గొర్రెల కోసం వచ్చి.. రూ.13 లక్షల గోల్డ్ కొట్టేశారు
దొంగలు పలు రకాలు. కొందరు ఇళ్లలో చొరబడి విలువైన వస్తువులు, డబ్బు, నగలు ఎత్తుకెళ్తే..మరికొందరు ఇంటి బయట కట్టేసిన పశువులు, కోళ్లు కాజేస్తుంటారు. చోరీకి వచ్చి.. ఆ ఇంట్లోనే మందుకొట్టి, వంటచేసుకొని తిని, అక్కడే నిద్రపోయిన ఘటనలూ మనం చూశాం. అయితే, పక్కాగా రెక్కీ చేసి.. పల్లెటూళ్లలో అందరూ పొలాలు పోయాక.. ఒంటరిగా ఉన్న వృద్ధులను టార్గెట్ చేసి, నగలు దోచుకుపోతున్న ఇద్దరు దొంగలను పిడుగురాళ్ళ పోలీసులు అరెస్ట్ చేశారు.
వివరాలు ప్రకారం.. పిడుగురాళ్లకు చెందిన కుంచపు దుర్గా ప్రసాద్, ఎలీశా గుంటూరులోనే నివాసం ఉంటున్నారు. రాత్రి వేళల్లో ఇంటి ముందు కట్టేసిన గేదెలు, పొట్టేళ్లు, గొర్రెలు, ద్విచక్ర వాహానాలను దొంగిలించటమే వీరి పని. ఎప్పటిలాగే ఆగస్టు 28న వీరిద్దరూ గుంటూరు జిల్లా కొల్లిపర మండలం అత్తోట గ్రామంలో గొర్రెల చోరీ చేయాలనే ఉద్దేశంతో రెక్కీ నిర్వహించారు. ఈ క్రమంలోనే బుల్లెమ్మ అనే వృద్ధురాలు ఒక ఇంట్లో ఒంటరిగా ఉన్నట్లు గుర్తించారు. ఆమె ఒంటిపై ఉన్న నగలను కాజేయాలని ప్లాన్ వేసిన దొంగలు.. రాడ్ తీసుకుని బుల్లెమ్మ ఇంట్లోకి చొరబడ్డారు. ఆమెపై దాడి చేసి ఆమె ఒంటిపై ఉన్న 13 లక్షల విలువైన బంగారు గొలుసులు, గాజులు తీసుకుని పరారయ్యారు. ఆ దొంగ సొత్తును దుర్గా ప్రసాద్ తన భార్య ప్రియాంకకు ఇచ్చాడు. ఆమె వాటిలో కొన్ని ఆభరణాలను విక్రయించగా మరికొన్ని ఆభరణాలను దాచిపెట్టింది. వృద్ధురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో సీసీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎలీశా, దుర్గాప్రసాద్ దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, ఎలీశా, దుర్గా ప్రసాద్ మీద 21 కేసులున్నాయని పోలీసులు తెలిపారు. ఒంటరి వృద్ధులు బంగారు ఆభరణాలు ధరించినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ సూచించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పులసలు దొరికాయోచ్.. పండగ చేసుకున్న పులస ప్రియులు
జాలరి వలలో మిల మిల మెరిసే వయ్యారి వెండిచేప..
సామాన్యులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న నిత్యావసరాల ధరలు
మేడ్ ఇన్ ఇండియా సెమీ కండక్టర్ వచ్చేసింది తొలి చిప్ ప్రాసెసర్ ఆవిష్కరణ
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

