AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Little Hearts Review: నిబ్బా..నిబ్బి..లవ్ స్టోరీ.. హిట్టా..? ఫట్టా..?

Little Hearts Review: నిబ్బా..నిబ్బి..లవ్ స్టోరీ.. హిట్టా..? ఫట్టా..?

Phani CH
|

Updated on: Sep 05, 2025 | 5:05 PM

Share

90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు ఆదిత్య హసన్. ఈయన నిర్మాతగా మారి చేసిన సినిమా లిటిల్ హార్ట్స్. యూట్యూబర్ మౌళి ఇందులో హీరోగా నటించాడు. ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూసి చూద్దాం.. ఇక లిటిల్ హార్ట్స్ మూవీ కథలోకి వెళితే.. ఇంజనీరింగ్‌ ఎంట్రన్స్ లో ఫెయిల్‌ అయిన అఖిల్‌ అలియాస్ మౌళి బీటెక్ సీట్ కోసం లాంగ్ టర్మ్ కోచింగ్ సెంటర్‌లో చేరుతాడు.

అక్కడ కాత్యాయని అలియాస్ శివాని నాగారంను కలుస్తాడు. ఆమెను చూడగానే ప్రేమలో పడతాడు. ఐ లవ్ యు చెప్పిన తర్వాత కాత్యాయని చెప్పిన విషయం అఖిల్ ను డైలమాలో పడేస్తుంది. అక్కడినుంచి అతని ప్రేమకథ మలుపులు తిరుగుతుంది. మరోవైపు కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాడు అని కలలు కంటుంటాడు గోపాలరావు అలియాస్ రాజీవ్ కనకాల. ఇక మొదట అఖిల్ ప్రేమను తిరస్కరించినా కూడా.. తర్వాత ఓకే చెప్తుంది కాత్యాయని. వాళ్ళిద్దరూ ఒకటయ్యారా లేదా? పెళ్లి చేసుకున్నారా లేదా? అనేది వీళ్లద్దరి లిటిల్ హార్ట్స్ కథ.. నో కథ.. నో కాకరకాయ్.. ఓన్లీ ఎంజాయ్. ప్యూర్ నిబ్బా నిబ్బి లవ్ స్టోరీ ఎలా ఉంటుంది అని అడిగితే.. లిటిల్ హార్ట్స్ సినిమా చూపిస్తే సరిపోతుంది. చూస్తున్నంత సేపు నవ్వుకుంటే చాలు అన్నట్టు ఈ సినిమా తెరకెక్కించాడు దర్శకుడు సాయి మార్తాండ్. ఎక్కడా సీరియస్ నెస్ ఉండదు.. ఓన్లీ ఎంటర్టైన్మెంట్.. డైలాగ్స్ మీద వెళ్ళిపోతుంది సినిమా. ఎపిసోడ్స్ వైజ్ గా కథ రాసుకున్నాడు దర్శకుడు సాయి. అందులోనే కావాల్సినంత కామెడీ జనరేట్ చేశాడు.. కొన్ని హిలేరియస్ సీక్వెన్స్ లు ఉన్నాయి సినిమాలో..!. మరీ ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే ఓ పాట ఎపిసోడ్ అందర్నీ నవ్వించి చంపేస్తుంది.మౌళి అండ్ గ్యాంగ్ చేసిన అల్లరి బాగుంది. లవ్ ట్రాక్ కూడా ఆకట్టుకుంటుంది..! 2 గంటలు ఫాస్ట్ గా వెళ్ళిపోయింది. రాజీవ్ కనకాల, మౌళి మధ్య వచ్చే సన్నివేశాలు చాలా బాగున్నాయి. అలాగే SS కాంచి సీన్స్ కూడా ఆకట్టుకుంటాయి. ఫ్యామిలీ మొత్తం చూడగలిగే సన్నివేశాలు ఉండడం ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్. మౌళి బాగున్నాడు.. బాగా చేశాడు కూడా…! మనోడు కామెడీ టైమింగ్ బాగుంది. కాకపోతే ఒకటే ఎక్స్ప్రెషన్ రిపీట్ చేసినట్టు ఉంటుంది. శివాని నగరం పర్లేదు.. బానే చేసింది. హీరో ప్రెండ్ క్యారెక్టర్ అదిరిపోయింది.. మనోడి పంచులు నెక్స్ట్ లెవెల్. రాజీవ్ కనకాల కూడా చాలా బాగా నటించాడు. అనిత చౌదరి పర్లేదు. మిగిలిన వాళ్ళందరూ ఓకే.. సింజిత్ అందించిన సంగీతం చాలా ఫ్రెష్ గా ఉంది. పాటలు కూడా బాగానే ఉన్నాయి. సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు తగ్గట్టుగా ఉంది. డైరెక్టర్ సాయి మార్తాండ్ తను అనుకున్న ఎంటర్ టైన్మెంట్ అందించాడు. బన్నీ వాస్, వంశీ నందిపాటి ఈ సినిమాకు మంచి రిలీజ్ ఇచ్చారు. ఇక ఓవరాల్ గా లిటిల్ హార్ట్స్ గురించి చెప్పాలంటే… ! నో లాజిక్స్‌! నిబ్బా నిబ్బి లవ్ స్టోరీ చూసి.. జస్ట్ ఎంజాయ్ చేయాలంతే!

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హైదరాబాద్‌లో ఇంటి అద్దెలకు రెక్కలు

డ్వాక్రా మహిళలకు గుడ్‌ న్యూస్‌.. ఇక దశ తిరిగినట్లే

Gold Price: బంగారం ధర మరింత పైపైకి.. తులం ఎంతంటే