AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సామాన్యులకు గుడ్‌ న్యూస్‌.. భారీగా తగ్గనున్న నిత్యావసరాల ధరలు

సామాన్యులకు గుడ్‌ న్యూస్‌.. భారీగా తగ్గనున్న నిత్యావసరాల ధరలు

Phani CH
|

Updated on: Sep 04, 2025 | 8:21 PM

Share

దేశ ప్రజలకు దీపావళి పండుగ ఆనందాన్ని రెట్టింపు చేస్తామని ఇటీవల ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో సెప్టెంబరు 3న కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ అధ్యక్షతన జీఎస్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ తెలంగాణతోపాటు అన్ని రాష్ట్రాల ఆర్ధిక మంత్రుల పాల్గొన్నారు. ఢిల్లీలోని సుష్మాస్వరాజ్‌ భవన్‌లో ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభమైంది.

ఈ సమావేశంలో జీఎస్టీ రేట్ల మార్పులపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం 5, 12, 18, 28 శాతంగా ఉన్న జీఎస్‌టీ విధానం స్థానంలో.. కేవలం 5, 18 శాతం పన్ను శ్లాబ్‌లను మాత్రమే ఉంచాలన్న ప్రతిపాదన ఉంది. ఆరోగ్య, లైఫ్ ఇన్సూరెన్స్ రంగంలో జీఎస్టీ రేట్ల తగ్గింపు, వినియోగదారులకు ఊరట కలిగించనున్నట్లుగా తెలుస్తోంది. చిరు వ్యాపారాల పర్మిషన్లను సులభతరం చేయనున్నారు. జీఎస్‌టీ సంస్కరణల్లో భాగంగా ఆహార ఉత్పత్తులపై పన్నులు తగ్గిస్తే, వచ్చే మూడునెలల్లో వినియోగం బాగా పెరుగుతుందని బ్రిటానియా ఇండస్ట్రీస్‌ ఎండీ, సీఈఓ వరుణ్‌ బెర్రీ తెలిపారు. రేట్ల కోతల ప్రయోజనాలను వినియోగదారులకు బదలాయిస్తామన్న ఆయన ఆహార వస్తువులను 5% జీఎస్‌టీలోకి తీసుకువస్తే తప్పకుండా వినియోగం పెరుగుతుందని అభిప్రాయ పడ్డారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో రెండో త్రైమాసికంలో వినియోగదారుల గిరాకీ పెరుగుతుందని, జీఎస్టీ రేట్ల హేతుబద్దీకరణతో వినియోగం పెరుగుతుందని, ఆ ప్రయోజనాలను వినియోగదారులకు అందిస్తామని కన్జూమర్‌ కేర్‌ అండ్‌ లైటింగ్‌ ప్రోడక్ట్స్‌ సీఈఓ వినీత్‌ అగర్వాల్‌ అభిప్రాయపడ్డారు. రూ.2,500 కంటే ఎక్కువ విలువ కలిగిన దుస్తులపై 18 శాతం జీఎస్‌టీ విధించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనతో పరిశ్రమ, మధ్యతరగతిపై ప్రతికూల ప్రభావం పడుతుందని క్లోతింగ్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా పేర్కొంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మేడ్‌ ఇన్‌ ఇండియా సెమీ కండక్టర్‌ వచ్చేసింది తొలి చిప్ ప్రాసెసర్‌ ఆవిష్కరణ

కదిలిన ‘స్టార్ ఆఫ్ ది సీస్.. సముద్రంలో తేలుతూ తొలి ప్రయాణం!

బీఆర్ఎస్‌లో కవిత కుంపటి వెనుక రగులుతున్న రాజకీయం

72 ఏళ్ల వయసులో క్లాస్‌రూమ్‌లో సెకండ్‌ ఇన్నింగ్స్‌

ఈ ఐఏఎస్‌కి.. ఫాలోయింగ్‌ ఎక్కువ గురు.. కారణం