AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New GST Rules: సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ 2.0.. ఇవన్నీ చవకే

New GST Rules: సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ 2.0.. ఇవన్నీ చవకే

Phani CH
|

Updated on: Sep 05, 2025 | 7:05 PM

Share

దేశంలోని పరోక్ష పన్నుల విధానంలో జీఎస్టీ కౌన్సిల్ పెను మార్పులకు శ్రీకారం చుట్టింది. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట కల్పిస్తూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఉన్న బహుళ పన్ను శ్లాబుల స్థానంలో రెండు శ్లాబుల విధానాన్ని ఆమోదించింది. ఈ కొత్త విధానం సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానుంది.

ఈ మార్పుల ఫలితంగా పాలు, పప్పుల నుంచి దుస్తులు, చెప్పుల వరకు అనేక నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. ప్రస్తుతం 12 శాతం, 28 శాతం పన్ను శ్లాబులలో ఉన్న అనేక వస్తువులను కొత్తగా ప్రతిపాదించిన 5 లేదా 18 శాతం శ్లాబుల్లోకి మార్చడంతో వినియోగదారులపై భారం తగ్గనుంది. ఈ నిర్ణయంతో ప్రజలు రోజూ వినియోగించే కిరాణా సరుకులు, వ్యవసాయ ఉత్పత్తులు, దుస్తులు వంటి ఎన్నో వస్తువులు చౌకగా లభించనున్నాయి. పాల ప్యాకెట్లపై ఇప్పుడున్న 5 శాతం పన్ను ఇక ఉండదు. కాగా, కండెన్స్‌డ్ మిల్క్, వెన్న, నెయ్యి, పనీర్, చీజ్ వంటివి 12 శాతం నుంచి 5 శాతం శ్లాబులోకి రానున్నాయి. పాస్తా, కార్న్‌ఫ్లేక్స్, బిస్కెట్లు, చాక్లెట్లు, డ్రై ఫ్రూట్స్ , శుద్ధి చేసిన చక్కెర, మిఠాయిలు, కూరగాయల నూనెలు, నమ్కీన్, భుజియా వంటి ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలపై పన్ను 5 శాతానికి తగ్గనుంది. మినరల్ వాటర్, ఏరేటెడ్ వాటర్ కూడా 18 శాతం నుంచి 5 శాతానికి మారనున్నాయి. అలాగే రైతాంగానికి ఊరటనిస్తూ ఎరువులను 5 శాతం జీఎస్టీ కేటగిరీకి మార్చారు. విత్తనాలు, పంట పోషకాలపైనా పన్నును 12 శాతం నుంచి 5 శాతానికి హేతుబద్ధీకరించారు. మందులు, కొన్ని వైద్య పరికరాలపై పన్నును 12/18 శాతం నుంచి 5 శాతానికి మార్చగా, మరికొన్నింటిపై పన్ను రద్దుచేశారు. చెప్పులు, దుస్తులపై పన్ను 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గనుంది. టీవీ, తదితర ఎలక్ట్రికల్ ఉపకరణాలపైనా పన్నును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. సామాన్యులకు ఊరట కల్పిస్తూనే, విలాసవంతమైన, హానికరమైన వస్తువులపై జీఎస్టీ కౌన్సిల్ కఠినంగా వ్యవహరించింది. పాన్ మసాలా, గుట్కా, సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులపై ప్రస్తుతం ఉన్న అధిక జీఎస్టీ రేట్లు, పరిహార సెస్సులు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఈ ఉత్పత్తుల విలువను ఇకపై లావాదేవీల విలువకు బదులుగా రిటైల్ అమ్మకం ధర (RSP) ఆధారంగా లెక్కిస్తారు. దీనివల్ల పన్ను ఎగవేతకు అడ్డుకట్ట పడుతుంది. ముఖ్యంగా, చక్కెర లేదా ఇతర తీపి పదార్థాలు కలిపిన అన్ని రకాల శీతల పానీయాలపై పన్నును భారీగా పెంచారు. ప్రస్తుతం 28 శాతంగా ఉన్న పన్నును ఏకంగా 40 శాతానికి పెంచుతూ కొత్త శ్లాబును ప్రవేశపెట్టారు. విలాసవంతమైన వస్తువులైన ఖరీదైన కార్లు, ప్రీమియం మద్యం వంటివి కూడా ఈ 40 శాతం పన్ను పరిధిలోకి వస్తాయి. ఈ నిర్ణయాలతో సామాన్యులకు ఉపశమనం కలిగిస్తూనే, హానికరమైన ఉత్పత్తుల వాడకాన్ని నిరుత్సాహపరచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హుస్సేన్ సాగర్‌లో ఖైరతాబాద్ బడా గణేశ్‌ నిమజ్జనం ఏర్పాట్లు షురూ

Little Hearts Review: నిబ్బా..నిబ్బి..లవ్ స్టోరీ.. హిట్టా..? ఫట్టా..?

హైదరాబాద్‌లో ఇంటి అద్దెలకు రెక్కలు

డ్వాక్రా మహిళలకు గుడ్‌ న్యూస్‌.. ఇక దశ తిరిగినట్లే

Gold Price: బంగారం ధర మరింత పైపైకి.. తులం ఎంతంటే