AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ఐఏఎస్‌కి.. ఫాలోయింగ్‌ ఎక్కువ గురు.. కారణం

ఈ ఐఏఎస్‌కి.. ఫాలోయింగ్‌ ఎక్కువ గురు.. కారణం

Phani CH
|

Updated on: Sep 04, 2025 | 6:41 PM

Share

ప్రియాంకా గోయెల్‌ ఓ ఐఏఎస్‌ అధికారిణి. ప్రస్తుతం డీఏఎన్‌ఐఏఎస్‌ ఢిల్లీ, అండమాన్, నికోబార్‌ ఐల్యాండ్స్, లక్షద్వీప్, దాద్రానగర్‌ హవేలి, దమన్‌-డయు కేడర్‌లో పనిచేస్తున్నారు. సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల కోసం ఏటా లక్షల్లో పోటీ పడుతుంటారు. శ్రమ, పట్టుదల, ఓపిక... ఇవే ఎవరి విజయానికైనా మూలం అంటారు ప్రియాంక. సివిల్స్‌ కోసం ప్రయత్నించి పాస్ కాలేదని నిరాశ పడే వారికి ఆమె విజయం ఎంతో స్ఫూర్తినిస్తుంది.

ర్యాంక్‌ ఆమెకు తొలిసారి రాలేదు. రెండు మూడవ ప్రయత్నాలలో మిస్ అయ్యాయి. వరుస వైఫల్యాలు ఎదురైనా ఆ సమయంలో ఆమె తనకు తాను ప్రేరణ కల్పించుకున్న విధానం, తన జీవితంలో చిన్న చిన్న ఆనందాలు, ముఖ్యమైన సంఘటనలు అన్నీ ఇన్‌స్టా వేదికగా పంచుకుంటుంటారు. ఆమె పట్టుదలకు మెచ్చి దాదాపు 2.5 లక్షలమంది ఫాలోవర్స్‌గా అనుసరించడమే కాదు… ‘బ్యూటీ విత్‌ బ్రెయిన్‌’ అంటూ పొగుడుతుంటారు కూడా! ప్రియాంక గోయెల్ కాలేజీలో ఉన్నప్పుడే సివిల్స్‌ వైపు వెళ్లాలనుకున్నారు. ఈమెది ఢిల్లీ. బీకాం పూర్తవ్వడం ఆలస్యం సన్నద్ధత ప్రారంభించారు. తొలి ప్రయత్నం… 0.3 మార్కులతో విఫలమైంది. రెండు, మూడుసార్లూ అంతే! ఎంతైనా బాగా చదివే అమ్మాయి కదా! వరుస వైఫల్యాలు ‘నేను చేయగలనా?’ అన్న సందేహాన్నిచ్చాయి. అయితేనేం, ‘ఇంకా అవకాశాలు ఉన్నాయి. మధ్యలో ఆపేయడం కంటే చివరి వరకూ ప్రయత్నిస్తూ వెళ్లడమే మేలు. కనీసం ప్రయత్నించానన్న సంతృప్తి అయినా ఉంటుంది’ అనుకుంటూ ముందుకుసాగారు. ప్రిలిమ్స్‌ దాటితే మెయిన్స్‌లో వెనుదిరగడం, అమ్మ అనారోగ్యం ఇలా అయిదుసార్లు వైఫల్యాలు వెంటాడాయి. అన్నీ తృటిలో తప్పినవే. చివరకు ఆరోసారి అదే చివరి అవకాశం. చదువే లోకంగా గడిపారు. గంటలకొద్దీ చదివారు. చివరకు 2022 యూపీఎస్‌సీ సివిల్స్‌ ఫలితాల్లో ర్యాంకు సాధించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మహిళలకు శుభవార్త.. ప్రతి ఒక్కరికి రూ.10 వేలు..

భూమిపైకి దూసుకొస్తున్న ఏలియన్స్ వ్యోమనౌక? నవంబర్‌లో ఏం జరగబోతుంది?

నటి రన్యారావుకు రూ.102 కోట్ల జరిమానా

బ్యాంక్ జాబ్ కు రిజైన్.. యువతి పోస్ట్‌ వైరల్‌

దుబాయ్‌లో ఫుల్ హ్యాపీ మూడ్‌లో ఉన్న సామ్‌.. త్వరలోనే పెళ్లి