Gold Price: బంగారం ధర మరింత పైపైకి.. తులం ఎంతంటే
పసిడి పరుగులు పెడుతోంది. దేశీయంగా బంగారం ధర ఆల్‌టైమ్ గరిష్టానికి చేరింది. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత పెరగవచ్చంటున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 4న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,06,980కి చేరింది.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ. 98, 060కి చేరింది. దేశంలోని పలు నగరాల్లో బంగారం ధర ఎలా ఉందో తెలుసుకుందాం. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,000 పెరిగి కొత్త రికార్డు సృష్టించింది. ప్రస్తుతం తులం ధర రూ. 1,07,070 కు చేరుకుంది. ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,06,980లు, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98,060లుగా ఉంది. కిలో వెండిధర రూ.1,27,100 పలుకుతోంది. రానున్న రోజులలో కూడా బంగారం ధరలు తగ్గే అవకాశాలు లేవని నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ సుంకం కారణంగా పెట్టుబడిదారులలో అనిశ్చితి వాతావరణం ఏర్పడింది. దీని కారణంగా వారు సురక్షితమైన మార్గాన్ని కోరుకుంటున్నారు. మరోవైపు ఫెడ్ కూడా వడ్డీ రేట్లను తగ్గించాలని పరిశీలిస్తోంది. బంగారం ధరలు పెరగడానికి ఇది కూడా ఒక కారణం అని చెబుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పులసలు దొరికాయోచ్.. పండగ చేసుకున్న పులస ప్రియులు
జాలరి వలలో మిల మిల మెరిసే వయ్యారి వెండిచేప..
సామాన్యులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న నిత్యావసరాల ధరలు
మేడ్ ఇన్ ఇండియా సెమీ కండక్టర్ వచ్చేసింది తొలి చిప్ ప్రాసెసర్ ఆవిష్కరణ
ఆటోడ్రైవర్‌తో మహిళల ఫైట్.. నడిరోడ్డుపై జుట్టుపట్టి వీరంగం
పొలానికి వెళ్లిన రైతు.. దూరంగా కనిపించినది చూసి హడలిపోయి..
విషపూరిత పాములను చంపేందుకు తెచ్చిన ముంగీసల కథ..
ఇక ఇంటర్నెట్ లేకపోయినా ఫోన్లోనే లైవ్ టీవీ చూడొచ్చు!
ఏనుగునైనా చంపే కింగ్ కోబ్రా.. తన పిల్లల కోసం ఏం చేసిందో తెలుసా
మొక్కలకు నీళ్లు పోస్తున్న వ్యక్తి.. వెనుక ఏదో అలికిడి.. చూడగా
సినిమాకి వెళ్తే 22 నిమిషాలు యాడ్స్ వేస్తారా..?

