంగ.. నెలకి లక్షన్నర కట్టాలన్న కోర్టు
సాధారణంగా చోరీలకు పాల్పడిన దొంగలకు కోర్టులు జైలుశిక్షలు వేస్తుంటాయి. అయితే.. అమెరికాలో జరిగిన ఈ చోరీ ఘటనలో దొంగకు నష్టపరిహారం ఇవ్వాలని అక్కడి కోర్టు తీర్పునివ్వటం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఓ స్కూల్లో దొంగతనానికి వెళ్లిన ఆ యువకుడు.. ప్రమాదవశాత్తూ స్కూలు పై కప్పు నుంచి జారి పడిన కేసులో కోర్టు ఈ తీర్పునివ్వటం విశేషం.
1982లో రిక్ బోడిన్ అనే 18 ఏళ్ల రిక్ అనే యువకుడు కాలిఫోర్నియాలోని ఓ స్కూల్లోకి చొరబడి సీలింగ్ కు ఉన్న కొన్ని లైట్లను దొంగిలించాడు. అయితే..స్కూలు భవనంపైన అటూ ఇటూ తిరిగే క్రమంలో అతడు.. పొరపాటున జారి.. సుమారు 27 అడుగుల ఎత్తునుంచి కింద పడిపడి గాయాల పాలయ్యారు. మామూలుగా ఇలాంటి సందర్భాల్లో.. దొంగతనానికి వెళ్లిన ఎవడైనా.. తేలు కుట్టిన దొంగలా చుప్‌చాప్‌గా ట్రీట్‌మెంట్ చేయించుకొని ఇంట్లో కూర్చుంటారు. కానీ, రిక్ స్టయిలే వేరు. మనోడు ఏకంగా సదరు స్కూలు మీద దావా వేశాడు. పెయింట్ చేయబడిన స్కై లైట్ కారణంగానే తాను స్కూలు భవనం పైనుంచి కిందపడిపోయానని ఆ పిటిషన్‌లో చెప్పుకొచ్చాడు. గతంలో పెయింట్ వేసిన స్కైలైట్ మీద నుంచి పడి చనిపోయిన ఓ విద్యార్థి వివరాలను తన పిటిషన్‌లో ప్రస్తావించిన రిక్, ఆ కేసులో బాధితుడికి కోర్టు రూ. 1.77 కోట్లు నష్టపరిహారం ఇచ్చిందని గుర్తు చేశాడు. ..‘ఎంతో మంది పిల్లలు చదువుకునే స్కూలు పైకప్పు విషయంలో ఆ స్కూలు యాజమాన్యానికి ఎంత నిర్లక్ష్యమో’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తనకు కూడా స్కూలు యాజమాన్యం నుంచి నష్టపరిహారం ఇప్పించాలని రిక్ కోర్టును కోరారు.. కాగా, కేసు విచారించిన న్యాయస్థానం రిక్ వాదనను పరిగణనలోకి తీసుకుంది. అతడు దొంగతనానికి వచ్చిన మాట నిజమేనంటూనే.. ఈ విషయంలో స్కూలు యాజమాన్యం నిర్లక్ష్యాన్ని క్షమించలేమని కోర్టు వ్యాఖ్యానించింది. గాయాల పాలైన రిక్‌కు నెలకు లక్షన్నర చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశించింది. పాఠశాలల యజమాన్యాలు తమ భవనాలను సురక్షితంగా ఉంచుకోవాలని సూచించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ghaati: ఘాటీతో.. క్రిష్, అనుష్క గట్టెక్కుతారా? హిట్టా..? ఫట్టా..?
కపిల్ కామెడీ షో నుంచి ఆ నటుడు ఔట్.. ఫ్యాన్స్ నిరాశ
టీచర్స్ డే.. బడిలో ఏంటి మాస్టారూ ఈ పని
Balakrishna: నీ బిడ్డ పెళ్లికి వస్తాను.. ఎట్లా వస్తా.. ఏంటనేది చెప్పను!
New GST Rules: సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ 2.0.. ఇవన్నీ చవకే
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్

