పులసలు దొరికాయోచ్.. పండగ చేసుకున్న పులస ప్రియులు
పుస్తెలమ్మైనా పులస తినాల్సిందే.. ఇది గోదావరి ప్రజల నానుడి. ఎందుకంటే .. పుసలకుండే ప్రాధాన్యత అలాంటిది. అదికూడా వర్షాలు వరదల సమయంలోనే చిక్కే ఈ అరుదైన చేపలు రుచిలో వీటికి సాటి మరొకటి ఉండదు. సముద్రంలో ఇలసగా పెరిగే చేప.. గోదావరి నీరు తాకగానే రంగు, రుచికూడా మారిపోతుంది. సముద్రంనుంచి సంతానోత్పత్తి కోసం గోదావరిని ఎదురీదుతూ నదిలోకి వస్తుంది.
ఈ క్రమంలో మత్స్యకారుల వలకు చిక్కుతుంది. రుచిలో రారాజైన ఈ చేపను కొనేందుకు పులస ప్రియులు పోటీపడతారు. అందుకే వేలంలో చిన్న చేపలు కూడా అత్యంత ధర పలుకుతాయి. పులస దక్కింది అంటే అటు వినియోగదారుడికి, ఇటు మత్స్యకారుడికీ కూడా పండగే. తాజాగా తూర్పుగోదావరి జిల్లా యానాంలోని వశిష్ట గోదావరిలో రెండు పులస చేపలు చిక్కాయి. ఒక్కొక్కటీ కేజీన్నర బరువున్న చేపలు దొరకడంతో మత్సకారులు ఆనందలో మునిగిపోయారు. వేలంలో ఆ చేపలు రికార్డు ధరకు అమ్ముడు పోయాయి. వేలం పాటలో 1.5 కేజీల పులస 29,000 వేలు, 1.4 కేజీల పులస 28,000 రికార్డ్ ధర పలికాయి. గోదావరిలో వరదలు వచ్చినా పులసలు మాత్రం దొరకడంలేదు. దీంతో ఎంతో ఆశతో వేటకు వెళ్తున్న మత్స్యాకారులకు నిరాశే మిగులుతోంది. ఈ క్రమంలో తాజాగా రెండు పులసలు దొరకడంతో ఆనందం వ్యక్తం చేసారు. కాలుష్యం వల్ల పులసలు గుడ్లు పెట్టలేకపోతున్నాయి. దీంతో పులసల సంఖ్య తగ్గింది అంటున్నారు. ఈ క్రమంలో అధికారులు పులసలను కాపాడాలని మత్స్యకారులకు అవగాహన కల్పిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జాలరి వలలో మిల మిల మెరిసే వయ్యారి వెండిచేప..
సామాన్యులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న నిత్యావసరాల ధరలు
మేడ్ ఇన్ ఇండియా సెమీ కండక్టర్ వచ్చేసింది తొలి చిప్ ప్రాసెసర్ ఆవిష్కరణ
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

